pizza
Chicago Andhra Association - Third Anniversary
చికాగో ఆంధ్ర సంఘం తృతీయ వార్షికోత్సవ వేడుకలు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

10 April 2019
USA

శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పండుగ రోజున (ఏప్రిల్ 6) హిందూ టెంపుల్ అఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో వెయ్యి మందికి పైగా పాల్గొన్న చికాగో ఆంధ్ర సంఘం తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఆనంద కోలాహలంగా జరిగాయి. సుమారు 300 మంది పిల్లలు పెద్దలు యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్న వివిధ గీతనృత్యాలు, పాటలు, హాస్య, పౌరాణిక నాటికలు, సంప్రదాయ భరతనాట్యం కూచిపూడి నాట్యాలు సభికులను ఆద్యంతమూ అలరించి ప్రేక్షకుల మెప్పును పొందాయి.

చికాగో ఆంధ్ర సంఘం వ్యవస్థాపకులు, కార్యవర్గ సభ్యులు సహా 125 మంది పైగా వాలంటీర్లు, 30 మంది నృత్య గురువులు 3 నెలలపాటు శ్రమించి ఈ కార్యక్రమం విజయానికి కృషిచేశారు. శ్రీచైత్య పొనిపిరెడ్డి నాయకత్వంలో జయశ్రీ సోమిశెట్టి, సవిత యాలమూరి-వెర్నేకర్, మల్లేశ్వరి పెదమల్లు, రాజ్ మునగా వేదికను అందంగా అలంకరించగా, ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక బృందం సభ్యులు సాహితి ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, సమత పెద్దమారు, పావని కొత్తపల్లి అందరి ప్రశంసలనూ పొందేలా చక్కగా కూర్చి ఆద్యంతమూ చురుకుగా నడిపించారు. ఆనాటి కార్యక్రమానికి సుందర్ దిట్టకవి, అన్విత పంచాగ్నుల, సవిత యాలమూరి-వెర్నేకర్, కార్తీక్ దమ్మాలపాటి వాఖ్యాతలుగా వ్యవహరించి తమ మాటలతో పాటలతో అలరించారు.

ఇల్లినాయిస్ రాష్ట్ర సెనేట్ కు ఎన్నికైన తొలి భారతీయుడు, తెలుగువాడు, ఆంధ్ర ప్రాంతంలో మూలాలున్న శ్రీ రామ్ విల్లివాలం ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసి యువతరాన్నుద్దేశించి ప్రసంగిస్తూ నేటి యువతరం డాక్టర్, ఇంజనీర్ వృత్తులనే కాకుండా నచ్చిన ఏ రంగంలోనైనా నిరంతర కృషితో తమ కలలను సాకారం చేసుకోవచ్చునని ప్రోత్సహించారు. ఫౌండర్స్ ప్రెసిడెంట్ దినకర్ కారుమూరి మాట్లాడుతూ రామ్ విల్లివాలం కూడా చిన్ననాటి నుంచి మన తెలుగు సంస్థలలో ప్రాతినిధ్యం వహించి, నేటి యువతకి మార్గదర్శనంగా నిలుస్తున్న వైనాన్ని కొనియాడారు.

ఈ సంధర్భంగా ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పద్మశ్రీ S.V. రామారావు గారికి చిత్ర లేఖనం, కవిత్వం, రచనా రంగాలలో వారు చేసిన విశేష కృషిని అభినందిస్తూ జీవిత సాఫల్య పురస్కారం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి చికాగో ఆంధ్ర సమితి సభ్యులే కాక చికాగో ఇండియన్ ఔట్ రీచ్ అసోసియేషన్ చైర్మన్ కృష్ణ బన్సల్ వంటి పలువురు విచ్చేసి చికాగో ఆంధ్ర సమితి సభ్యులకి ప్రోత్సహం అందించారు.

చికాగో ఆంధ్ర సంఘం వారి సేవా వభాగం APDFNA ప్రస్తుత మరియు భవిష్యత్ ప్రణాళికలను ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ వాణి దిట్టకవి వివరించారు.

ఉగాది సందర్భంగా షడ్రుచుల ఉగాది పచ్చడితో పాటు ఆంధ్ర ప్రాంత రుచులతో వడ్డించిన విందు మన మాతృభూమిని గుర్తు తెచ్చింది. మన తెలుగు ఆడపడుచులు స్వహస్తాలతో తయారు చేసిన కాజాలు, మామిడికాయ తురుము పచ్చడి అందరికీ నోరూరించి మెప్పించాయి.

సౌమ్య బొజ్జ, స్మిత నండూరి, నికిత మట్టే, శిల్ప రేపాల, ప్రశాంతి తాడేపల్లి, మాయా సుబ్రహ్మణ్యం, శైలజ సప్ప, సవిత మునగ, అర్చన శ్రీగడి, జయశ్రీ సోమిశెట్టి చిన్నారులతో చేయించిన నృత్య ప్రదర్శనలు అందర్నీ మురిపించాయి. గురు శ్రీమతి శేషుమాంబ గారి విద్యార్ధుల గజానన స్తుతి, గురు శ్రీమతి శ్వేత సురేశ్ కుమార్ విద్యార్ధులు గానం చేసిన కృష్ణాష్టకం, గురు శ్రీమతి రేఖ వేమూరి విద్యార్ధులు గానంచేసిన ముత్తుస్వామి దీక్షితుల కృతులు ఆకట్టుకున్నాయి.

గురు జానకి ఆనందవల్లి ఆధ్వర్యంలో మల్లారి, గురు ఆశా ఆచార్య శిష్యుల ఆనంద నర్తన, హనుమాన్ ప్రసన్న నృత్య రూపకాలు, గురు శోభ నటరాజన్ శిష్యులు భరతనాట్యం మరియు యోగ కలిపి చేసిన గీత ధునికు, గురు శోభ తమ్మన విద్యార్ధుల దుర్గాదేవి కూచిపూడి నాట్యరూపకం, గురు అరుణా చంద్ర విద్యార్ధులు ప్రదర్శించిన క్షీరాబ్ది కన్యకకు నాట్యం విశేష ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను ముగ్ధులను చేసాయి.

గురు జ్యోతి వంగర రూపకల్పన చేసిన కృష్ణా తీరం కూచిపూడి నృత్యగీతం సభికులను ఉద్వేగపరచగా, ఉగాది పాట చేసిన మహిళల బృందం తమ చురుకైన నాట్యంతో అందరినీ మెప్పించారు. డాన్సింగ్ దియాస్ బృందం చేసిన ఫ్యూజన్ మెడ్లే నృత్యం ఆద్యంతం హుషారుగా సాగింది.

సతీష్ చకిలం చిన్నారులచే పాడించిన చక్కెర కలిపిన పాట, అన్విత పంచాగ్నుల గానం చేసిన త్యాగరాజ కృతి బంటురీతి, ప్రీత గణేష్ చిన్నారులతో చేయించిన కదిలే బొమ్మలు, నమో నమో భారతాంబె నృత్యం భారతీయ సంస్కృతిని కళ్లకి కట్టినట్టు చూపించాయి.

ఉపాధ్యాయులు నాగలత చెల్మేడ, జ్యోతి మళ్ళ ఆధ్వర్యంలో “తెలుగు పాఠశాల” రూపకం తెలుగు నేర్చుకుంటున్న అమెరికాలోని ప్రవాసాంధ్ర విద్యార్ధుల ప్రతిభకు అద్దం పట్టింది.

సుష్మ కోరా, సుష్మ ఈడుపుగంటి ఆధ్వర్యంలో చేనేత సోయగాలు ఫాషన్ షో చేనేత వస్త్రాల విశిష్టతను తెలియజేస్తూ మనోహరంగా సాగింది. శ్రీమతి సరితా గొట్టూరు ఆధ్వర్యంలో పారిజాతాపహరణం పౌరాణిక నాటిక తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి దర్పణం పడుతూ మనబడి విద్యార్ధుల ప్రతిభను చాటింది.

మణి తెల్లాప్రగడ ఆధ్వర్యంలో సంగీత సంధ్య గాయనులు ఆలపించిన సినీ గీతమాలిక ఆకట్టుకుంది.

CAA కార్యవర్గ సభ్యులు చివర్లో కోసమెరుపుగా చేసిన 'whatsapp' స్కిట్ నేడు ప్రతి ఇంట్లో పెరుగుతున్న సోషల్ మీడియా గాడ్జెట్స్ వల్ల వచ్చే తలనొప్పులను హైలైట్ చేస్తూ నవ్వులు పూయించింది.

ఈ వేడుకలకు చక్కని పండుగ విందు భోజనాన్ని అందించిన బావర్చి బిర్యానీస్ రెస్టారెంట్ వారు ఎంతోమంది ప్రశంసలను పొందారు.

చికాగో ఆంధ్ర సంఘం ప్రెసిడెంట్ పద్మారావు అప్పాలనేని మాట్లాడుతూ, ఈ కార్యక్రమం విజయానికి CAA కార్యవర్గ సభ్యులు, వాలంటీర్ల కృషి మరువలేనిది అని అన్నారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ & ఉపాధ్యక్షులు డాక్టర్ భార్గవి నెట్టెం మాట్లాడుతూ ఫౌండర్స్ కమిటీ చైర్మన్ దినకర్ కారుమూరి, సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, సుందర్ దిట్టకవి, రాఘవ జాట్ల, తన్వి జాట్ల, సంధ్య అప్పలనేని, సెక్రటరి శైలేష్ మద్ది, జాయింట్ సెక్రటరి రాజ్ పొట్లూరి, ట్రెజరర్ అను గంపాల, కార్యవర్గ సభ్యులు శిరీష కోలా, నీలిమ బొడ్డు, సురేష్ శనక్కాయల, సాయి రవి సూరిభొట్ల, సునీత రాచపల్లి, కిరణ్ వంకాయలపాటి, వెబ్ & డిజిటల్ డైరెక్టరే్ శ్రీకృష్ణ మతుకుమల్లి, APDFNA ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ వాణి దిట్టకవి, రామకృష్ణ తాడేపల్లి, లాజిస్టిక్స్ డైరెక్టర్ గౌరీశంకర్ అద్దంకి, మురళి రెడ్డివారి, సీనియర్స్ కమిటీ సభ్యులు శ్యామ్ పప్పు రమణమూర్తి ఎడవల్లి, రఘు బడ్డి, యూత్ కమిటీ సభ్యులు నిఖిల్ దిట్టకవి, శృతి మోత్కూరు, మైత్రి అద్దంకి లకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమ విజయానికి ఎంతో శ్రమించిన కార్యకర్తలు విజయ్ కొరపాటి, సురేశ్ పొనిపిరెడ్డి, విష్ణు పెద్దమారు, సత్య తోట, సత్య నెక్కంటి, రమేశ్ నెక్కంటి, సురేశ్ ఐనపూడి, సరిత ఐనపూడి, శ్రీ వెంకట్ మక్కెన & ఫామిలీ, మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ, హరచంద్ గంపాల, శ్రీమతి లక్ష్మీనాగ్ సూరిభొట్ల, ప్రోమో వీడియోలలో పాల్గొన్న సభ్యులకు, రామాలయ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్, శ్రీ వనమూర్తి, సతీశ్ అమృతూర్, అన్నపూర్ణ విశ్వనాధన్, వీడియో & ఫోటోగ్రఫీ సేవలందించిన శ్రీ యుగంధర్ నాగేశ్ గారికి, ఇంకా అనేకమంది కార్యకర్తలకు, అలాగే ఆర్థిక చేయూతనిస్తున్న స్పాన్సర్లకు అధ్యక్షులు పద్మారావు కృతజ్ఞతలు తెలిపారు.

ఇరుదేశాల జాతీయ గీతాలాపనతో ఆనాటి వేడుకలు జయప్రదంగా ముగిశాయి.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved