pizza
Teja Sajja, Prasanth Varma’s Zombie Reddy Releasing On February 5th
తేజ స‌జ్జా, ప్ర‌శాంత్ వ‌ర్మ ఫిల్మ్ 'జాంబీ రెడ్డి' ఫిబ్ర‌వ‌రి 5 విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

12 January -2021
Hyderabad

KKGKGF: Chapter 1 was a huge hit, are you expecting KGF: Chapter 2 to break all records?

 

Director Prasanth Varma’s third film Zombie Reddy that marks debut of Teja Sajja as hero features Anandhi and Daksha playing the leading ladies. The makers previously announced to release the film for Sankranthi. But, they have postponed it to February 5th.

Prashanth Varma in his video byte said, “Sankranthi wishes to one and all. Ravi Teja’s Krack was released recently and is running successfully in theatres. I’m very happy for him. My hearty congratulations to the entire team of Krack. I wish all the best for next films releasing for Pongal. Zombie Reddy was scheduled for Pongal release. We had even announced it earlier. I’ve got numerous calls and messages. Industry bigwigs suggested me to postpone the film. Taking their advice, we have put in our Zombie Reddy in quarantine. Very soon, which is February 5th; Zombie Reddy is going to come to theatres to entertain you. Please everyone do wear mask and come to theatres. Please do remember the date Feb 5th and do watch the film only in theatres.”

Prashanth Varma is coming up with yet another high-concept film introducing Zombie concept to Tollywood. It indeed is the first film made on corona.

The film’s theatrical trailer that was released for New Year to overwhelming response and it set the bar high on the film. The quarantine time of Zombie Reddy ends by February 5th.

Here's technical crew of the film:

1. Writer & Director - Prasanth Varma
2. Producer - Raj Shekar Varma
3. Production House - Apple Tree Studios
4. Screenplay - Scriptsville
5. DOP - Anith
6. Music - Mark K Robin
7. Production Designer - Sri Nagendra Tangala
8. Editor - Sai Babu
9. Executive Producers - Anand Penumetcha, Prabha Chintalapati
10. Line Producer - Venkat Kumar Jetty
11. Publicity Designer - Ananth
12. Costume Designer - Prasanna Dantuluri
13. Sound Design - Nagarjuna Thallapalli
14. Stills - Varahala Murthy
15. PRO - Vamsi Shekar

 

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందిస్తోన్న మూడో చిత్రం 'జాంబీ రెడ్డి'తో తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇదివ‌ర‌కు సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఇప్పుడు విడుద‌ల‌ను ఫిబ్ర‌వ‌రి 5కు మార్చారు.

ఈ విష‌యాన్ని ఓ వీడియో బైట్ ద్వారా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ వెల్ల‌డించారు. "అంద‌రికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్ష‌లు. ఇటీవ‌ల రవితేజ హీరోగా న‌టించిన 'క్రాక్' సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లై స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఇది నాకెంతో ఆనందాన్ని క‌లిగిస్తోంది. మొత్తం 'క్రాక్' టీమ్‌కు నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న త‌దుప‌రి చిత్రాల‌కు ఆల్ ద బెస్ట్‌. 'జాంబీ రెడ్డి' మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకున్నాం. ఆ విష‌యాన్ని ఇప్ప‌టికే అనౌన్స్ చేశాం. ఈ విష‌యంలో నాకు ప‌లు ఫోన్లు, మెసేజ్‌లు వ‌చ్చాయి. సినిమాను పోస్ట్‌పోన్ చేయాల్సిందిగా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు సూచించారు. వారి సూచ‌న మేర‌కు 'జాంబీ రెడ్డి'ని మేం క్వారంటైన్‌లో పెట్టాం. త్వ‌ర‌లోనే, ఫిబ్ర‌వ‌రి 5న 'జాంబీ రెడ్డి' థియేట‌ర్ల‌కు వ‌చ్చి, మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తాడు. ద‌య‌చేసి ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించి థియేట‌ర్ల‌కు రండి. ఫిబ్ర‌వ‌రి 5వ తేదీని గుర్తుంచుకొని, థియేట‌ర్ల‌లోనే ఫిల్మ్‌ను చూడండి." అని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌న ముందుకు వ‌స్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం 'జాంబీ రెడ్డి' కావ‌డం గ‌మ‌నార్హం.

నూత‌న సంవ‌త్స‌రారంభం సంద‌ర్భంగా విడుద‌ల చేసిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. దీంతో 'జాంబీ రెడ్డి'పై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఆ అంచ‌నాల‌ను అందుకొనేందుకు ఫిబ్ర‌వ‌రి 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ వ‌ర్మ‌
నిర్మాత‌: రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ‌
బ్యాన‌ర్‌: యాపిల్ ట్రీ స్టూడియోస్‌
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌విల్లే
సినిమాటోగ్ర‌ఫీ: అనిత్‌
మ్యూజిక్‌: మార్క్ కె. రాబిన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: శ్రీ‌నాగేంద్ర తంగ‌ల‌
ఎడిటింగ్‌: సాయిబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: ఆనంద్ పెనుమ‌త్స‌, ప్ర‌భ చింత‌ల‌పాటి
లైన్ ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ కుమార్ జెట్టి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

 

 

 

 

 

 

 




   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved