pizza
NATS Walkathon at Oak Park
LA లో నాట్స్ 5 కే వాకథాన్
You are at idlebrain.com > NRI community >
Follow Us

 

 

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

26 February 2018
USA

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యములో, NATS మహిళా సంబరాల్లో భాగంగా, దక్షిణ కాలిఫోర్నియా లోని రెండు ప్రాంతాలలో (Cerritos, Oak Park) శనివారం ఉదయం (February 24th, 2018) 5k వాకథాన్ కార్యక్రమం నూతన లాస్ ఏంజెల్స్ చాప్టర్ కార్యవర్గం ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించబడింది.

Cerritos Regional Park లో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమాన్ని ముఖ్య అతిధి ప్రముఖ సినీ నటి శ్రీమతి లయ ప్రారంభించారు.ఈ కార్యక్రమము ఇంత విజయవంతం కావడానికి కృషి చేసిన NATS వాలంటీర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసారు.

ఫ్లోరిడా లో జరిగిన విధ్వంసకాండలో బలి అయిన పిల్లలని గుర్తుచేసుకుంటూ రెండు నిమిషములు మౌనం పాటించారు. శ్రీమతి లయ ఈ సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ, పిల్లల జీవితం లో మహిళలు ప్రధాన పాత్ర పోషించాలని, వారితో స్నేహితులు గా మెలగాలి అని, అందరూ పిల్లల భవిష్యత్తు కొరకు పాటు పడాలని పిలుపు నిచ్చారు. 250 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా శ్రేయస్సు కోసం నాట్స్ చేస్తున్న ప్రయత్నాన్ని మరింతగా బలపరచాలని NATS మహిళా కార్యకర్తలు శిరీష పొట్లూరి, నీలిమ యాదల్లా, అనితా కొంక మరియు అనితా కాట్రగడ్డ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి కృషి చేసిన కార్యకర్తలను నాట్స్ లాస్ ఏంజెల్స్ కో-ఆర్డినేటర్ కిషోర్ బూదరాజు, కార్యదర్శి శ్రీనివాస్ చిలుకూరి, ఉమ్మడి కార్యదర్శి మనోహర్ మద్దినేని, కోశాధికారి గురు కొంక ధన్యవాదములు తెలిపారు. March 10వ తారీఖున జరిగే మహిళా సంబరాలను వినూత్నం గా దక్షిణ కాలిఫోర్నియా తెలుగు పౌరులకు అందిస్తామాని తెలిపారు. ఈ సందర్భముగా దక్షిణ కాలిఫోర్నియా లో నివాసముంటున్న తెలుగు వారిని అందరిని ఆహ్వానించారు. శ్రీమతి పూనమ్ మాలకొండయ్య, శ్రావ్య కళ్యాణపు, లయ గొర్తి మరియు షెరిల్ స్పిల్లెర్ లు ముఖ్య అతిధులుగా రానున్నట్లు తెలియచేసారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved