pizza
NATS Sambaralu Fundraising Huge Success in Chicago
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
చికాగో లో సంబరాలపై చర్చించిన నాట్స్ బృందం
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

20 February 2017
USA

North America Telugu Society hosted a fundraising for its 5th Sambaralu Conference in Chicago at a glittering evening at Ramada Inn Banquets. Large number of Telugu community members, supporters, sponsors from Chicago and nationwide attended the event and helped NATS to raise $800,000 for its conference to be held on June 30th, July 1st and 2nd 2017 at Schaumburg convention center. This event was attended by more than 300 people and expressing confidence that this will be a historic conference and NATS team working to make it an innovative and memorable one for all participants, sponsors and donors. This was event was coordinated by conference Chairman Mr Ravi Achanta and Conference Fundraising Director Mr. Murthy Koppaka.

The event was started with Ganesha prayer. NATS Director Mr Praveen Moturu welcomed the attendees with brief introduction about NATS.

The host of the evening and Chairman of the Conference Mr. Ravi Achanta welcomed the guests and thanked everybody for their continued support to NATS. Outlining the objectives of NATS Sambaralu conference and shared that there are three major initiatives identified and proposed to be adopted as part of this conference. The programs are “Expanding Sharks and Dreamers to help OPT students”, “South-South Initiative to bring Chicago South close to Telugu Speaking States culturally, socially, in education and trade areas and bring upward mobility for local underserved population”, and providing education to kids from rural farmer families in Telugu States in India.

Later Ravi Achanta introduced Mr. Praveen Moturu and Phani Ramineni as Vice Chairmen, Mr. Madan Pamulapati as Secretary and Srinivas Boppana as Treasurer, Mr. Nagendra Vege President of CTA (co-host), and 18 directors for the conference. Conference organizing committee now consists of 200 members from Chicago and nationwide. Conference Secretary Madan Pamulapati introduced all teams.

Organizing committee included Mr. Chowdary Achanta as National Team Programs, Mr. Amar Anne National Team Hospitality, Mr. Gangadhar Desu National Team Fundraising, Rajesh Chilukuri as Cultural Advisor,, Mr. Murthy Koppaka as Fundraising Director, Ms. Sujana Achanta as Programs Director, Ms. Rani Vege Banquet Director, Mr Sridhar Mumgandi Director Revenue Generation, Dr. Paul Devarapalli MD as Director CME, Dr. Sudha Yalamanchili Director Youth Programs, Mr Prasad Talluru Director of Food, Mr. Ashok Pagadala Director Educational Services, Mr. Praveen Bhumana as Knowledge and Innovation Director, Mr Srinivas Chundu, Director of Audio Visual/IT, Mr. Aravind Koganti Director Marketing, Mahesh Kakarala Director Media Relations, Mr Srinivas Pidikiti, Director Donors Hospitality, Mr. Srinivas Achanta Director Hospitality, Mr. Naveen Adusumilli Director Finance, Mr. Vasubabu Addagada Co-Director Publicity, Mr. Ramesh Thumu Co-Director Knowledge and Innovation, Krishna Nunna Co-Director Operations, Raja Chennupati, Co-Director Fundraising, Subbarao Putrevu CoDirector Programs, Mr. Venkat Yalamanchili co-director banquet, Mr. Krishnadrula Co-Director Youth Activities, Mr. Lokesh Kosaraju Chair Business Seminar, Ms. Sumathi Pamulapati Chari Matrimonial Services, Ms. Sailaja Mumgandi Chair Women’s Forum and total 50 teams were led by prominent Telugu people.

NATS President Mr. Mohan Krishna Mannava was Guest of Honor for the evening and in his remarks, Mr. Mannava outlined various charitable activities NATS is currently conducting in USA and Telugu speaking states of India. He commended local Telugu community for its support to NATS since its inception and congratulated Sambaralu team for its flawless execution of this event. He expressed and promised that this will be one of best conference. NATS Chairman Mr. Sam Maddali and entire BOD sent their best wishes and committed their support in making this conference a great success. Other guests include NATS Treasurer Mr. Srinivas Machikalapudi, NATS Board of Director Dr. Chowdary Achanta, Mr. Amar Anne, Mr. Rajesh Chilukuri, promised their full support and guidance.

CTA President Nagendra Vege, past president Mr Murthy Koppaka and Board Members Dr. Paul Devarapalli and Rao Achanta will be serving to support the conference.

NATS Sambaralu team thanked our proud grand sponsors “Grand Project Capital at Amaravathi (http://www.grandproject.in/) and G&C Global Consortium (http://www.gcglobal.in/) for their support.

Delicious food was served by Food Team led by Director Mr Talluru Prasad and Murali Kalagara. Thanks to Hyderabad House Naperville and Sampurna Restaurant for their generous support.

Representatives of various Telugu associations ATA, TAGC, TTA, Chita, American Telangana Association, CAA and ATA attended the event.

నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
చికాగో లో సంబరాలపై చర్చించిన నాట్స్ బృందం

అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. చికాగో వేదికగా ఈ ఏడాది జూన్ లో జరిగే నాట్స్ 5 వ అమెరికా తెలుగు సంబరాలకు సంబంధించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చికాగోలోని రమడ ఇన్ బాంక్వెట్స్ లో జరిగిన ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ జాతీయ కమిటీతో పాటు పలు నగరాల నాట్స్ చాప్టర్ సభ్యులు హాజరయ్యారు. జూన్ 30, జూలై 1,2 తేదీల్లో అంగరంగ వైభవంగా నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు జరగనున్నాయి. తెలుగు అతిరథ మహారథులంతా ఈ సంబరాలకు తరలి రానుండటంతో చికాగో నాట్స్ చాప్టర్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దాదాపు 400 మంది నాట్స్ సభ్యులు, అభిమానులు ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. చికాగో లో తలపెట్టిన అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తమ వంతు సాయం చేస్తామని వారు ప్రకటించారు. దాదాపు 8,డాలర్లు నాట్స్ ఈ కార్యక్రమం ద్వారా సేకరించి దీనిని ఘనంగా నిర్వహించడంతో పాటు.. వచ్చిన విరాళాలను సేవా కార్యక్రమాలకు వినియోగించనుంది. నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు ఛైర్మన్ గా రవి ఆచంట, ఫండ్ రైజింగ్ డైరక్టర్ మూర్తి కొప్పాక నేతృత్వంలో ఈ సంబరాలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఫండ్ రైజింగ్ కు ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించింది. నాట్స్ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుందనేది నాట్స్ డైరెక్టర్ ప్రవీణ్ మోటూరు ఈ కార్యక్రమంలో వివరించారు. నాట్స్ లక్ష్యాలు ఏమిటి..? సేవా పథంలో ఎలా ముందుకెళుతుందనేది సంబరాల కమిటీ ఛైర్మన్ రవి అచంట తెలిపారు. నాట్స్ పిలుపుకు ప్రతిస్పందిస్తున్న ప్రతి తెలుగువాడి వల్లే తాము సమున్నత కార్యక్రమాలు చేపడుతున్నామని రవి అచంట అన్నారు. ఈసారి తీసుకున్న మూడు ప్రధాన నిర్ణయాల గురించి వివరించారు. మొదటగా ఓపీటీ విద్యార్థుల కోసం షార్క్స్ అండ్ డ్రీమర్స్ ప్రోగ్రామ్‌ను మరింత కాలం పొడిగిస్తున్నట్లు తెలిపారు. రెండో కార్యకమం...సౌత్-సౌత్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా తెలుగు మాట్లాడే రాష్ట్రాలకు చికాగో సౌత్‌ను దగ్గర చేసే కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాంస్కృతికంగా, సామాజికంగా, విద్య, వాణిజ్యంలో వెనకబడిన ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు కృషిచేస్తారు. ఇక మూడోది.. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత రైతుల పిల్లలకు విద్యనందించడం. ఈ మూడు నిర్ణయాలపై ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లో చర్చ జరిగింది.

ఇదే వేదిక పై రవి అచంట సంబరాల కమిటీని కూడా పరిచయం చేశారు. ప్రవీణ్ మోటూరు, ఫణి రామినేనిలను నాట్స్ సంబరాల కమిటీకి వైస్ ఛైర్మన్లు, మదన్ పాములపాటికి కార్యదర్శి పదవి, శ్రీనివాస్ బొప్పనకు కోశాధికారి బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు.. సీటీఎ ప్రెసిడెంట్ నాగేంద్ర వేగే తో పాటు 18 మంది సంబరాల కమిటీ డైరక్టర్లను వేదికకు పరిచయం చేశారు.

ఆర్గనైజింగ్ కమిటీలో భాగంగా.. నేషనల్ టీమ్ ప్రోగ్రామ్స్‌-చౌదరి ఆచంట, నేషనల్ టీమ్ హాస్పిటాలిటీ-అమర్ అన్నె, నేషనల్ టీమ్ ఫండ్ రైజింగ్- గంగాధర్ దేశు, కల్చరల్ అడ్వైజర్-రాజేష్ చిలుకూరి, ఫండ్ రైజింగ్ డైరెక్టర్-మూర్తి కొప్పాక, ప్రోగ్రామ్స్ డైరెక్టర్-సుజనా ఆచంట, బ్యాంకెట్ డైరెక్టర్-రాణి వేగె, రెవెన్యూ జనరేషన్ డైరెక్టర్-శ్రీధర్ ముంగండి, సీఎంఈ డైరెక్టర్-పాల్ దేవరపల్లి ఎండీ, యూత్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్-డా.సుధా యలమంచలి, డైరెక్టర్ ఆఫ్ ఫుడ్- ప్రసాద్ తాళ్లూరు, డైరెక్టర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్-అశోక్ పగడాల, నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్-ప్రవీణ్ భూమన, డైరెక్టర్ ఆఫ్ ఆడియో విజువల్/ఐటీ-శ్రీనివాస్ చందు, డైరెక్టర్ మార్కెటింగ్-అరవింద్ కోగంటి, డైరెక్టర్ మీడియా రిలేషన్స్-కాకర్ల మహేష్, డైరెక్టర్ డోనర్స్ హాస్పిటాలిటీ-శ్రీనివాస్ పిడికిటి, డైరెక్టర్ హాస్పిటాలిటీ-శ్రీనివాస్ ఆచంట, డైరెక్టర్ ఫైనాన్స్-నవీన్ అడుసుమిల్లి, కోడైరెక్టర్ పబ్లిసిటీ-వాసుబాబు అడ్డగడ, కోడైరెక్టర్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్-రమేష్ తూము, కోడైరెక్టర్ ఆపరేషన్స్-కృష్ణ నున్న, కోడైరెక్టర్ ఫండ్ రైజింగ్-రాజా చెన్నుపాటి, కోడైరెక్టర్ ప్రోగ్రామ్స్-సుబ్బారావు పుట్రేవు, కోడైరెక్టర్ బ్యాంకెట్-వెంకట్ యలమంచిలి, కోడైరెక్టర్ యూత్ యాక్టివిటీస్-కృష్ణద్రుల, చైర్ బిజినెస్ సెమినార్-లోకేష్ కొసరాజు, చైర్ మాట్రిమోనియల్ సర్వీసెస్-సుమతి పాములపాటి, చైర్ విమెన్స్ ఫోరమ్-శైలజ ముంగండి తమ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మొత్తం 50 టీములను తెలుగువారితో ఏర్పాటుచేయడం జరిగింది.

ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాట్స్ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ.. అమెరికాలోని తెలుగువారి కోసం, తెలుగు రాష్ట్రాల్లోని వారి కోసం నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. నాట్స్ స్థాపించినప్పటి నుంచి వెన్నంటి ఉన్న తెలుగువారందరికీ కృతజ్ఞతలు చెబుతూ... తెలుగు సంబరాల్లో ఏ చిన్న పొరపాటు తలెత్తకుండా నిర్వహిస్తున్నందుకు మొత్తం టీమ్‌ను అభినందించారు. ది బెస్ట్ కాన్ఫరెన్సెస్‌లలో ఒకటిగా ఇది నిలిచిపోతుందని కితాబు ఇచ్చారు. నాట్స్ ఛైర్మన్ శ్యామ్ మద్దాళి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లందరూ తమ శుభాభినందనలను తెలిపారు. కాన్ఫరెన్స్ గ్రేట్ సక్సెస్ అయ్యేందుకు తమవంతు మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక నాట్స్ ట్రెజరర్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చౌదరి ఆచంట, అమర్ అన్నె, రాజేష్ చిలుకూరి కూడా తమ మద్దతు, గైడెన్స్ తప్పక ఉంటుందని ప్రకటించారు.

కాన్ఫరెన్స్‌ విజయవంతం అవడానికి చికాగో తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు నాగేంద్ర వేగె, మాజీ అధ్యక్షులు మూర్తి కొప్పాక, బోర్డ్ సభ్యులు డా.పాల్ దేవరపల్లి, రావు ఆచంట కూడా తమ సహాయ సహకారాలు అందిస్తారు.

ఇక నాట్స్ సంబరాలకు స్పాన్సర్స్‌గా వ్యవహరించిన గ్రాండ్ ప్రాజెక్ట్ క్యాపిటల్ ఎట్ అమరావతి(http://www.grandproject.in/), G&C గ్లోబల్ కన్సార్టియంకు(http://www.gcglobal.in/) నాట్స్ సంబరాలు టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఫుడ్ టీమ్ డైరెక్టర్ తాళ్లూరు ప్రసాద్, మురళీ కలగర కాన్ఫరెన్స్‌లో రుచికరమైన భోజన ఏర్పాట్లు చేశారు. ఆహార పదార్ధాలు అందజేసిన హైదరాబాద్ హౌస్ నేపర్‌విల్లే, సంపూర్ణ రెస్టారెంట్‌కు నాట్స్ కృతజ్ఞతలు తెలియజేసింది.

ఈ ఈవెంట్‌కు ATA, TAGC, TTA, Chita, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, CAA and ATAకు చెందిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved