pizza
New Jersy Silicon Andhra Mana Badi Samskrutikotsavam 2016
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

27 April 2016
Hyderabad

The NJ-MCF-2016 Samskrutikotsavam event(Pillala Panduga) was a huge success, approximately 1400+ people attended the event including 460+ Manabadi students, 90 teachers, coordinators and more than 100+ volunteers who worked together to make this event a great success.

Hats off and kudos to all our ManaBadi kids for their smashing and stunning performances. A big applause to all the kids, they have outperformed our expectations on the stage. My hearty congratulations to all the kids, teachers and parent volunteers on this big success.

"Graduation Ceremony"(Snathakotsavam) for Telugu kids in America was the highlight of the event.
It's a moment of pride and happiness for all of us as parents, teachers, coordinators, volunteers and event organizers when kids get honored during ceremony. It was pleasure to watch kids throwing their hats in the air after the ceremony.

We would like to express heartfelt thanks to our chief guests Sri. Chivukula Upendra Garu for having taken the time to grace the occasion, bless the kids and participate in the graduation ceremony. Special thanks to their esteemed presence & encouragement.

Most sincere thanks to Sri.Venugopal Oruganti Garu and Sri. Sarath Veta Garu for their inspiring speeches and supporting us through out this journey, and also many thanks to all coordinators, volunteers and parents for their hard work, support and contribution to make this event a great grand success.

అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో మనబడి సాంస్కృతికోత్సవం April 23, 2016 నాడు North Brunswick High School లో దిగ్విజయంగా జరిగింది. ఇందులో 460 మంది విద్యార్థులు 90 మంది పైగా గురువులు, సమన్వయక కర్తలు, 100 మంది స్వచ్చంద కార్యకర్తలు, 1400 మందికి పైగా సభికులు పాల్గొని, విజయవంతంగా జరుపుకున్నారు.

ఈ సంవత్సరం కొత్తగా “పిల్లల పండుగను” రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగం లో Morganville, North Brunswick, Parsippany, Bordentown, Skillman, Monroe, Delran కేంద్రాల విద్యార్థులు మరియు రెండోవ భాగంలో Edison, Princeton, Piscataway కేంద్రాల విద్యార్థులు పాల్గొన్నారు.

కిరణ్ దుద్దాగి , మహేష్ నాగెళ్ళ, రత్న వేట, సువర్ణ వూర నాయకత్వంలో కార్యవర్గం సభ్యులు భార్గవ చిట్టమూరి, సునిత గుండ, సమత కోగంటి, కన్యాకుమారి పేరూరి, శైలజ కారుమూరు, శ్రీధర రావు రావినూతల, మరియు నాగసుధ వాకాడ గార్లు జరిపిన ఈ కార్యక్రమంలో బాలబడి నుంచి ప్రమోదం వరకు చదువుతున్న విద్యార్థులు ఎన్నో సాంస్కృతిక అంశాలు ప్రదర్శించి వారి తెలుగు ప్రజ్ఞాపాటవాలని చూపించి ప్రేక్షకుల కరతాళధ్వనులు అందుకున్నారు.

ఈ పిల్లల పండుగలో మనబడి అభివృద్ది విభాగ నాయకులు శ్రీ శరత్ వేట గారు మరియు పాఠ్య\ప్రణాళిక బృంద సభ్యులు ఓరుగంటి వేణుగోపాల కృష్ణ గారు ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో భాగంగా స్నాతకోత్సవం (Graduation Ceremony) కన్నులపండుగగా జరిగింది. క్రితం సంవత్సరం ప్రకాశం మరియు ప్రభాసం చదివి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులై, పట్టభద్రులైన విద్యార్థులకి యోగ్యతాపత్రాలు ఇచ్చారు.

ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శించిన పౌరాణిక, చారిత్రాత్మక, నీతికథల నాటికలు, చిన్నారులు పాడిన పద్యాలు, పాటలు చాలా ఆసక్తిదాయకంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగు జాతి వైభవం, ఏవరా ప్రదానమంత్రి - చర్చ, మిత్రలాభం-మిత్రభేదం, బుడుగు కథలు,ఆకాశానికి స్తంభాలు, తెలుగు మాసములు-పండుగలు, కాల యంత్రం, పొడుపు కథలు, ఋతువుల పాట, బూరెల మూకుడు అనే వైవిధ్యమున్న ఇతివృత్తాల మీద నాటికలు, కథలు, పద్యాలు, ఉచ్చారణలో స్వచ్చత, ఆహార్యంలో ప్రామాణికత తో సాంస్కృతిక కార్యక్రమం అద్భుతంగా జరిగింది. తెలుగు జాతి వైభవం నాటకం 95 మంది విద్యార్థులతో చేయటం ఒక గొప్ప విశేషం, ఈ నాటకం చూసి ప్రేక్షకులు హాలు దద్దరిల్లేలా చప్పట్లు కొట్టారు. అలాగే ఏవరా ప్రదానమంత్రి నాటికలో పిల్లల సంభాషణ నైపుణ్యాన్ని చూసి సభ అంతా ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో మ్రోగిపోయింది.

అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్న ఈ చిన్నారులు చూస్తుంటే అసలు వీళ్ళు అమెరికాలో పుట్టిన పిల్లలేనా అనిపించింది. అంతమంది విద్యార్థులతో రిహార్సల్స్ జరిపించడమూ, వారికి దుస్తులూ, ఆభరణాలు లాంటి ఆహార్యం సమకూర్చడము, పిల్లల చేత క్లిష్టమైన మాటలు పలికించడమూ సామాన్య విషయం కాదు. వీటన్నింటి వెనుక ఎంత శ్రమ పడ్డారో కానీ ఆ తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ ధన్యులు. వాళ్ళందరికీ అభివందనాలు, శుభాభినందనలు.

సభకి వచ్చిన ముఖ్య అతిథులు మన తెలుగు వారికి చిరపరిచితులు ఉపేంద్ర చివుకుల (Commissioner, NJ Board of Public Utilities) తెలుగు భాషకీ సంస్కృతికీ మనబడి చేస్తున్న కృషిని పలు విధాలుగా కొనియాడారు. జాతీయ మరియు ప్రాంతీయ తెలుగు సంస్థల ప్రతినిధులు వచ్చి మనబడి గురించి గొప్పగా మాటలాడారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved