pizza
NATS 5th America Sambaralu - Sahitya Vedika
5 వ అమెరికా తెలుగు సంబరాల్లో తెలుగు కు పెద్ద పీట వేసిన నాట్స్
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

01 July 2017
శాంబర్గ్, చికాగో

ఈ 5 వ తెలుగు సంబరాల్లో సాహితీ కార్యక్రమం ప్రధాన స్టేజ్ పై జరగటం ఓ ప్రత్యేక ఆకర్షణ. దీన్ని బట్టే చెప్పచ్చు నాట్స్ తెలుగు భాషా సేవకి ఇస్తున్న స్థానం.

ఈ రోజు నామిని సుబ్రహ్మణ్య నాయుడు పచ్చనాకు సాక్షిగా మూలింటామెతో మిట్టూరోడి కతలు, చిన్నబ్బ కతలు చిత్తూరు మాండలికంలో అద్భుతంగా చెప్పి PV నరసింహారావు వంటి ఉద్దండులతోనే శభాష్ అనిపించుకున్న మన రాయలసీమ రత్నం కాదు కాదు మన తెలుగు రత్నం ఒక రచయిత గా. తన అనుభవాలు పంచుకున్నారు. డా. సామల రమేష్ నాయుడు అమ్మనుడి సంపాదకుడిగా, తెలుగు భాషోద్యమ కార్యకర్తగా తెలుగే ఊపిరిగా ఉంటూ అచ్చ తెలుగు అందరి నాలుకలమీద ఉండాలని ఆరాట పడే మన పోరాట వీరుడు భాషోద్యమకారునిగా ఏమి చెయ్యాలిసి ఉంది అన్నదానిపై తన భావాలు పంచుకున్నారు ప్రభుత్వ కార్యాలలో, ప్రభుత్వ అధికారిక ఉత్తర్వు లలో ప్రభుత్వాలు తెలుగు భాషపై కలిగి ఉండాల్సిన నిబద్ధత మీద తన అభిప్రాయాన్ని కుండా బ్రద్దలు కొట్టినట్టు వివరించారు.

జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పది శతకాలు రాసి, తన అద్భుత పేరడీలతో శ్రోతలను ముగ్ధులను చేసి సభను దద్దరిల్లజేయగల తెలుగు వేదకవి. నిత్య జీవితం లో తెలుగు దాని ప్రాముఖ్యత పై వివరిస్తూ దశావతార స్తుతి పై నట్టువాంగానికి, తబలా కి కూడా అనుగుణంగా సాగే ఒక సరికొత్త కంద పద్యాన్ని వినిపించి ఆహూతులను రంజింప చేసారు.

ఆరి సీతారామయ్య కీన్యా టు కీన్యా, గట్టు తెగిన చెరువు లాంటి గుండెకు హత్తుకునే కతల దొంతరలను రాసి కూర్చిన మన ఆత్మీయుడు ప్రామాణిక భాష ఆవశ్యకత పై ఒక ప్రవాస రచయితగా తన భావాలు పంచుకున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved