pizza
Yuddham Sharanam gets U/A certificate, film release on 8 September
`యుద్ధం శ‌ర‌ణం` సెన్సార్ పూర్తి..సెప్టెంబ‌ర్ 8న గ్రాండ్ రిలీజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

4 September 2017
Hyderabad

యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `యుద్ధం శ‌ర‌ణం`. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.ఈ సంద‌ర్భంగా..

వారాహి చ‌ల‌న చిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ``అక్కినేని నాగ‌చైత‌న్య న‌ట‌న‌లోని మ‌రో యాంగిల్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చేస్తూ కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ యుద్ధం శ‌ర‌ణం. ఈ చిత్రం సెన్సార్ కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను సెప్టెంబ‌ర్ 8న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్రేక్ష‌కులు, అక్కినేని అభిమానులను అల‌రించేలా యుద్ధం శ‌ర‌ణం సినిమా ఉంటుంది`` అన్నారు.

ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved