pizza
NATS Free Medical camp at Sai Datta Peetham Temple in New Jersey
నాట్స్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
సాయి దత్త పీఠంలో నాట్స్ ఉచిత వైద్య సేవలు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

8 November 2017
Hyderabad

NATS organized a Free Medical camp at Sai Datta Peetham Temple in New Jersey. Over 200 people attended and took medical advice in this medical camp. New Jersey Public Utilities commissioner Chivukula Upendra, NATS President Mohan Krishna Mannava and Sai Datta Peetham Board Chairman Raghu Sankaramanchi inaugurated this medical camp. Many Prominent doctors - Dr.Purnachander Sirikonda, Dr.Janardhan Bollu, Dr.Ramanashree Gummakonda, Dr. Vijaya Nimma, Dr. Lakshmi Devalaraju etc participated in this medical camp. The doctors performed various medical tests and offered medical advice to all the patients.

Several student volunteers also participated in this event. In this medical camp, flu shots were given to many patients. Also, B.P checking machines and Diabetes checking machines were freely given to many patients.

This NATS medical camp was organized under the leadership of NATS President Mohan Krishna Mannava. Other NATS leaders like Murali Medicherla, Shyam Nalam, Vishnu Aluru, Srihari Mandadi, Vamsee Venigalla, Mohan Kumar Venigalla, Suresh Bollu, Revanth Inagalna, Suresh Kambhammettu worked hard for the success of this medical camp.

NATS Team felicitated Shyam Nalam for sponsoring Flu shots and Diabetic kits to the patients. NATS Team felicitated Raghu Sankaramanchi and Murali Medicherla for providing venue for this medical camp and offering all the other logistics help from Sai Datta Peetham.

NATS, the pioneer of organizing free medical camps so far organized around 60 free medical camps in USA and India and also NATS is the first Indian organization to provide free life insurance.

నాట్స్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
సాయి దత్త పీఠంలో నాట్స్ ఉచిత వైద్య సేవలు

సౌత్ ప్లైన్ఫీల్డ్ : న్యూ జెర్సీ: నవంబర్ 5: భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. న్యూ జెర్సీ లోని సాయి దత్త పీఠంలో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 200 మందికి పైగా ఈ వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందారు. న్యూజెర్సీ పబ్లిక్ యూటీలిటీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, సాయిదత్త పీఠం బోర్డు ఛైర్మన్ రఘు శర్మ శంకరమంచి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ జనార్థన్ బొల్లు, పూర్ణ చందర్ సిరికొండ, డాక్టర్ రమణశ్రీ గుమ్మకొండ, విజయ నిమ్మ, లక్ష్మి దేవళరాజు తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరంలో తమ విలువైన సేవలను అందించారు. చాలా మంది రోగులకు ఈ వైద్య శిబిరంలో ప్లూ షాట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే బీపీ, షుగర్ పేషంట్లకు ఉచితంగా చెకింగ్ మిషన్లు కూడా అందించారు. రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మందులపై పలు సలహాలు, సూచనలు చేశారు. నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ నాయకత్వంలో ఈ ఉచిత వైద్య శిబిరం జరిగింది.. మురళీకృష్ణ మేడిచర్ల, శ్యాం నాళం, విష్ణు ఆలూరు, శ్రీహరి మందాడి, వంశీ కృష్ణ వెనిగళ్ల, మోహన్ కుమార్ వెనిగళ్ల, సురేష్ బొల్లు, రేవంత్ ఇనగాల, సురేష్ కంభంమెట్టు తదితర నాట్స్ నాయకులు ఈ ఉచిత వైద్య శిబిరం విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఉచిత ఫ్లూ షాట్స్, డయాబిటిక్ కిట్స్ అందించిన శ్యాం నాళం ను నాట్స్ టీం సత్కరించింది. నాట్స్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు సహకరించిన సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి ని , శిబిరం ఏర్పాటులో తోడ్పాటు అందించిన మురళీ మేడిచర్ల ను నాట్స్ టీం సత్కరించింది. సాయి దత్త పీఠం ఈ వైద్య శిబిరం నిర్వహణ లో కావాల్సిన వసతి సౌకర్యం తో పాటు ఇతర ఏర్పాట్లను చేసింది. నాట్స ఇప్పటికే అమెరికాలో 60 కి పైగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సేవే తన గమ్యమని చాటింది. ఇక అమెరికాలో విద్యార్థులకు ఉచిత జీవిత బీమా అందిస్తున్న తొలి సంస్థ కూడా నాట్స్ కావడం విశేషం..

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved