pizza
Varun Tej #VT10- Kiran Korrapati film first schedule completed, film release on 30 July
వ‌రుణ్ తేజ్ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి..జూలై 30న సినిమా విడుద‌ల
You are at idlebrain.com > news today >
Follow Us

12 March 2020
Hyderabad

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌కు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్‌. గత ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్` చిత్రాలతో సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. జూలై 30న సినిమాను విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్రపాటి మాట్లాడుతూ - ``వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్ర‌మిది. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతుంది. ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకుని వ‌రుణ్‌గారు చాలా మేకోవ‌ర్ అయ్యారు. ఫిబ్ర‌వ‌రి 24న సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. తొలి షెడ్యూల్‌ను వైజాగ్‌లో 15 రోజుల పాటు చిత్రీక‌రించాం. హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్‌తో పాటు న‌వీన్ చంద్ర‌, న‌దియాల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఏప్రిల్ 3న కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో స్టార్ట్ చేయ‌బోతున్నాం. ఈ లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. జూలై 30న సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం. మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీతం , జార్జ్ సి.విలియ‌న్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె.వెంక‌టేశ్‌గారు ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు’’ అన్నారు.

నటీనటులు:
వ‌రుణ్ తేజ్‌, స‌యీ మంజ్రేక‌ర్‌, న‌దియా, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
సినిమాటోగ్ర‌ఫీ: జార్జ్ సి.విలియ‌మ్స్‌
మ్యూజిక్‌: త‌మ‌న్‌.ఎస్‌
ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
నిర్మాత‌లు: సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్‌
ద‌ర్శ‌క‌త్వం: కిర‌ణ్ కొర్ర‌పాటి



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved