pizza
TANTEX 135th Nela Nela Telugu Vennela - Sahitya Vedika
“సర్వకళాసారం సాహిత్యం “ - ఘనంగా ముగిసిన టాంటెక్స్ 135వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
ఘనంగా ముగిసిన టాంటెక్స్ 135వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

22 October 2018
USA

అక్టోబర్ 21, 2018 డాలస్, టెక్సస్.ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించు "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం, అక్టోబర్ 21 న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 135 నెలలు పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేసారు.

కార్యక్రమంలో ముందుగా చిన్నారులు వేముల సాహితి, వేముల సింధూర ప్రార్ధనా గీతం తో కార్యక్రమం ప్రారంభం అయ్యింది . తరువాత మనబడి చిన్నారులు గురజాడ దేశభక్తి గీతం ఆలాపించారు .. డా. ఊరిమిండి నరసింహ రెడ్డి - మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి , జాతీయాలు , పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చంద్రహాస్ మద్దుకూరి ‘పిలిచినా బిగువటరా’ పాట పూర్వాపరాలు వివరించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ కవితా వైశిష్ట్యాన్ని సోదాహరణంగా వివరించారు, కొన్ని కవితలు చదివి వినిపిస్తూ, అమృతం కురిసిన రాత్రి తో ముగించారు. రమణ జువ్వాడి గారు శ్రీనాధుని పద్య వైభవాన్ని కొన్ని పద్యాలు చదివి వివరించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ గారు ఆముక్తమాల్యద లోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు.శ్రీమతి ఉమా భారతి గారు రాసిన ‘సరికొత్త వేకువ’, ‘నాత్యభారతీయం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ బసాబత్తిన ‘నాట్య భారతీయం’ మరియు ‘సరి కొత్త వేకువ’ పుస్తకాలను, రచయిత్రిని సభకు పరిచయం చేసారు.

శ్రీమతి ఉమాభారతి కోసూరి గారు మాట్లాడుతు, సాహిత్యమంటే.. ఓ పుస్తకం, వేమన పద్యాలు మాత్రమే కాదు..కళలంటే ‘తకిట తఝణులు’, రాగాలాపనలు మాత్రమే కాదు. ‘సహితస్య భావం సాహిత్యం’ అంటే అన్ని కళలు కలగలసినదే సాహిత్యం అని అర్ధం. కళలలో కవిత్వానిది అగ్రపీటం. కవిత్వం సాహిత్యంలో అంతర్భాగం.... అని మనకి తెలిసిందే. కవిత్వం అంటే దుఃఖార్తులకూ, శ్రమార్తులకూ, శోకార్తులకూ మానసికోల్లాసాన్ని కలిగించే దివ్య కళ అని నాట్యశాస్త్రంలో భరతుడు అంటాడు.

రోజూవారీ జీవనంలో ..లాలిపాటల సాహిత్యం నుండి భగవద్గీత ప్రబోధ ప్రవచనాలు వరకు కూడా అడుగడునా అపారమైన సాహిత్య వల్లరే. అసలు జీవించడం నుండే సాహిత్యం పుట్టుకొస్తుంది అని కూడా అనవచ్చు. మానవ జీవనానికి గొప్ప మార్గదర్శకం మనకున్న సాహిత్య సంపదే అని, జీవన విధానాన్ని దిద్దుకునేందుకు సరిదిద్దుకునేందుకు కూడా మనకున్న గొప్ప సాహిత్య సంపద ఎంతైనా తోడ్పడుతుంది అని ఎందరో మేధావులు సూచించారు. అలాగే మనిషి యొక్క మానసిక ఎదుగదల, సంక్షేమాలపై కూడా సాహిత్య, లలితకళల ప్రభావం తప్పక ఉంటుంది అని కూడా ఉండనే ఉంది.. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి ముగ్దురాలై అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు.

శ్రీమతి ఉమాభారతి కోసూరి గారిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు , అధ్యక్షురాలు శ్రీమతి శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి శ్రీలు మండిగ, పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. శ్రీమతి ఉమా భారతి గారు తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు శ్రీమతి కృష్ణవేణి శీలం మాట్లాడుతూ శ్రీమతి ఉమా భారతి గారి నృత్య సేవలను ఎంతో కొనియాడారు మరియు తన పూర్వ ప్రదర్శనలను గుర్తు చేసుకున్నారు . సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

టాంటెక్స్ 135 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి సాహిత్య వేదిక బృంద సభ్యుడు శ్రీ మాడ దయాకర్ సమర్పించిన నివేదిక.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved