pizza
YVS Chowdary & Raghavendra rao Birthday on 23 May
You are at idlebrain.com > news today >
Follow Us

22 May 2015
Hyderabad

విశ్వ విఖ్యాత నటరత్న నందమూరి తారక రామ రావు దివ్య మోహన రూపానికి ఆకర్షితుడై, తెలుగు సినిమా రంగం లోకి ప్రవేశించిన యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి పుట్టిన రోజు ఈనాడు. మే 23న గురు శిష్యులైన కె .రాఘవేంద్ర రావు , వై .వి .యస్ .చౌదరి ల పుట్టిన ఒకే రోజు కావడం విశేషం .ఆయన పుట్టిన రోజు సందర్భంగా సింహావలోకనం చేసుకుంటే....

80వ దశకం లో తెలుగు సినిమా రంగం లోకి ప్రవేశించి, కె .రాఘవేంద్ర రావు, రామ్ గోపాల్ వర్మ, మహేష్ బట్, కృష్ణ వంశీ ల వద్ద దర్శకత్వ శాఖ లో పని చేసి ,అక్కినేని నాగార్జున సొంత బ్యానర్ లో 'శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి ' చిత్రం తో దర్శకుడిగా మారాడు. ఎన్నో ఏళ్ళుగా మేకప్ వేయని నందమూరి హరి కృష్ణ తో, అక్కినేని నాగార్జున, కాంబినేషన్ లో 'సీతా రామ రాజు ', మహేష్ తో 'యువరాజు ', చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తరువాత 'బొమ్మరిల్లు వారి ' అని తన సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి 'లాహిరి లాహిరి లాహిరిలో, చిత్రం స్వీయ దర్శకత్వం లో నిర్మించారు. నందమూరి హరి కృష్ణ తో పాటు భారి తారగణం తో రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ గా నిలచింది. ఆ తరువాత మళ్లి హరి కృష్ణ, సిమ్రాన్ తో 'సీతయ్య ' రామ్ ఇలియానా పరిచయం చేస్తూ 'దేవదాసు' , నట సింహం బాల కృష్ణ తో 'ఒక్క మగాడు' ఇటివల విడుదలైన 'రేయ్' చిత్రాలు స్వీయ దర్శకత్వం లో నిర్మించారు.వై .వి .యస్ .చౌదరి దర్శకత్వం వహించినవి తొమ్మిది చిత్రాలైతే ప్రొడ్యూస్ చేసిన చిత్రాలు ఆరు. సినీ పరిశ్రమ లో సక్సెస్స్ ప్లాప్స్ అనేవి సహజమే,కాని వై వి యస్ విషయానికొస్తే, విజయాలే ఎక్కువ. ఆయన తీసే ప్రతీ సినిమా గ్రాండియర్ ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. తన బ్యానర్ అయిన వేరే బ్యానర్ అయిన కర్చు కు ఏ మాత్రం వెనుకాడని దర్శకుడు వై వి యస్.ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమకు వెంకట్ ,చాందిని , ఆదిత్య ఓం ,అంకిత , రామ్ , ఇలియానా, సాయి ధరం తేజ్ లాంటి సక్సెస్స్ ఫుల్ నటి నటులను పరిచయం చేసారు. తెలుగు సినీ పరిశ్రమ లో అన్ని రంగాల్లో అనుభవం గడించిన చౌదరి, దర్శక నిర్మాత గానే కాకుండా, మంచి కధకుడుగా, పంపిణి దారిడిగా ,ప్రదర్శనదారుడిగా కూడా ఖ్యాతి గడించాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫోన్ లో (ఇండియా లో లేరు ) ఆయన మాట్లాడుతూ : " విశ్వ విఖ్యాత నటరత్న నందమూరి తారక రామ రావు పై వున్నా అభిమానంతో తెలుగు సినీ పరిశ్రమ లో రావడం జరిగింది. నాతో పని చేసిన వారందరి సహకారంతో నేను నిర్మించిన , దర్శకత్వం వహించిన చిత్రాలని ఆదరించిన ప్రేక్షక మహాశయులకు, అందరు అభిమానులకు నా ధన్య వాదాలు. ఇంకా మున్ముందు కూడా మీ ఆదరణ ఈలాగే ఉంటుందని ఆశిస్తూ న్నాను. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయం ఇండియా కి వచ్చిన తరువాత చెపుతాను" అని మాట్లాడారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved