pizza
Telugu Maatlaata 4th season launch
ఉత్తేజంతో నాల్గవ సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట ఆరంభం
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

19 April 2016
Hyderaba
d

మిషిగన్ ఉత్తర, దక్షిణ డెట్రాయిట్ ప్రాంతాలలో సుమారు 100 మంది పిల్లలతో నాల్గవ విడత సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వచ్చే రెండు నెలల పాటు 25+ నగరాలలో వందలాది మంది పిల్లలతో ఈ ప్రాంతీయ పోటీలు కొనసాగుతాయి. మరిన్ని వివరాలకు manabadi.siliconandhra.org/TeluguMaatlaata ను సంప్రదించండి.

తెలుగు పిల్లలందరినీ ఆహ్వానిస్తూ, వారిలో తెలుగు భాషపై ఉన్న పట్టుని మరింత పెంపొందించడానికి, వారికి ఉత్తేజం కలిగించే రీతిలో ఈ ఆటలని సిలికానాంధ్ర మనబడి రూపొందించింది. పిల్లలు ఎంతో క్లిష్టమైన తెలుగు పదాలను వ్రాసి “పదరంగం”లో మేము పెద్దలను మించి పోతామని, ఇరకాటం పెట్టే “తిరకాటం” ప్రశ్నలకు జవాబులిస్తూ అవకాశమిస్తే తెలుగును దూరతీరాలలో కూడా అభివృద్ధి చెయ్యగలమని నిరూపించారు.

గత రెండు వారాంతాలలో జరిగిన ఈ పోటీలు ఏప్రిల్ 17న మిషిగన్లో విజయవంతంగా ముగిసాయి. దక్షిణ డెట్రాయిట్ ప్రాంత తెలుగు కుటుంబాలకు అనువుగా లివోనియా నగరంలోనూ, ఉత్తర డెట్రాయిట్ కు అనువుగా ట్రాయ్ నగరంలోనూ ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు Prudential Investments వారు విరాళాలు అందజేశారు. చిన్ని చిన్ని “బుడతలు” (5 నుండి 9 సంవత్సరాల వయస్సు), 10 నుండి 14 సంవత్సరాల “సిసింద్రీలు" ఎంతో ఉత్సాహంతో ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ ఆటలలో విజేతలైన చిన్నారులు:

దక్షిణ డెట్రాయిట్ (లివోనియా కేంద్రం)
బుడతలు (5 నుండి 9 ఏళ్ళు):
తిరకాటం: 1) పంత్రా యశ్వంత్ 2) రెడ్డి రిత్విక్
పదరంగం: 1) పంత్రా యశ్వంత్ 2) రామిశెట్టి దివ్య
ఒక్క నిమిషం మాత్రమే (ఒనిమా): 1) పంత్రా యశ్వంత్ 2) పొట్ల సహస్ర
సిసింద్రీలు (10 నుండి 14 ఏళ్ళు):
తిరకాటం: 1) రెడ్డి షరిత 2) వల్లభనేని అభినవ్
పదరంగం: 1) రెడ్డి షరిత 2) వల్లభనేని అభినవ్
ఒక్క నిమిషం మాత్రమే: 1) రుద్రరాజు శ్రియ 2) తుమ్మలపల్లి సుచిత్

ఉత్తర డెట్రాయిట్ (ట్రాయ్ కేంద్రం)
బుడతలు (5 నుండి 9 ఏళ్ళు):
తిరకాటం: 1) షేక్ ఐషా జాస్మిన్ 2) తోంటా హాసిని
పదరంగం: 1) తోంటా హాసిని 2) శ్రావ్య ఉపాధ్యాయుల
ఒక్క నిమిషం మాత్రమే (ఒనిమా): 1) షేక్ ఐషా జాస్మిన్ 2) గొల్ల రిషి

సిసింద్రీలు (10 నుండి 14 ఏళ్ళు):
తిరకాటం: 1) ముత్యంపేట మిహిర్ 2) వడ్డమాని అపూర్వ
పదరంగం: 1) బండ్ల నీహాల్ 2) దేవులపల్లి కృష్ణ కౌశిక్
ఒక్క నిమిషం మాత్రమే: 1) దేవులపల్లి కృష్ణ కౌశిక్ 1) నిడమర్తి ధృవ సాయి 2) కలత్తూరు జ్యోతిక
కొత్త ఒనిమా: 1) నిడమర్తి ధృవ సాయి 2) దేవులపల్లి కృష్ణ కౌశిక్

ప్రాంతీయ పోటీల ప్రథమ విజేతలు సెప్టెంబరులో డాలస్ నగరంలో నిర్వహించే జాతీయ పోటీలలో తలపడతారు. మిషిగన్ లో సిలికానాంధ్ర మనబడి దినదిన ప్రవర్థమానంగా చిన్నారులను ఆకట్టుకుని ఇక్కడి తెలుగుపిల్లలందరికి మాతృభాష నేర్పుతోంది. ప్రస్తుతం సుమారు 350కు పైగా పిల్లలు మిషిగన్ లో Grand Rapids, Grand Blanc, Lansing, Ann Arbor, Novi, Canton, Livonia, Troy and Shelby-Township సెంటర్లలో తెలుగు నేర్చుకుంటున్నారు. వీటిలో ఇప్పటికే మూడునగరాల్లో మనబడి పాఠ్యప్రణాళికకు ప్రపంచభాష గుర్తింపు దిశలో ఒప్పందాలు కుదరడం విశేషం.

“పలుకే బంగారం.. పదమే సింగారం” అనే పిలుపుతో ఈ తెలుగు మాట్లాట పోటీలు భాషాభిమానులను ఆకట్టుకుంటూ, తల్లిదండ్రులకు తెలుగుపై మక్కువ పెంచుతూ, రేపటి తరమైన పిల్లలలో తెలుగు తారలను వెలికి తీస్తోందనడంలో సందేహం లేదు.

దక్షిణ డెట్రాయిట్, లివోనియా నగరంలో ఆటలకు విచ్చేసిన పిల్లలు.

ఉత్సాహంతో మాట్లాటలు ఆడుతాం అంటున్న ట్రాయ్ సెంటర్ కు వచ్చిన పిల్లలు.

లివోనియా మాట్లాట పోటీల విజేతలకు బహమతి ప్రధానం చేస్తున్న డెట్రాయిట్ షిర్డీ సాయిబాబా ఆలయ కార్యకర్త శ్రీ ప్రసాద్ సోము గారు.

ట్రాయ్ మాట్లాట పోటీలలో న్యాయ నిర్ణేతల తరపున విజేతలకు ట్రోఫీలు అందజేస్తున్న శ్రీమతి సుధ విష్ణుభొట్ల గారు.

సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట 2016 జాతీయ పోటీలకు ఉరకలు వేస్తున్న విజేతలు

వరుసగా నాల్గవ సంవత్సరం మాట్లాట పోటీలను విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు చెప్తున్న మిషిగన్ మాట్లాట బృందం.

    


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved