pizza
NATS Sambaralu Fundraising Event - Dallas
నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు 2017 సందర్భంగా డల్లాస్ లోవిరాళాల సేకరణ
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

10 May 2017
Hyderaad

జూన్ 30, జులై 1,2 తేదీలలో షికాగో లో జరగనువ్న అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం నాట్స్ డల్లాస్ చాప్టర్ అధ్వర్యంలో విరాళాల సేకరణ నిర్వహించారు. నాట్స్ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ, సంబరాల కమిటీ ఛైర్మన్ రవి ఆచంట, కో ఛైర్మన్ ఫణి రామినేని ఈ సందర్భంగా డల్లాస్ విచ్చేసారు.

ఇంకా కనెక్టికట్ చాప్టర్ నుండి తరణి పరుచూరి మరియు ఇతర నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్స్ కూడా ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాట్స్ కార్యవర్గ సభ్యులు విజయ్ వెలమూరి మాట్లాడుతూ 2013 సంబరాలను డల్లాస్ లో విజయవంతంగా నిర్వహించిన విషయం గుర్తు చేసారు. 2015 లో లాస్ఏంజెల్స్ సంబరాలలో డల్లాస్ చాప్టర్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని చేయూతనిచ్చారని అదే విధంగా షికాగో లో జరిగే సంబరాలకు కూడా అందరూ సహకరించాలని అభ్యర్థించారు. సంబరాల కమిటీ కో ఛైర్మన్ ఫణి రామినేని మాట్లాడుతూ ఎన్ ఎ టి ఎస్ అంటే "నా ఆంధ్రా తెలంగాణా సంబరాలు" , "నా ఆంధ్రా తెలంగాణా సొసైటీ" అని కొత్త అర్థాలను చెప్పారు. ప్రాంతాలకు అతీతంగా అమెరికాలోని తెలుగువాళ్ళందరూ కలిసి జరుపుకొనే మూడు రోజుల పండగే అమెరికా తెలుగు సంబరాలని ఆయన చెప్పారు. సంబరాల ఛైర్మన్ రవి ఆచంట మాట్లాడుతూ సంబరాల సన్నాహాలను వివరించారు. "వసుధైక కుటుంబం" అనే వినూత్న నృత్య రూపకంతో పాటు అనేక వినోద, విజ్ఞాన కార్యక్రమాలు ఈ సంబరాలలో ఉంటాయని, దాతలు సహృదయంతో ఇచ్చే విరాళాలు ప్రతి పైసా సద్వినియోగం చేస్తామని చెప్పారు. నాట్స్ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ తమ ఇటీవల ఇండియా పర్యటన విశేషాలను అందరితో పంచుకొన్నారు.

వంద మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం వీణా యలమంచిలి, సురేష్ లు పాడిన పాటలతో మరింత ఆహ్లాదంగా జరిగింది. సాటి తెలుగు సంస్థలతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అందరూ ఘనంగా విరాళాలు అందించారు.

ఈ కార్యక్రమ నిర్వహణలో తనకు పూర్తి సహకారం అందించిన అమర్ అన్నే , రామకృష్ణ మార్నేని మరియు ఇతర కార్యవర్గ సభ్యులకు డా॥ చౌదరి ఆచంట కృతజ్ఞతలు తెలియచేసారు.

ఈ సమావేశంలో శ్రీనివాస్ కోనేరు, బాపునూతి, రాజేష్ చిలుకూరి, శేఖర్ అన్నె, శ్రీనివాస్ కొమ్మినెని, అజయ్ గోవాడ, చైతన్య కంచెర్ల, కిషోర్ వీరగంధం, రాజేంద్ర మాదాల, రామకృష్ణ నిమ్మగడ్డ, ఉమ అట్లూరి, రాజ మాగంటి, హరీష్ కొర్రపాటి, అషొక్ గుత్తా, భాను లంక, వెంకట్ గుత్తా మరియు ఇతర డల్లాస్ టీం సభ్యులు పాల్గొన్నారు.


 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved