pizza

Vijay Deverakonda is a big fan of Mahesh Babu
సూపర్‌స్టార్‌ మ‌హేష్‌కి పెద్ద అభిమానిని: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

You are at idlebrain.com > news today >
Follow Us

23 January 2022
Hyderabad

Vijay Deverakonda shared that he is a big fan of Mahesh Babu. The first Mahesh Babu’s movie he saw in a theater was Murari. He was on cloud 9 when Mahesh Babu tweeted about Vijay’s performance in Pelli Choopulu. Vijay Deverakonda’s pan India film Liger in the direction of Puri Jagan will release on 25 August.

సూపర్‌స్టార్‌ మ‌హేష్‌కి పెద్ద అభిమానిని: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’ వంటి చిత్రాల‌తో టాలీవుడ్ స్టార్‌గా ఎదిగిన విజ‌య్ దేవ‌ర‌కొండ ‘నోటా, టాక్సీవాలా, డియ‌ర్ కామ్రేడ్’ వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఇండ‌స్ట్రీలో త‌న క్రేజ్‌ను పెంచుకుంటూ వ‌చ్చారు. ముఖ్యంగా యూత్‌లో త‌న‌దైన బ్రాండ్‌ను, ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఫ్యాన్స్, ఫాలోవ‌ర్స్‌ను అభిమానంగా రౌడీస్ అని పిలుచుకుంటారు. అలాగే ఆయ‌న ఫ్యాన్స్‌, ఫాలోవ‌ర్స్ ఆయ‌న్ని రౌడీ స్టార్ అని ప్రేమగా పిలుచుకుంటారు. మరి ఈ యంగ్ హీరో ఎవ‌రికి పెద్ద అభిమానో తెలుసా!.. ఇంకెవ‌రు మ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్‌కి. ఈ విషయాన్ని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

‘‘నేను ఇండస్ట్రీలోని వ్యక్తినే అయినా మహేష్ బాబు అంటే నాకు ఇష్టం. ఆయ‌న ‘మురారి’ సినిమాను తొలిసారిగా థియేట‌ర్‌లో చూశాను. ఇప్పుడు అంటే మ‌ల్లీప్లెక్స్ థియేట‌ర్స్‌, ఆన్ లైన్ బుకింగ్స్ అని వ‌చ్చాయి కానీ.. అప్ప‌ట్లో అవి లేవుగా. సినిమా స్టార్టింగ్ టైమ్‌కు గంట ముందు వెళ్లినా టిక్ దొరుకుతుందో లేదో తెలియ‌ని ప‌రిస్థితి. అయినా టికెట్ దొర‌క‌బుచ్చుకుని సినిమా చూశాను. అలాంటి నా అభిమాన హీరో, నేను హీరోగా న‌టించిన తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ విడుద‌లైన త‌ర్వాత నా యాక్టింగ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అది చూడ‌గానే ప్ర‌పంచాన్నే జ‌యించినంత ఆనందం వేసింది’’ అన్నారు విజయ్ దేవరకొండ.

మహేష్ తర్వాత బాలీవుడ్ స్టార్ రణ్‌భీర్ క‌పూర్ న‌ట‌నను విజ‌య్ దేవ‌ర‌కొండ బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ప్ర‌స్తుతం మ‌న రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లైగ‌ర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్ థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా ‘లైగర్’ షూటింగ్‌ను ఆపారు. ఈ సినిమాను ఆగ‌స్ట్ 25న విడుద‌ల చేయాల‌నేది ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న‌. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved