pizza
NATA is gearing up for Dallas Convention
నాటా డాలస్ 2016 కన్వెన్షన్ ఆహ్వానం:
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

22 May 2016
Hyderabad

NATA, the North American Telugu Association is gearing up for its Dallas Convention 2016. The event is scheduled to happen on the last weekend of May i.e. from May 27th to May 29th. The event is happening at the Kay Bailey Hutchison Convention Center Dallas.

Various programs are organized for the event. There are cultural events which include Classical Dance, Short Skits, Ballets, Small Skits, Karaoke, Dubsmash and many other events. Panel Discussion on various issues by prominent celebrities is also planned.

The stage is also set for a Youth Forum which has Science Workshops, Youth Night, Arts and Crafts along with various other events. The convention also has Business Seminars and Political Forum in its schedule. Apart from the above mentioned the event has got a fair share of literary events and Spiritual events on its schedule.

Prominent personalities from different walks of life are invited for the Convention. Politicians like Bandaru Dattatreya, D. K Aruna, P. V. Midhun Reddy, N. UttamKumar Reddy, SA Sampath Kumar are some of the main Politicians who are attending the event.

Hero Sampoornesh Babu is also expected to attend the event while actresses like Nitya Menon, Hamsa Nandini, Siya Goutham, Tejaswini, Madhuri Itagi are on the invitees list. Telugu movie directors like Harish Shankar, Kodandarami Reddi and Gandhi are likely to precede the convention. Famous Tollywood comedians like Prudhvi Balireddy, Sapthagiri, Praveen, Bittar Satti and Bithiri Savitra are expected to spread smiles at the convention.

Spiritual invitees to the convention include Dr Prakasa Rao Velagapudi, Kalyan Viswanathan, Swami Sarveshananda, Swami Paratmananda, Swami Abhishek Chaitanya Giri. Sri K. Prabhakar Reddy IAS is also expected at the event.

Ravindra Sannareddy, Sri City Managing Director and Uday Reddy, Yupp TV CEO are the prominent business personalities scheduled to attend the event.

All the travel and Hotel arrangement is updated on the official website of the event. Contact information of the organizers and volunteers is also updated on the website.

The schedule of each event is also updated on the website so as to make the visitors available with the programs organized. The North American Telugu Association is inviting one and all for the event.

మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు పట్టుకొమ్మ అయిన నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్( నాటా) 2016 మే 27 నుండి 29 వరకు జరిగే డాలస్ తెలుగు మహాసభలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించడానికి చేస్తున్నఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు వారందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే తెలుగు మహోత్సవానికి డాలస్ నగరం సంసిద్ధం అవుతున్నది. చేపట్టే ఏ కార్యక్రమం అయినా నూతన ఒరవడి సృష్టించే నాటా వారి కార్యక్రమాలకు ప్రజాదరణ ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తెలుగు మహాసభలు జరిగే చోటు డాలస్ మహా నగరం కావడం, అమెరికా, కెనడా నుండే కాక, ఇండియా నుండి కూడా విశేష సంఖ్య లో ప్రేక్షకులు తరిలివస్తున్నందున అందుకు తగిన విధం గా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేలాదిగా తరలి వచ్చే తెలుగు వారికి ఇసుమంతైనా అసౌకర్యం కలుగకుండా చూడడానికి, కార్యకర్తలు ఎక్కడా రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ చక్కని ప్రణాళికలతో రాత్రి పగలు తేడాలేకుండా కష్టపడుతున్నారు.

డాలస్ నగరం నడిబొడ్డున అతి పెద్దదైన డాలస్ కన్వెన్షన్ సెంటర్ లో 10000 మందికి పైగా కూర్చునే సామర్థ్యం , ప్రపంచం లోనే అతిపెద్ద హెలిపాడ్ సౌకర్యం, 105 మీటింగ్ రూములు, దానికి ఆనుకుని ఉండే 1000 రూములు గల ‘ఓమ్ ని’ హోటల్, ఫైవ్ స్టార్ వసతి సౌకర్యాలు, అందరికీ అందుబాటులో ఉండే లొకేషన్, చక్కటి పార్కింగ్ సదుపాయం, ఇలా ఒకటేమిటి సమస్త సదుపాయాలు గల డాలస్ కన్వెన్షన్ సెంటర్ తెలుగు మహాసభలకు సర్వసన్నద్దముగా ఉంది. తెలుగు వారందరూ ఒక చోట చేరి, కుటుంబ, సామజిక విలువలు నిలబెట్టుకోవడం, తెలుగు భాష, సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిరక్షించుకోవడం, తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసే యువత భవిత లాంటి ఎన్నో విషయాల మీద రాబోయే తరాలకు దశ, దిశ నిర్దేశించే సదుద్దేశ్యంతో ఈ 'నాటా' ఉత్సవాలు వేదిక గా  సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సినీ వినోద, విజ్ఞాన, విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ మరియు ఆధ్యాత్మిక సంబంధిత కార్యక్రమాలు రూపొందించడం జరుగుతున్నది. యువత కోసం వివిధరకాలైన యూత్ ఈవెంట్స్, నాటా ఫాషన్ ఈవెంట్, నాటా బ్యూటీ పేజెంట్, మహిళల కోసం స్టార్ మహిళా, మోడర్న్ మహిళ లాంటి వనితా వినోద కార్యక్రమాలు, పిల్లల కోసం “కిడ్స్-న్-ఫన్” , మేజిక్ షోస్ మరియు వినూత్న ఆటలతో కూడిన వినోదకార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. పసి పిల్లల కోసం ప్రత్యేకం గా “బేబీ సిట్టింగ్” సౌకర్యం కలిగించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

నాణ్యత కు పెద్ద పీట వేసి, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టి పడేలా అత్యుత్తమ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. హాజరవుతున్న ప్రముఖ తెలుగు సినీ కళాకారులు, సంగీత దర్శకులు, కవులు, రాజకీయ ప్రముఖులు మరియు ఆధ్యాత్మిక ప్రముఖుల తో కలిసి స్థానిక తెలుగు కళాకారులు ఆహుతులను అలరించడానికి సిద్ధపడుతున్నసందర్భం గా నాటా తెలుగు వారందరినీ పేరు పేరున ప్రత్యేకం గా నాటా డాలస్ 2016 మహా సభలకు కుటుంబ సమేతం గా విచ్చేసి జయప్రదం చేయాలని ఆహ్వానిస్తున్నది.
నాటా కార్యవర్గం


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved