pizza
NATS Community event Tea with a Dublin Police and Firemen by Columbus chapter
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

22 March 2016
Hyderabad

North America Telugu Society (NATS), the premier service oriented national Telugu Organization conducted “Tea with a Dublin Police and Firemen” event on Sunday, successfully conducted by NATS Columbus Chapter at Dublin Recreational Center.

Columbus chapter worked very hard to design this program and worked with local police officers and fire men. This was perfect time to conduct the event since there are couple of fire accidents, robbery/burglary cases registered recently in Columbus area. This was very much needed awareness program for the community especially for Indian community, NATS responded on time and organized this event. Police officers and Firemen spent about two and half hour to explain all the safety tips and possible targets if people don’t follow basic safety tips/rules. This was wonderful interactive session by asking more than 25 questions from the audience. We had about 175 people attended this event, this number was more than expected initially. Everyone who attended this event appreciated NATS team and NATS events. I would like to take this opportunity and congratulate all the people who supported this event. Looking forward to see more service oriented events under NATS banner in Columbus area. NATS Columbus Chapter member have presented mementos to officer for there service to the community. NATS Members who have organized this event are Kesani, Suresh pudotha, koti Bodaipudi, Jagannath Chalasni, Phani potluri, Navya Kupa.

కొలంబస్: మార్చ్ 20: అమెరికాలో వరుస చాప్టర్లు ప్రారంభిస్తున్న నాట్స్ సంస్థ ఈ మధ్యే కొలంబస్ చాప్టర్ ను ప్రారంభించింది. కొలంబస్ ప్రాంతంలో ఈ మధ్య తరచూ అగ్ని ప్రమాదాలు, దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నేరాలపై కొలంబస్ లో ఉంటున్న భారతీయులకు అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమయానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగా గత శనివారం డబ్లిన్ రిక్రియేషనల్ సెంటర్ లో టీ విత్ ఏ డబ్లిన్ పోలీస్ అండ్ ఫైర్ మెన్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొలంబస్ చాప్టర్ తీవ్రంగా కృషిచేసింది. ఇందుకోసం స్థానిక పోలీసు అధికారులు, ఫైర్ మెన్ తో కలిసి పనిచేసింది నాట్స్.

టీ విత్ ఏ డబ్లిన్ పోలీస్ అండ్ ఫైర్ మెన్ కార్యక్రమం రెండున్నర గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో భద్రతా పరమైన సలహాలు, భద్రతా పరమైన సలహాలు పాటించకపోవడం వల్ల జరిగే అనర్థాలను పోలీసు అధికారులు, ఫైర్ మెన్ వివరించారు. అంతేకాదు, ఆడియెన్స్ అడిగిన 25కు పైగా ప్రశ్నలకు కూడా అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ ఈవెంట్ కు అనుకున్న సంఖ్య కంటే ఎక్కువగా దాదాపు 175 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరినీ నాట్స్ కొలంబస్ టీమ్, నాట్స్ ఈవెంట్స్ ప్రత్యేకంగా అభినందించింది. రాబోయే రోజుల్లో కూడా నాట్స్ కొలంబస్ సారథ్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు జరుగుతాయని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రకటించింది. భారతీయ కమ్యూనిటీకి సేవలందిస్తున్నందుకు గాను నాట్స్ కొలంబస్ చాప్టర్ సభ్యులు అధికారులను మెమొంటోస్ తో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని నాట్స్ సభ్యులైన కేసాని, సురేష్ పూదోట, కోటి బోడైపూడి, జగన్నాథ్ చలసాని, ఫణి పొట్లూరి, నవ్య కుప దిగ్విజయంగా నిర్వహించారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved