pizza
Zombie film song launched
'జీ' చిత్ర మొదటి పాటను విడుదల చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాధ్ రావ్
You are at idlebrain.com > news today >
 
Follow Us

19 September -2020
Hyderabad


జాంబీ వైరస్ మీద తెలుగులో మొదటగా సినిమా తీస్తున్న మహిళా దర్శకురాలు దీపిక. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే దీపిక సినిమా మేకింగ్ పట్ల ఆసక్తితో జాంబీస్ వైరస్ మీద జీ జాంబీ సినిమా చేయడం జరిగింది. ఆర్యన్ గౌర, దివ్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల నిర్మాత రాజ్ కందుకూరి గారు విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ "ది జాంబీ.. ను సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాధ్ రావ్ గారు విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు నక్కిన త్రినాధ్ రావ్ మాట్లాడుతూ...
యంగ్ టీమ్ కలసి చేస్తున్న ఈ జీ జాంబీ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. హీరో ఆర్యన్, దర్శకురాలు దీపికా అలాగే ఈ సినిమాకు పనిచేసిన ఇతర టెక్నీషియన్స్ నటీనటులకు బెస్ట్ విషెస్ తెలువుతున్నాను. ఫస్ట్ సాంగ్ 'ది జాంబీ సాంగ్' వినడానికి క్యాచీగా ఉంది. కొత్త కాన్సెప్ట్స్ తో వస్తోన్న సినిమాలు కచ్చితంగా ప్రేక్షకుల ప్రశంశలు పొందుతాయి. అలాగే ఈ సినిమా విజయం సాధించి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న అన్నారు.

ఈ సందర్భంగా దర్శకురాలు దీపిక మాట్లాడుతూ....
జీ జాంబీ సినిమా ఫస్ట్ సాంగ్ నక్కిన త్రినాధ్ రావు గారు విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. సినిమా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. మేము కష్టపడిన దానికి ప్రేక్షకులు మంచి ఫలితం ఇస్తారని భావిస్తున్నాము. ఆడియన్స్ థ్రిల్ అయ్యే ఎన్నో హారర్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మా సినిమాకు పని చేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థియేటర్స్ లో విడుదలై మా సినిమా కచ్చితంగా మంచి పేరును తెచ్చిపెడుతోంది భావిస్తున్నానని తెలిపారు.

హీరో ఆర్యన్ మాట్లాడుతూ...
జీ జాంబీ సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ను విడుదల చేసిన నక్కిన త్రినాధ్ గారికి ధన్యవాదాలు. జీ జాంబీ టైటిల్ సాంగ్ అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతోంది. వినోద్ కుమార్ (విన్ను) సంగీతం, రాంబాబు గోసాల లిరిక్స్ పాటకు మరింత అందాన్ని తెచ్చాయి. ఆడియన్స్ థ్రిల్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. త్వరలో ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు.

నటీనటులు:
ఆర్యన్ గౌర, దివ్య పాండే, రాజశేఖర్, బాంబయి పద్మ, హర్ష, యువ, శరత్, విజయ్, నేత్ర, జస్వంత్, చరణ్, రాగ సుస్మిత, సిద్దు, మహేష్, మదన్, గౌతమ్, చిస్టి, మనోజ్, హర్ష సాదుల, మురారి, హర్ష వర్ధన్ రెడ్డి.

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్స్: ఆర్యన్, దీపికా
కెమెరామెన్: రాజశేఖర్
మ్యూజిక్: వినోద్ కుమార్ (విన్ను)
లిరిక్స్: రాంబాబు గోసాల
కో డైరెక్టర్: పవన్
అసోసియేట్ డైరెక్టర్: జన్న ప్రసాద్
అసిస్టెంట్ డైరెక్టర్స్: నరేష్, లోకేష్

 

 

 


 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved