pizza
NATS Sambaralu to Subdivision Event
నాట్స్ సంబరాలకు మేముసైతం కార్యక్రమానికి విశేష స్పందన వెస్ట్ మౌంట్, అరోరాలో తెలుగువారి నుంచి మద్దతు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

4 March 2017
USA

NATS Sambaralu to Subdivision Event held Westmont and Aurora, IL
Chicago, USA – February 25, 2017

North America Telugu Society (NATS) has recently launched a program “Sambaralu to Subdivision” aimed at bringing awareness about NATS and its biennial conference – Sambaralu to be held at Schaumburg, IL from June 30th to July 2nd. First event under this program was held at Westmont, IL on February 25th, 2017. There was overwhelming response from local Telugu community and more than 100 people showed and interested to participate and work for this event. The aim of this was not only promote NATS but also seek feedback from community about Sambaralu conference to make it more purposeful for the Telugu People living in USA.

Mr. Ravi Achanta, Chairman, NATS Sambaralu Conference has addressed the audience and outlined the intent of Samabarlu program and sequence of events in detail. He further said about NATS as an organization, it’s initiatives and charity activities in USA and India. Mr. Madan Pamulapati (Secretary), Mr. Srinivas Boppana (Tresurer), Mr. Rajee Manne (Women’s Forum) from NATS team have also graced the event and elaborated the upcoming event. NATS Smabaralu committee thanked the organizers including Mr. Hareeh Jammula, Arvind Koganti (Sambaralu-Director) and Pandu Changalasetty (Chair).

Later in the day NATS team attended the event at Aurora hosted by Mr. RK Balineni, Venkat Damuluri, Gopal Seelam and Sreekanth Bojja and team. This is event generated lot of interest from community in and around Aurora and attendees were appreciative of NATS efforts in serving the community and extended their support to Sambaralu.

NATS once again extended an invitation to all Telugu people in USA to attend the premier Telugu event of the year in Chicago during June 30th – July 2nd 2017.

నాట్స్ సంబరాలకు మేముసైతం కార్యక్రమానికి విశేష స్పందన వెస్ట్ మౌంట్, అరోరాలో తెలుగువారి నుంచి మద్దతు

మార్చ్ 3: అమెరికాలో జరిగే అతి పెద్ద తెలుగు సంబరాలకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దీని కోసం అమెరికాలోని వివిధ నగరాల్లో సంబరాలకు మేముసైతం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలినాయిస్ లోని వెస్ట్ మౌంట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మందికి పైగా తెలుగువారు విచ్చేసి నాట్స్ సంబరాల్లో మేముసైతమంటూ ముందుకొచ్చారు. నాట్స్ సంబరాలను ఘనంగా నిర్వహించడంలో తాము కూడా తమ వంతు పాత్ర పోషిస్తామని వెస్ట్ మౌంట్ ప్రాంతంలో ఉన్న తెలుగు వారు హామీ ఇచ్చారు. ప్రతి రెండేళ్ల కొక్కసారి అమెరికాలో జరిగే తెలుగు సంబరాలు ఈ సారి చికాగో వేదికగా జరగబోతున్నాయని సంబరాల కన్వీనర్ రవి అచంట తెలిపారు.. చికాగోలోని శ్యాంబర్గ్ , ఐఎల్ లో జూన్ 30, నుంచి జులైన 2 వరకు జరిగే ఈ తెలుగు సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలుగువారంతా మద్దతివ్వాలని ఆయన కోరారు. సంబరాల్లో ఎలాంటి కార్యక్రమాలను చేయనున్నామనేది రవి అచంట వివరించారు. నాట్స్ అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలబడుతుందని.. ఇటు అమెరికాతో పాటు అటు తెలుగునేలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. కార్యదర్శి మదన్ పాములపాటి, కోశాధికారి శ్రీనివాస్ బొప్పన, మహిళా ఫోరం తరఫున రాజీ మన్నె తదితరులు సంబరాల కు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నది వివరించారు. సంబరాలకు మేము సైతమంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హరీ జమ్ముల, సంబరాల డైరక్టర్ అరవింద్ కోగంటి, పాండు చెంగలశెట్టి తదితరులకు సంబరాల కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆ తర్వాత అరోరాలో జరిగిన సంబరాలకు మేముసైతం కార్యక్రమంలో పాల్గొంది. ఇక్కడ ఆర్.కె. బాలినేని, వెంకట్ దాములూరి, గోపాల్ శీలం, శ్రీకాంత్ తదితర బృందం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. అక్కడ నాట్స్ సంబరాలకు మేముసైతమంటూ చాలా మంది ముందుకొచ్చారు. అమెరికాలో తెలుగుజాతికి నాట్స్ చేస్తున్న సేవలను కొనియాడారు. అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారంతా చికాగోకు తరలిరావాలని నాట్స్ సంబరాల కమిటీ అందరిని ఆహ్వానించింది.

.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved