pizza
NATS Sports event in Philadelphia
క్రీడా స్ఫూర్తిని నింపిన నాట్స్ ఇండోర్ వాలీబాల్ టోర్నమెంట్
కింగ్ ఆఫ్ ఫర్షియా: అక్టోబర్ 8: ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు ఆటగాళ్లు..
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

9 October 2018
USA

అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటిగా చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. తరచూ తెలుగువారిలో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు టోర్నమెంటులు కూడా నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఫిలడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ ఫర్షియాలో నాట్స్ వాలీబాల్ టోర్నరమెంట్ నిర్వహించింది. నాట్స్ వైస్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని సహకారంతో నిర్వహించిన ఈ టోర్నమెంటుకు విశేష స్పందన లభించింది. 20 టీంలు ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొని ఉత్సాహాంగా ఆడాయి. స్థానిక తెలుగుసంఘం టీఏజీడీవీ కూడా టోర్నమెంటుకు తన వంతు సహకారం అందించింది. నాట్స్ ఫిలడెల్ఫియా టీం సభ్యులు హరినాథ్ బుంగతావుల, చైతన్య పెద్దు, రామ్ కొమ్మబోయిన, శ్రీకాంత్ చుండూరు, ఫణి కడియాల, గోకుల్ పుతుంబాక తదితరులు ఈ టోర్నమెంట్ విజయంలో కీలక పాత్ర పోషించారు.



 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved