pizza
GWTCS Sankranthi event - Keeravani concert
ఘనంగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) సంక్రాంతి సంబరాలు - హృదయాలను కొల్లగొట్టిన కీరవాణి.
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

18 January 2015
Hyderabad

అమెరికాలొని వర్జీనియాలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక బాలబాలికల నృత్య ప్రదర్శనలతో మొదలైన ఈ కార్యక్రమంలో కీరవాణి బృందం సమర్పించిన సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కీరవాణి సంగీత విభావరి నభూతోనభవిష్యతి అన్నట్లుగా జరిగింది. ఓక్టన్ హైస్కూల్ ఆడిటొరియంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగు వారు భారీగా హాజరయ్యారు. వర్జీనియా, మేరీలాండ్, డి.సి మూడు రాష్ట్రాల తెలుగు సంగీతాభిమానులతో ఆడిటొరియం కిక్కిరిసిపోయింది.

GWTCS సభ్యులు కీరవాణి గారిని, దాతలు రామిరెడ్డి గారిని, గంటి భాస్కర్ గారిని మరియు రామ్ వుప్పుటూరి గారిని సత్కరించారు. GWTCS అధ్యక్షులు కిషోర్ దంగేటి, కార్యవర్గ సభ్యులు సత్యన్నారాయణ మన్నె, సుధా పాలడుగు, తనుజ గుడిసేవ, చంద్ర మాలవతు, అనిల్ ఉప్పలపాటి, సురేష్ మారెళ్ళ, కృష్ణ లామ్, రామకృష్ణ చలసాని, రాకేశ్ బత్తినేని, లాక్స్ చేపురి, శ్రీధర్ మారం, అశోక్ వాసం, కవిత బాల, ప్రసాద్ రెడ్డి మందపాటి, మాజీ అధ్యక్షులు రవి గోరినేని ఆహూతులందరికి ధన్యవాదాలు తెలియచేశారు.

రామ్ వుప్పుటూరి గారు ఆహూతులందరికి తెలుగు సాంప్రదాయ వంటకాలైన అరిసెల్, బూరెలు తో కూడిన పసందైన విందు భోజనం అందించారు.

కీరవాణి తన బృంద సభ్యులు రేవంత్, రమ్య, నోయెల్, మోహన, దామిని, ఆదిత్య, మౌనిమా, భైరవ, గీతా మాధురి, అనంత శ్రీరాం లతో కీరవాణి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలోని పాటలతో, చక్కని వ్యాఖ్యానంతో, అలరించే హాస్యంతో, మనసును ఆహ్లాదపరచే సంగీతంతో ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది.

అనంత శ్రీరాం కవిత, సెల్ఫి పాట, బృందసభ్యులను పరిచయం చేస్తూ కీరవాణి పాడిన పాట అదనపు ఆకర్షణాలుగా నిలిచాయి. అమెరికాలొని తెలుగు బాలలు చేసిన సాంస్క్రతిక న్రత్య ప్రదర్సనలు మరియు జబర్దస్త్ ఫేం అబి తమ హాస్య చతురతతో, మిమిక్రీతో, సినిమా హీరోల డాన్స్‌ల అనుకరణతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాయి ప్రార్ధనతో మొదలైన కార్యక్రమం క్షణక్షణం, బాహుబలి, మగధీర, మర్యాద రామన్న, వేదం, క్రిమినల్, విక్రమార్కుడు మొదలైన సినిమాలలోని పాటలతో సాగి, నందమూరి తారక రామారావు గారి మేజర్ చంద్రకాంత్ సినిమాలోని "పుణ్యభూమి నా దేశం" పాటతొ ముగిసింది.


 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved