pizza
Anup Rubens Musical Concert in Irving, Texas
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

17 July 2015
Hyderabad

The Dallas chapter of NATS in coordination with People Media successfully conducted Anup Rubens Musical Extravaganza and Comedy show by the very famous ETV Zabardasth team on July 18th, 2015 at Irving High School Auditorium, Dallas. The event was attended by more than 1200 people who joined hands with Anup Rubens every step of the way. It was a spectacular sight with Anup Rubens performing with Live orchestra and an exemplary group of singers for the very first time in Dallas. The program was kicked off by the Zabardasth comedy team members. They enthralled the audience with talking doll, hilarious skits and many other humorous performances.

Once Anup Rubens took stage, it was non stop foot tapping, high energy performances. The entire audience were constantly on their feet dancing, cheering and immersing in the superb renditions of many popular songs. The highlight of the program was when 20 Dallas kids trained by Anup Ruben himself gave their voice to the all time hit “Kani pinchina” song from Manam.

In addition, songs from several hit movies like “Temper, Gopala Gopala, Gundejaari Gallataiinyindi” were performed that got audiences to the stage and dance along with artists. The program ran full house for 4 hours with nearly 30 songs making audience wanting more and more. The event was supported by many local businesses, enthusiasts and NATS supporters. Media support was provided by Yuva Media , Desi Plaza, TV9 and TV5. Delicious Indian food was provided by Hyderabad House. NATS and People Media are getting ready to conduct USA Paadhutha Teeyaga semifinals and finals on August 8th and 9th at Macarthur High School, Dallas.

ఇర్వింగ్, టెక్సాస్: పీపుల్స్ మీడియా సమన్వయంతో డల్లాస్ చాప్టర్ ఆఫ్ నాట్స్ నిర్వహించిన అనూప్ రూబెన్స్ సంగీత కోలాహలం కేక పుట్టించింది. ఇక ఈటీవీ జబర్దస్త్ టీమ్ పండించిన నవ్వులు పువ్వులు నవ్వుల లోకంలోకి తీసుకెళ్లాయి. మాట్లాడే బొమ్మ, స్కిట్స్, మరెన్నో హాస్యభరితమైన ప్రదర్శనలు వచ్చిన వారికి నవ్వుల విందును అందించాయి. ఈ కార్యక్రమానికి సుమారు 1200 మందికి పైగా హాజరయ్యారు. డల్లాస్ లోని ఇర్విన్ హై స్కూల్ ఆడిటోరియంలో జులై 18న నిర్వహించిన ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

ఇక అనూప్ రూబెన్స్ సంగీత హోరుతో అప్పటి వరకు ఉన్న వాతావరణం మారిపోయింది. అనూప్ రూబెన్స్ బీట్స్ ప్రతి ఒక్కర్ని ఉర్రూతలూగించింది. బీట్ పడడం ఆలస్యం చూడ్డానికి వచ్చిన వారు కాస్తా స్టెప్పులేయడం మొదలుపెట్టారు. టెంపర్, గోపాల గోపాల, గుండె జారి గల్లంతయ్యిందే వంటి సూపర్ హిట్ పాటలు వచ్చినప్పుడు కుర్చీని అంటిపెట్టుకుని ఉన్న వారంతా స్టేజ్ మీద కు వెళ్లి మరీ ఆర్టిస్టులతో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే సింగర్స్ గా మారిపోయారు పెదం కదిపారు కూడా. ముఖ్యంగా లైవ్ ఆర్కెస్ట్రా కావడం, సినీరంగంలోని ప్రముఖ సింగర్స్ పాడడంతో కార్యక్రమం లైవ్లీగా సాగింది. పైగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ డల్లాస్ లో నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ సంగీత విభావరిలో మరో హైలెట్ ఏంటంటే 20 మంది పిల్లలు కలిసి మనం సినిమాలోని కనిపెంచిన అనే పాటను పాడడం. స్వయంగా అనూప్ రూబెన్స్ చిన్నారులకు శిక్షణ ఇచ్చి మరీ పాడించడం జరిగింది.

సుమారు నాలుగు గంటల పాటు మ్యూజికల్ షో జరిగింది. ప్రేక్షకులు పాట అయిపోగానే మరో పాట అంటూ కోరడంతో మొత్తంమీద 30కి పైగా పాటలు పాడారు. మొత్తానికి స్థానిక వ్యాపారవేత్తలు, ఉత్సాహవంతులు, నాట్స్ మద్దతుదారులతో ఈ ఈవెంట్ ఘనంగా ముగిసింది. యువ మీడియా, దేశీ ప్లాజా, టీవీ9, టీవీ5 మీడియా సహకారాన్ని అందించాయి. ఇక ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ హౌస్ వెరైటీ రుచులను తయారుచేసింది.

త్వరలోనే నాట్స్, పీపుల్ మీడియా కలిసి పాడుతా తీయగా సెమీ ఫైనల్స్ నిర్వహించబోతున్నాయి. ఆగస్ట్ 8,9న డల్లాస్ లోని మకార్తుర్ హై స్కూల్ లో ఫైనల్స్ జరగబోతున్నాయి.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved