pizza
Sai Datta Peetham Paduka Yatra completed
న్యూజెర్సీలో ఘనంగా సాయి పాదుక యాత్ర ముగింపు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

6 June 2017
USA

సౌత్ ప్లయిన్ఫీల్డ్, జూన్ 3 : అమెరికాలో షిరిడీ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం.. తన లక్ష్య సాధనంలో కీలకమైన ఓ ఘట్టాన్ని పూర్తి చేసింది. షిరిడీ నిర్మాణ స్థలం కొనుగోలు కోసం విరాళాలు సేకరించేందుకు సాయి దత్త పీఠం స్థల సేవ పేరుతో అమెరికాలో న్యూజెర్సీ నుంచి ప్రారంభమైన సాయి పాదుక యాత్ర, 43 రాష్ట్రాలలోని వివిధ నగరాల్లో కొనసాగి చివరకు మళ్లీ న్యూజెర్సీ చేరింది. ఈ సందర్భంగా చేపట్టిన ముగింపు యాత్రకు భక్త జనం నీరాజనం పట్టింది. ఐదు మైళ్ల పాటు జరిగిన ఈ ముగింపు యాత్రలో 100పైగా కార్లతో భక్తులు పాల్గొన్నారు. యాత్ర పొడవునా సాయి నాథుడికి నీరాజనాలు పట్టారు. తొలుత న్యూజెర్సీలోని మేడిచెర్ల మురళీ కృష్ణ నివాసంలో సాయి పాదుక పూజ నిర్వహించారు. అనంతరం పల్లకీ దాత కనికిచెర్ల లీలా కృష్ణ నివాసం లో ఆఖరి పాదుకా పూజ నిర్వహించి ఆ తర్వాత అక్కడ నుండి ప్రారంభమైన యాత్రకు సాయి నామ జపంతో భక్త జనం జేజేలు పలికారు.. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా దీనికి తమ వంతు సహకారం అందించింది. సాయి దత్త పీఠం సభ్యులు.. సాయిభక్తులు వందలాది మంది ఈ యాత్రలో పాలుపంచుకున్నారు.

పాదుక యాత్ర ప్రత్యేకత..
అమెరికాలో షిరిడీ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సాయి దత్త పీఠం స్థల సేవకు విరాళాల నిమిత్తం ఈ పాదుకయాత్ర చేపట్టింది. ఆ షిరిడీ నాథుడి పాదాలనే భక్తుల చెంతకు తీసుకెళ్లి.. అమెరికాలో షిరిడీ లక్ష్యాన్ని వివరించింది. సాయి దత్త పీఠం ప్రధాన నిర్వాహకులు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి నేతృత్వంలో రెండు సంవత్సరాల పాటు అమెరికాలో 43 రాష్ట్రాల్లో 75000 మైళ్ల దూరం ఈ సాయి పాదుకయాత్ర సాగింది. సాయి దత్త పీఠం సిద్ధం చేసిన సాయి రథం ద్వారా ఈ పాదుక యాత్ర 43 రాష్ట్రాల్లో దాదాపు 2వేల ఇళ్లకు చేరుకుని సాయి పాదుక పూజ చేసింది. 150 కి పైగా దేవాలయాలను చుట్టివచ్చింది. వందకు పైగా సమన్వయకర్తలు.. 500మందికి పైగా స్వచ్చంద సాయి సేవకులు ఈ యాత్రలో తమ విలువైన సేవలు అందిస్తే 1,11,111 మందికి పైగా సాయి భక్తులను పలకరించింది. ప్రతి రాష్ట్రంలో సాయి దత్త పీఠం చేపట్టిన ఈ పాదుకయాత్రకు భక్తులు నీరాజనం పట్టారు. ఇంటింటికి పిలిచి సాయి పాదుక పూజను చేయించుకుని తరించారు.

వైభవంగా సాయి దత్త పీఠం గురుకుల వార్షికోత్సవం

జూన్ 4: ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ.. భారతీయ సంస్కృతి, సంప్రదయాలను.. ఆధ్యాత్మిక ప్రవాహాన్ని అమెరికాలో కొనసాగిస్తున్న సాయి దత్త పీఠం గురుకుల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. భావి తరాలకు భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రబోదిస్తున్న గురుకులం.. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గురుకులంలో చిన్నారులకు శ్లోకాలు, పద్యాలతో పాటు భారతీయ కళలను ఇక్కడ నేర్పిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ చూపే తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులంలో చేర్పించి వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తున్నారు. ఈ ఏడాదిలో వారు నేర్చుకున్న అంశాలను వార్షికోత్సవం సందర్భంగా వారు ప్రదర్శించారు..చిన్నారులు చేసిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు ఔరా అనిపించాయి. భారతీయతను కాపాడటంలో భావిపౌరులు చేస్తున్న కృషి వారివారి ప్రదర్శనల్లో కనిపించింది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved