pizza
ManaBadi - Foreign Language Credit in Fremont School District - CA, USA
సిలికానాంధ్ర మనబడి కి మరొక విశిష్ట గుర్తింపు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

2 July 2016
Hyderabad

San Jose : కాలిఫోర్నియా రాష్ట్రం లోని, ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో, గత వారం జరిగిన స్కూల్ బోర్డ్ సర్వసభ్య సమావేశం లో సిలికానాంధ్ర మనబడి నిర్వహించే తెలుగు 3, తెలుగు 4 తరగతులకు ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ గుర్తింపును మంజూరు చేసారు. 2014 లో సిలికానాంధ్ర మనబడి నిర్వహించే తెలుగు 1 తెలుగు 2, కోర్సులకు ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే . ఈ గుర్తింపు ద్వారా, 4 సంవత్సరాల ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ నిర్దేశించే ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల్లో చేరడానికి మనబడి విద్యార్ధులు అర్హత సాధిస్తారు. ఈ అవకాశాన్ని ఫ్రీమాంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ పరిధి లోని తెలుగు విద్యార్ధులందరూ ఉపయోగించుకుని తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకోవడమే కాకుండా ఉన్నత విద్యకు కావాలసిన ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్స్ కూడా సాధించవచ్చని మనబడి డీన్ రాజు చమర్తి తెలిపారు.

2016-17 విద్యా సంవత్సరానికి , తరగతులు సెప్టంబర్ 10 నుండి, మిషన్ సానొసే హై స్కూల్ లో ప్రారంభం అవుతాయని, ఈ కోర్సులో చేరదలుచుకున్న విద్యార్ధులు, వెంటనే అంతర్జాలం లో manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవాలని, పాఠ్య ప్రణాళికా విభాగం ఉపాద్యక్షులు శాంతి కూచిభొట్ల తెలిపారు. ఈ స్కూల్ బోర్డ్ ద్వారా పూర్తి స్థాయి ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు సాధించడంలో సంచాలకులు శ్రీదేవి గంటి విశేష కృషి సలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దీనబాబు కొండుభట్ల, శరత్ వేట, భాస్కర్ రాయవరం, డాంజి తోటపల్లి, వెంకట్ కొండ, ఫణి మాధవ్ కస్తూరి పాల్గొన్నారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved