pizza
Andhra Pradesh Muslim Association of North America (AMANA) meeting
ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (AMANA) -- ఆత్మీయ సమావేశం
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

21 August 2019
USA

అమెరికా లో నివశిస్తున్న తెలుగువారిలో - అందరితో పాటు ,ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా గణనీయమైన సంఖ్య లో నివశిస్తున్నారు !

అమెరికా లో ఎక్కువగా ఉన్న తెలుగు వారిలో, తక్కువ సంఖ్యా లో ఉన్న ముస్లిం కుటుంబాలకు ఒక వేదిక లేకపోవడం, తమ ఆధ్యాత్మిక అవసరాలకు అంతర్జాతీయ ముస్లిం సమాజం లో ఒకరుగా కలిసిపోయిన, తాము పుట్టి పెరిగిన ఆంధ్ర ప్రదేశ్ మూలాలను గుర్తు పెట్టుకుని అనుసంధానం అవడానికి, తెలుగు వారందరితో పాటు తాము కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రగతి లో పాలు పంచుకోవడానికి ఒక వేదిక అవసరాన్ని గ్రహించి ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా ని స్థాపించాలన్న తమ చిరకాల ఆలోచనను ఈ సమావేశం లో ఒక కార్యరూపం ఇవ్వడం జరిగింది.

స్థానిక అలెన్ లో డాక్టర్ అబ్దుల్ రహమాన్ నివాసం లో దాదాపు 15 ముస్లిం కుటుంబాలు సమావేశమయ్యి, ఆంధ్ర ప్రదేశ్ ముస్లిముల ప్రాతినిధ్యం గురించి, తెలుగు సమాజం లో మమేకవ్వడం గురించి, అమెరికా లో నివసిస్తున్న ఆంధ్ర ముస్లిం లను ఒక వేదిక మీదకు తీసుకువచ్చి వారి సామాజిక, సాంఘిక అవసరాలలో తోడ్పాటు అందించడం గురించి చర్చించుకున్నారు.

ఈ సమావేశాం లో డాక్టర్ అబ్దుల్ రహమాన్ తో పాటు, డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, మహమ్మద్ ఇక్బాల్ గగ్గుతురు, అక్బర్ సయ్యద్, షాజహాన్ షేక్, మస్తాన్ షేక్, షఫీ మహమ్మద్, ముజాహిద్ షేక్, ఫైజ్ షేక్, కాలిఫోర్నియా నుంచి అబ్దుల్ ఖుద్దూస్, జాకిర్ మహమ్మద్ మరియు నసీం షేక్ పాల్గొన్నారు!


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved