pizza
లాస్ ఏంజిల్స్ లో ప్రారంభమైన ఎన్.పి.ఎల్ టీ 10 టోర్నమెంట్
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

23 April 2015
Hyderabad

లాస్ ఏంజిల్స్ లో ప్రారంభమైన ఎన్.పి.ఎల్ టీ 10 టోర్నమెంట్
అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ సన్నాహాలు ముమ్మరం చేసింది. లాస్ ఏంజిల్స్ లో ఎన్ పీఎల్ క్రికెట్ ప్రారంభించింది. నాట్స్ ప్రీమియర్ లీగ్ టీ10 క్రికెట్ పేరుతో టోర్నమెంట్ కు నాట్స్ శ్రీకారం చుట్టింది. ప్రముఖ క్రికెటర్ రాజేందర్ సింగ్ గై చేతుల మీదుగా లాస్ ఏంజిల్స్ లో ఎన్.పి. ఎల్ టీ10 ను ప్రారంభించారు. అంతర్జాతీయ క్రికెట్ లో తన అనుభవాలను ఎన్.పి.ఎల్ టీ10 క్రికెట్ లో పాల్గొన్న క్రికెటర్లకు వివరించారు. ఆటలో మెళకువలను కూడా ప్లేయర్లకు తెలిపారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలపై రాజేందర్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ ఆహ్వనం మేరకు వచ్చి ఎన్నో విలువైన సూచనలు చేసిన రాజేందర్ సింగ్ కు వెంకట్ ఆలపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వివిధ నగరాల్లో ఎన్.పి.ఎల్ క్రికెట్ పోటీలు
అమెరికాలో వివిధ నగరాల్లో ఎన్.పి.ఎల్ క్రికెట్ పోటీలు జరగన్నాయి. వీటిలో లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్, ఫైనల్ కు వచ్చే జట్లతో ఎన్పీఎల్ ఫైనల్ జరగనుంది. ఫైనల్ విజేతలకు లాస్ ఏంజిల్స్ వేదికగా నాట్స్ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు ప్రదానం చేయనున్నారు. మొత్తం 350 మంది ప్లేయర్లు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో తమ సత్తా చాటనున్నారు. 50 టీమ్ లు ఎన్.పి.ఎల్ టీ 10 కప్ సొంతం చేసుకునేందుకు పోటీ పడనున్నాయి. దాదాపు 50 మంది వాలంటర్లీ ఈ టోర్నమెంట్ కోసం తమ విలువైన సమయం వెచ్చిస్తున్నారు.. ప్రస్తుతం వాలీ రీజన్ లో జరిగిన క్రికెట్ పోటీల్లో కాలిఫోర్నియా క్రికెటర్స్ టీం, బునియా పార్క్ పరిధిలో తెలుగు వారియర్స్ టీంలు విజయం సాధించాయి. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ లో పది ఓవర్లలో 106 పరుగులు అత్యధిక స్కోరుగా నమోదైంది. ఓ ఆటగాడు మూడు మ్యాచ్ ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. ఇప్పటివరకు ఓ హ్యాట్రిక్ కూడా ఈ టోర్నమెంట్ లో నమోదైంది.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved