pizza
North America Telugu Society (NATS), the premier service oriented national Telugu Organization conducted NATS Food drive to help homeless people in New Jersey
నాట్స్ న్యూజెర్సీ టీమ్ చే ఇళ్లులేని పేదలకు ఆహారం పంపిణీ
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

21 March 2016
Hyderabad

NATS New Jersey team donated wide variety of food items to Ozanam Homeless Shelter which have shelters for home less people in New Brunswick and Edison in New Jersey. Several food items like Bagels, Cereals, Oranges, apples, bananas, bread, milk, juices, croissants, pizza, canned foods etc have been donated to over 200 people. They donated food items to cater from 2 weeks to 4 weeks to the homeless people.

Ozanam homeless shelter greatly appreciated NATS for their generous donation. NATS pledged support for these homeless shelters going forward as well. NATS President Mohan Krishna Mannava coordinated this event. NATS Board of Directors Chairman Sam Maddali attended this event along with following NATS New Jersey Team - Gangadhar Desu, Ramesh Nuthalapati, Ranjit Chaganti, Aruna Ganti, Rajendra Appalaneni, Srihari Mandadi, Vamsee Venigalla, Murali Medicherla, Chandra Sekhar Konidela, Prasad Bobba, Sudheer Tummala, Asha Vaikuntam, Rekha Uppaluri, Mohan Venigalla, Rakesh Dommalapati, Jaya Venkat Chanamolu, Sekhar Guthikonda, Srinivas Chaganti etc attended this event and donated the food items.

న్యూ బ్రన్స్విక్ , న్యూ జెర్సీ: మార్చ్ 19: సేవే గమ్యంగా అమెరికాలో పనిచేస్తున్న ప్రతిష్టాత్మక తెలుగు ఆర్జనైజేషన్ నాట్స్... న్యూజెర్సీలోని ఇళ్లు లేని పేదల కోసం ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో భాగంగా నాట్స్ న్యూజెర్సీ టీమ్ పలురకాల ఆహార పదార్ధాలను పంచిపెట్టింది. న్యూ బ్రన్ స్విక్, ఎడిసన్ ప్రాంతాల్లోని ఇళ్లు లేని వారికి ఓజానమ్ హోమ్ లెస్ షెల్టర్ తాత్కాలిక నివాస వసతులు కల్పిస్తుంది. ఈ షెల్టర్ లో వసతి పొందుతున్న వారికి న్యూజెర్సీ నాట్స్ టీమ్ పౌష్టిక ఆహారాన్ని అందజేసింది. సుమారు 200 మందికి చిరుధాన్యాలు, రొట్టెలు, పాలు, పళ్లరసాలు, అరటిపళ్లు, బత్తాయి, యాపిల్స్, బ్రెడ్, పిజ్జా, పేస్ట్రీ, క్యాన్డ్ ఫుడ్స్ మొదలైనవి అందించారు. దాదాపు రెండు వారాల నుంచి నాలుగు వారాల అవసరాలకు సరిపడా ఆహారాన్ని పంచారు.

ఉదారంగా సహాయం చేయడానికి వచ్చిన నాట్స్ ను ఓజానమ్ హోమ్ లెస్ షెల్టర్ ప్రత్యేకంగా అభినందించింది. ఇళ్లు లేని పేదలకు తమవంతుగా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని నాట్స్ ఈ సందర్భంగా తెలిపింది. నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ సారథ్యంలో జరిగిన ఈ ఈవెంట్ లో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ శ్యామ్ మద్దాళి, నాట్స్ న్యూజెర్సీ టీమ్ సభ్యులు గంగాధర్ దేసు, రమేష్ నూతలపాటి, రంజిత్ చాగంటి, అరుణ గంటి, రాజేంద్ర అప్పలనేని, శ్రీహరి మందాడి, వంశీ వెనిగళ్ళ, మురళీ మేడిచర్ల, చంద్ర శేఖర్ కొణిదెల, ప్రసాద్ బొబ్బ, సుధీర్ తుమ్మల, ఆశా వైకుంఠం, రేఖ ఉప్పలూరి, మోహన్ వెనిగళ్ళ, రాకేష్ దొమ్మలపాటి, జయ వెంకట్ చనమోలు, శేఖర్ గుత్తికొండ, శ్రీనివాస్ చాగంటి తదితరులు హాజరై, ఆహార పదార్ధాలను పంచిపెట్టారు.

అమెరికాలోని తెలుగువారి కోసం 24 గంటల హెల్ప్ లైన్ ను ప్రారంభించిన తొలి తెలుగు నేషనల్ ఆర్గనైజేషన్ నాట్స్. 1-888-483-5848 (1-888-4-TELUGU) కు కాల్ చేసి ఎటువంటి సహాయాన్నైనా పొందే అవకాశం కల్పించింది. సేవా కార్యక్రమాలు చేయాలనే అభిలాష ఉన్నవారెవరైనా సరే నాట్స్ లో భాగస్వాములు కావొచ్చు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved