pizza
NATS Medical Camp in New York
"నాట్స్" ఆధ్వర్యంలో విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

9 February 2016
Hyderabad

జమైకా, న్యూయార్క్: 'భాషే గమ్యం, సేవే గమ్యం' నినాదంతో ప్రవాసాంద్రులకు సేవలందిస్తున్న"నాట్స్" ఇప్పుడు మానవసేవే-మాధవసేవ అనే నానుడిని ఆదర్శంగా తీసుకుని ప్రవాసాంధ్రులకు ఫిబ్రవరి 7వ తేదీన నవగ్రహ టెంపుల్ ఆడిటోరియం, జమైకా, న్యూయార్క్ నగరంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి తమ సేవాతత్పరతను చాటుకుంది. న్యూయార్క్ లోని మరో తెలుగు సంస్థ టి.ఎల్.సి.ఏ, మరియు AAPI-QLI, NY వైద్య సంస్థతో కలసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 200 వందల మందికి హెల్త్ చెకప్స్ నిర్వహించారు. పేరెన్నికగన్నప్రముఖ వైద్యులు రోగులకు పలురకాల చికిత్సలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలు అందించి తమ సేవాతత్పరతను చాటుకున్నారు. మధుమేహరోగులకు ప్రత్యేక పరీక్షలు చేసి పౌష్టికాహారం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో AAPI-QLI, NY వైద్య సంస్థ నిర్వాహకులు డా.మధు కొర్రపాటి తో పాటు ప్రముఖవైద్యులు డా.కల్పనా రెడ్డి గడ్డం, ఎండోక్రినాలజిస్ట్, డా.నాగేశ్వరరావు మండవ, ప్రముఖ సర్జన్, డా.అట్లూరి, గాస్ట్రో ఎంటరాలజిస్ట్, డా.జగ్గారావు అల్లూరి, న్యూరాలాజిస్ట్, డా.రాకేశ్ దువా, పీడియాట్రిషన్, డా.సుభా అట్లూరి,ఇంటర్నల్ మెడిసిన్, డా.అభయ్ మల్హోత్రా, కార్డియాలజిస్ట్, డా.మధు కొర్రపాటి, నెఫ్రాలజిస్ట్, డా.జానకి కనుమిల్లి, ఇంటర్నల్ మెడిసిన్, డా.జ్యోతి జాస్తి, ఇంటర్నల్ మెడిసిన్, డా.అనిల్ కాంత్, నురాలాజిస్ట్, డా.సురేష్ సహాని, ఎకోకార్డియో గ్రామ్ స్పెషలిస్ట్ లు పాల్గొని తమ సేవలందించారు.

కార్యక్రమంలో "నాట్స్" అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ తోపాటు, నాట్స్ కార్యదర్శి రమేష్ నూతలపాటి, కార్యవర్గ సభ్యులు రంజీత్ చాగంటి, నాట్స్ సోషల్ మీడియా ఛైర్ వంశీ వెనిగళ్ళ, నాట్స్ న్యూజెర్సీ టీం సభ్యులు సుధీర్ పోటు పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం గావించారు.

మరియు టి.ఎల్.సి.ఏ అధ్యక్షుడు సత్య చల్లపల్లి, కార్యదర్శి తాపీ ధర్మారావు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు, కోశాధికారి అశోక్ చింతకుంట, సహాయ కార్యదర్శి బాబు కుదరవల్లి, కార్యవర్గ సభ్యులు హరిశంకర్ రసపుత్ర, జ్యోతి జాస్తి, ప్రసాద్ కోయి, ఉమారెడ్డి, మరియు బి.వో.టి సభ్యులు రావు ఓలేటి పాల్గొని శిబిరం విజయవంతానికి కృషి చేశారు.

ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ , డా.మధు కొర్రపాటి వైద్యశిబిరానికి విచ్చేసిన ఛైర్మన్ బి.వో.డి (BOD) శ్రీనివాస్ మద్దాళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వైద్యశిబిర నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన సర్వ మంగళ శనీశ్వర దేవస్థాన యాజమాన్యం, నిర్వాహకులు శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే ఉచిత మెడికల్ క్యాంప్ ను విజయవంతం చేసినందుకు వైద్యులకు, టీమ్ సభ్యులకు, టి.ఎల్.సి.ఏ సభ్యులకు, వాలంటీర్లకు, చెకప్ కు వచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved