pizza
Every Indian Should Watch Wild Dog: Chiranjeevi
తెలుగు వాళ్ళుగా మనమంతా గర్వపడే గొప్ప సినిమా 'వైల్డ్ డాగ్’ - మెగాస్టార్ చిరంజీవి.

You are at idlebrain.com > news today >
 
Follow Us

5 April -2021
Hyderabad

Megastar Chiranjeevi has surprised everyone last night by heaping Praises on Nagarjuna's Wild Dog in Twitter. The Megastar seems to be very impressed that he called for a Pressmeet the very next day (today morning) to appreciate the movie and the team behind it. Here is what Nagarjuna and Chiranjeevi said at the event.

"I got a surprise call last night from Chiranjeevi garu. I was thinking why Chiranjeevi garu is calling me at this hour. But he is very excited and animated. He spoke at length about how good the film is. He even told me how he did not even take break at interval while watching the movie. He himself offered to come before media and appreciate our team. Thanks a lot for that," Nagarjuna said.

"It may be the first of its kind that a guest like me wanted to have a Pressmeet himself to appreciate a film. I am always happy to share something good to everyone. This is a proud film for us. I thought a film made from real incidents may be bland. But once I watched the film, I got adrenaline rush. I did not even take interval. I watched the film sitting at the edge of the seat. I thank the audience who are appreciating such an honest attempt," Chiranjeevi said.

"Uri got nationwide appreciations and awards. I always wanted to such films in Telugu after watching Uri. I feel proud that Nagarjuna did that. Some of the war sequences and action sequences are of international standards. I felt very emotional as an Indian. I clapped for the scene Nagarjuna says a powerful dialogue to the villain. I was left in awe. It almost prompted me to stand and salute saying Jai Hind at the end. Director Solomon did a fantastic job doing such an honest film and in a limited budget. We will react whenever such terror attacks happen but we do not know how our agencies work hard to punish them. That hard work is showcased very well in the movie. The response for Wild Dog is also indication of changing mindset of the audience," the Megastar added.

Niranjan Reddy, the producer of Wild Dog said, "We have a title card saying From the Makers of Kshanam and Ghazi in the credits. Chiranjeevi garu appreciated the film and asked us to use 'From the makers of Kshanam, Ghazi, and Wild Dog' from now. We are humbled by his appreciation. Thank you very much sir".

తెలుగు వాళ్ళుగా మనమంతా గర్వపడే గొప్ప సినిమా 'వైల్డ్ డాగ్’ - మెగాస్టార్ చిరంజీవి.

కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ ఏప్రిల్‌ 2న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ఐఏ ఆఫీసర్, ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా ఇటీవల ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఎంతకాలమైంది ఇలా లైవ్ లో మనమంతా కలుసుకొని. ఇలా మీ అందరితో మీట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజానికి పత్రికల్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి మనం ఇంటరాక్ట్ అవ్వడం మిస్ కావడం లేదు.. కానీ, ఇలా నేరుగా కలుసుకోవడం, మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈ కరోనా క్రైసిస్ లో అన్నీ అధిగమించి అందరూ ఆరోగ్యంగా బాగుండాలని నేను కోరుకున్నాను. ఉంటారని ఆశిస్తున్నాను. ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే.. నిజంగా జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టండి నేను ఈ 'వైల్డ్ డాగ్' సినిమా గురించి చెప్పాలి అని నా ఆచార్య, అలాగే ఈ 'వైల్డ్ డాగ్' నిర్మాత నిరంజన్ రెడ్డి గారిని కోరినప్పుడు వెంటనే అరేంజ్ చేశారు. మంచి విషయాలు జరుగుతున్నపుడు పది మందితో పంచుకోవడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమా చూడగానే నాకు అదే అనిపించింది. మనమంతా గర్వపడే గొప్ప సినిమా ఇది. ఈ సినిమా రావడానికి ముందు నా నిర్మాత కొన్ని విషయాలు చెప్పాడు తప్ప నాకు పెద్ద క్యూరియాసిటీ లేదు. గోకుల్ చాట్.. ఒక వాస్తవ కథను తెరకెక్కిస్తున్నారు.. సాంగ్స్ ఉండవు, రొమాంటిక్ సీన్స్ ఉండవు.. నాగ్ సినిమా అంటే ఇవన్నీ ఊహిస్తాం కానీ అవేవీ ఉండవు కాబట్టి డ్రైగా ఉంటుందని అనుకున్నా. కానీ ఈ సినిమా చూసేటప్పుడు ఆద్యంతం ఉత్కంఠగా అనిపించింది. చివరకు ఇంటర్వెల్ కూడా ఆపకుండా చూశానంటే ఈ సినిమా మీద నా ఇంట్రెస్ట్ చివరిదాకా ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంటనే నాగ్ కి ఫోన్ చేసి ఈ సినిమాను ఎందుకు లో ప్రొఫైల్ లో ఉంచారు. ఎందుకు తక్కువ మాట్లాడారని అడిగా. సీట్ ఎడ్జ్ లో కూర్చొని ఈ సినిమా చూశానని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ సినిమా గురించి నిజం చెప్పాలంటే మాటల్లేవు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ చెప్పారు. చాలా ఆదరించారు. వాళ్లందరికీ చిత్రయూనిట్ తో పాటు నేను కూడా థాంక్స్ చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించా. వాస్తవ ఘటనలకు దగ్గరగా ఈ సినిమాను చాలా సహజంగా తీశారు. మనకు తెలిసి సర్జికల్ స్ట్రైక్ మీద తీసిన 'యూరి' సినిమాకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఆ సినిమా చూసి మనం ఎందుకు ఇలాంటి సినిమా తీయలేకపోతున్నాము. మనం ఈ కమర్షియల్ ట్రాక్ లో పడిపోయి ఉన్నామా అనుకుంటున్న సమయంలో ప్రయోగాత్మక సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమా చేయడం చాలా గర్వంగా ఫీల్ అయ్యా. ఎస్, తెలుగు వాళ్లుగా ఇలాంటి సినిమాలు తీయగలం అని నిరూపించిన సినిమా ఈ వైల్డ్ డాగ్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్న వార్ సీన్స్, గన్ ఫైట్స్ బాగా నచ్చాయి.

ఈ సినిమాకు మూల పురుషుడు సాల్మన్. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అని పెట్టుకున్న ఆయన నమ్మకాన్ని నేను అభినందిస్తున్నా. చాలా ఫెంటాస్టిక్ జాబ్. ఇంత తక్కువ రోజుల్లో ఈ బడ్జెట్ లో సినిమా తీయడం గ్రేట్. నాగ్ అనేసరికి రొమాంటిక్ సీన్స్, ఫైట్స్ ఉంటాయని ప్రేక్షకులు భావిస్తారని అనుకున్నా కానీ నేటితరం ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు కూడా ఆదరిస్తారని అర్థమైంది. ఇలాంటి మార్పు కోరుకుంటున్న ప్రేక్షకులకు నిజంగా సెల్యూట్ చేయాలి. ఇది నా సొంత సినిమా అనే ఫీలింగ్ కలిగింది. అందుకే ఈ ఆనందాన్ని మీతో ప్రత్యక్షంగా షేర్ చేసుకోవాలనే ఈ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి కొత్త కథలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. 'ఆల్రెడీ ఈ సినిమా గురించి మొన్న ప్రెస్ మీట్ లో చెప్పుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి చాలా ప్రశంసలు వచ్చాయి. కానీ నిన్న రాత్రి 9 గంటలకు చిరంజీవి కాల్ చేసి ఈ సినిమా ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అంటూ పొగిడారు. చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సినిమా చేసినందుకు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యా. ఇంటర్వెల్ కూడా లేకుండా సినిమా చూశాను అని చిరంజీవి గారు అన్నారు థాంక్యూ సో మచ్. అలాగే ప్రెస్ మీట్ పెట్టండి నేను ఈ సినిమా గురించి మాట్లాడాలి అనడం చాలా సంతోషంగా ఉంది'' అన్నారు.

చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ''సినిమా గురించి ఆల్రెడీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఒకేఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. నిన్న చిరంజీవి గారు ఫోన్ చేసి ఈ సినిమాను ప్రశంసించారు. ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసినప్పుడు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ మేకర్స్ ఆఫ్ క్షణం, ఘాజీ అని వేసుకున్నాం. కానీ నిన్న చిరంజీవి కాల్ చేశాక ఇక తదుపరి సినిమాకు మేకర్స్ ఆఫ్ క్షణం, ఘాజీతో పాటు వైల్డ్ డాగ్ అని వేసుకుంటాం అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. థాంక్యూ సో మచ్'' అన్నారు.

డైరెక్టర్ అహిషోర్ సాల్మన్ మాట్లాడుతూ.. ''ఇక్కడికొచ్చిన మీడియా మిత్రులందరికీ థాంక్స్. ఇకాడికి మనమంతా రావడానికి కారణం నిన్న రాత్రి చిరంజీవి గారు ఈ సినిమా చూసి బాగుందని ట్వీట్ చేయడం. నిజంగా నాకు ఈ రోజు ఎంతో పరిపూర్ణం. వైల్డ్ డాగ్ సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు'' అన్నారు.

   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved