pizza
Manabadi graduation ceremony and 2017 sadassu in michigan
మిషిగన్ లోఘనంగా జరిగిన సిలికాంధ్ర మనబడి స్నాతకోత్సవం, ప్రాంతీయ సదస్సు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

27 July 2017
USA

జులై 23. మిషిగన్ రాష్ట్రంలోని డిట్రాయిట్ నగరంలో, ఈ వారాంతం సిలికాంధ్ర మనబడి స్నాతకోత్సవం, మరియు మనబడి మధ్య ప్రాంత భాషాసైనికుల “ప్రాంతీయ సదస్సు” ఘనంగా జరిగాయి. మొత్తం మూడు రోజుల పాటు మిషిగన్ మనబడి జట్టు నిర్వహించిన ఈ కార్యక్రమాలకు, శ్రీ పళిగరం దుష్యంత నాయుడు నాయకత్వం వహించారు.

పది సంవత్సారాల క్రితం ప్రారంభమైన సిలికానాంధ్ర మనబడి గత మూడేళ్ళుగా శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారితో కలిసి, అమెరికా, కెనడా, ఐరోపా ప్రాంతాలలో జూనియర్ మరియు సీనియర్ స్థాయి తెలుగు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులు అయిన పిల్లలకు పట్టాలు అందజేస్తోంది. మిషిగన్ మనబడి కేంద్రాలలో “ప్రకాశం”, మరియు “ప్రభాసం” స్థాయిలు పూర్తిచేసి పట్టభద్రులైన విద్యార్థులకు ఇది మొదటి స్నాతకోత్సవం. డిట్రాయిట్ కు దగ్గరగా ఉన్న Walled Lake అనే నగరంలో జరిగిన ఈ స్నాతకోత్సవంలో మిషిగన్ , మరియు కెనడా, టొరంటో, ప్రాంతాల నుంచి సుమారు160 మంది విద్యార్థులు పట్టాలు పుచ్చుకోవడం విశేషం. ఈ వేడుకలకు శ్రీ ముక్కామల అప్పారావ్ గారు ముఖ్య అతిథి గా వచ్చి పిల్లలకు పట్టా ప్రదానం చేసి దీవించి, “ఆచార్య దేవో భవ" అంటూ అందరికి సందేశాన్ని ఇచ్చి మనబడి ఉపాధ్యాయులను వేదికపై గౌరవించారు.

స్నాతకోత్సవం తరువాత రెండు రోజుల పాటు Farminton Hills లో మనబడి ఉపాధ్యాయులు, కార్యకర్తలు, భాషాసైనికులు “మనబడి సదస్సు”లో సమావేశమయ్యారు. తెలుగును పిల్లలలో మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి వివిధ మనబడి కార్యక్రమాల గురించి మేధామథనాలుచేసి , ప్రణాళికలు రూపొందించారు. ఈ సదస్సులో సుమారు 200 మంది భాషాసైనికులు మిషిగన్, ఒహియో, ఇల్లినాయిస్, టెక్సాస్, ఇాండియానా, మిన్నెసోట, కాన్సాస్, మిస్సోరి, విస్కాన్సిన్, టెన్నెసి, ఫ్లో రిడా, కాలిఫొర్నియా రాష్ట్రాలనుండి పాల్గొన్నారు. అందులో సుమారు 120 ఉపాధ్యాయులకు తెలుగు బోధనాపద్దతులు మరింత మెరుగు పరచడానికి, మనబడి ప్రాఠ్యప్రణాళిక బృందం, శ్రీమతి కూచిభొట్ల శాంతి ఆధ్వర్యంలో, “ప్రశిక్షణ” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మనబడి కులపతి శ్రీ చమర్తి రాజు మాట్లాడుతూ “సిలికానాంధ్ర మనబడి ఉపాధ్యాయులకు ఇచ్చే ప్రశిక్షణ, పలు మనబడి కేంద్రాలలో పాఠ్యప్రణాళికను ఒకే పద్దతి ప్రకారం బోధించేందుకు దోహద పడుతుందని, ఉన్నత స్థాయి ప్రమాణాలను అందుకోవడానికి ఇది అత్యంత కీలకమైన విధానం ” అన్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా గుర్తింపు తెచ్చే పరీక్షలు వంటివి నిర్వహించడం వల్ల ఇప్పుడు అమెరికాలో WASC (Western Association of Schools and Colleges) ద్వారా గుర్తింపు వచ్చిందన్నారు”. మిషిగన్ రాష్ట్ర సమన్వయకర్త శ్రీ తోంటా శ్రీనివాస్ “ఈ గుర్తింపు ద్వారానే మిషిగన్లో పలు school districts లో తెలుగును Foreign Language Credit కు ఆమోదం వచ్చిందన్నారు.” దీనివల్ల ఇక్కడి ప్రవాస తెలుగు పిల్లలు ఇంకొక భాష నేర్చుకొని credits కోసం శ్రమ పడే కంటే, మన మాతృభాష నేర్చుకుని మన భాష, మన సంస్కృతిని ముందు తరాలకు తీసుకువెళ్ళగలరు. శ్రీ దుష్యంత నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రేరణ మా పిల్లలే, మాకు సంతృప్తి వాళ్ళు నేర్చుకుంటున్న తెలుగే” అన్నారు. అందరి పిల్లలకోసం ఎంతోమంది భాషాసైనికులు ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావడానికి మూడు నెలలుగా అహర్నిశలు కష్టపడి పనిచేశారని, వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలకు Metro Tennis Academy వారు ధనసహాయమివ్వగా, పసందైన విందు భోజనాలు Turmerican, Novi, and Aroma Restaurant, Farmington Hills, సమకూర్చారు.

సిలికానాంధ్ర మనబడి తెలుగును తరగతులలోనే కాకుండా పిల్లలకు తెలుగు మరింత దగ్గరయ్యేందుకు, బాలానందం రేడియో, “తెలుగు మాట్లాట” ఆటల పోటీలు, పిల్లల పండుగ, నాటకోత్సవాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేబడుతోంది. సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే విద్యాసంవత్సరంలో పిల్లలను manabadi.siliconandhra.org నుండి నమోదు చెయ్యవచ్చు. సిలికానాంధ్ర మనబడి ఒక దశాబ్ది ప్రయాణంలో తెలుగును ప్రాచీన భాషనుండి ప్రపంచ భాష చెయ్యడంలో తనవంతు కృషి చేస్తోంది. భాషాసేవయే భావితరాల సేవ అన్న నినాదంతో తెలుగు వారినందరినీ చెయ్యి కలపమని అహ్వానిస్తోంది.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved