pizza

Vijay 66 for Diwali
దీపావ‌ళికి పాన్ ఇండియా ప‌టాకాను ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు

You are at idlebrain.com > news today >
Follow Us

24 January 2022
Hyderabad

Dil Raju is doing a bilingual with Tamil superstar Vijay as hero. This film will be directed by hit director Vamshi Paidipally. Shooting of this Pan India film will start in the month of March. Producer Dil Raju wants to aim this film for Diwali which is the biggest film season for Tamil Nadu. This is going to be Vijay’s first straight Telugu film. Currently Vijay is doing the ‘Beast’ film in which Pooja Hegde is the heroine.

Dil Raju is also producing Ram Charan and Shankar combination film. He is going to release this film for Sankranthi 2023.

దీపావ‌ళికి పాన్ ఇండియా ప‌టాకాను ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మంచి స్పీడు మీదున్నారు. స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్ట్స్, పాన్ ఇండియా సినిమాల‌ను రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న చేస్తున్న పాన్ ఇండియా మూవీస్ రెండు. అందులో ఒక‌టి RC15. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. దీంతో పాటు త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడైన ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో ఓ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో చేయ‌బోతున్న‌ట్లు దిల్ రాజు అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.దిల్ రాజుకు ఎంతో స‌న్నిహితుడైన‌ వంశీ పైడ‌పల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. హీరో విజ‌య్ చేస్తున్న స్ట్ర‌యిట్ తెలుగు మూవీ కూడా ఇదే.

విజయ్ 66వ చిత్ర‌మిది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ గురించి ప్ర‌స్తావించారు. మార్చి నుంచి విజ‌య్ 66 సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామ‌ని, ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అంటే మ‌రో మెయిన్ ఫెస్టివ‌ల్‌ను దిల్ రాజు టార్గెట్ చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఎందుంక‌టే RC15 సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి ఆయ‌న రెడీ అయిపోతున్నారు మ‌రి. అంత కంటే ముందే విజ‌య్ 66వ సినిమాతో దీపావ‌ళికి సంద‌డి షురూ చేయ‌బోతున్నారన్న‌మాట‌.

ప్ర‌స్తుతం విజ‌య్ త‌న 65వ చిత్రం బీస్ట్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపుకు చేరుకుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved