pizza
Vishal in Temper remake
మాస్ హీరో విశాల్ హీరోగా ‘టెంపర్’ రీమేక్
You are at idlebrain.com > news today >
Follow Us

18 March 2016
Hyderaba
d

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి కమర్షియల్‌ విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ హీరోగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో నల్లమలుపుబుజ్జి, ఠాగూర్ మధు, బండ్ల గణేష్ లు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ...

చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు మాట్లాడుతూ ‘’తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందిరికీ తెలసిందే. ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళంలో విశాల్ హీరోగా రీమేక్ చేయనున్నాం. పందెంకోడి, పొగరు వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలతో తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న విశాల్ తో ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించనుండటం చాలా హ్యపీగా ఉంది. విశాల్ కు కొత్త బాడీ లాంగ్వేజ్ ను ఆపాదించే చిత్రంగా ఈ చిత్రం ఓ ట్రేడ్ మార్క్ క్రియేట్ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్, దర్శకుడు సహా ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved