pizza
జనవరి 18న తెనాలిలో నాట్స్ మెగా హెల్త్ క్యాంప్
అమెరికా నుంచి తరలివస్తున్న వైద్య నిపుణులు
రోగులకు దాదాపు అరకోటి రూపాయల మందుల పంపిణీ
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

09 January 2015
Hyderabad

భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది.. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డ్ లో జనవరి 18 వ తేదీన భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనుంది. ఒకే రోజు 10 వేల మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించనుంది.. కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా  రోగులకు ఉచితంగా మందులు కూడా ఇవ్వనుంది. తెనాలి శాసనసభ్యులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ హెల్త్ క్యాంప్ కు తన పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించనున్నారు. అటు గుంటూరు జిల్లాలోని ఎన్.ఆర్. ఐ హాస్పిటల్ కు చెందిన వైద్యులు కూడా ఈ ఉచిత వైద్య శిబిరంలో మేము సైతం అంటూ ముందుకొచ్చి తమ సేవలు అందించనున్నారు. గుండె,ఉదరం, మూత్ర పిండాలు, నరాలు, కీళ్లు, మనోసంబంధ వ్యాధులతో పాటు అనేక రోగాలకు ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించనున్నారు. దీని కోసం కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ , పెయిన్ మెడిసన్, న్యూరలాజికల్, ఇంటర్నల్ మెడిసన్, అంకాలజిస్ట్, అర్ధోపెడిక్, కార్డియాక్ సర్జరీ, సైకియాట్రిస్ట్ ,ఫిడియాట్రిక్ సెష్పలిస్ట్.. ఇలా ఎన్నో వైద్య రంగాల నిపుణులు ఈ ఉచిత వైద్య శిబిరానికి అమెరికా నుంచి తరలివస్తున్నారు. ఇప్పటికే ఉచిత వైద్య శిబిరం ఏర్పాట్లను అడుసుమిల్లి రతీష్, అచంట గోపి, కోట ప్రసన్న తదితరులు పర్యవేక్షిస్తున్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఈ నెల 18 ఉదయం 8 గంటల నుంచి నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని తెనాలి పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని పేద రోగులంతా  సద్వియోగించుకోవాలని నాట్స్ తెలిపింది..

నాట్స్ ఉచిత వైద్య శిబిరంలో ప్రధానంగా అందించే సేవలు

1. గ్లో పౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు వినికిడి పరీక్షలు

2. శంకర్ నేత్రాలయం వారిచే నేత్ర పరీక్షలు

3. సిబార్, ఆయుష్ హస్పిటల్స్ ఆధ్వర్యంలో దంత పరీక్షలు

4.  మధుమేహా పరీక్షలు

5. రక్త పోటు పరీక్షలు

నాట్స్ ఉచితంగా పేద రోగులకు ఆరోగ్య పరీక్షలు చేయించి వైద్య సేవలు అందించడంతో పాటు దాదాపు రూ.46 లక్షల రూపాయల మందులను ఉచితంగా అందించనుంది. అమెరికా నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుల సూచనల మేరకు రోగులకు ఈ మందులు ఇవ్వడం జరుగుతుంది. రావిపాటి ఇందిర, మోహన్ దాస్, నల్లూరి కోటేశ్వరరావు, సుశీల ఈ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన రోగులకు ఆహరాన్ని అందించేందుకు రూ.2 లక్షలను నాట్స్ కు విరాళంగా ప్రకటించారు.  ఇక ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనేందుకు మేము సైతమంటూ అమెరికా నుంచి వస్తున్న వైద్య నిపుణుల వివరాలు ఇలా ఉన్నాయి.

వైద్యుని పేరు

ప్రత్యేకత

డాక్టర్ బాడిగ శ్రీరామ చంద్రమూర్తి

గ్యాస్ట్రో ఎంట్రాలజీ

డాక్టర్ ముక్కామల అప్పారావు

రేడియాలజీ

డాక్టర్ బోళ్ల రవిశంకర్ రెడ్డి

కార్డియాలజీ

డాక్టర్ చుండు వీరయ్య

పసికందుల వైద్య నిపుణులు

డాక్టర్ ఎ.వి గురవా రెడ్డి

ఎముకలు మరియు కీళ్ళ శస్త్ర వైద్య నిపుణులు

డాక్టర్ కొండ్రగుట్ట బుచ్చయ్య

 హెమటాలజీ / ఆంకాలజీ

డాక్టర్ అడబాల మాధురి

ఇంటర్నల్ మెడిసిన్

డాక్టర్ పాటిబండ్ల శ్రీహరి

సైకియాట్రిస్ట్

డాక్టర్ ములపర్ తేజానంద్ గౌతమ్

న్యూరాలజిస్ట్

డాక్టర్ గుడిపాటి చలపతిరావు

కార్డియాలజీ

డాక్టర్ కట్టా సదా శివరావు

కార్డియాలజీ

డాక్టర్ సూరపనేని కృష్ణ ప్రసాద్

ప్లాస్టిక్ సర్జరీ

డాక్టర్ పత్తిపాటి లక్ష్మి

 ఇంటర్నల్ మెడిసన్

డాక్టర్ నల్లూరి కోటేశ్వరరావు

అనెస్తీషియాలజీస్ట్

డాక్టర్ నల్లూరి సుశీల

సైకియాట్రిస్ట్

డాక్టర్ వేమూరి రవి కుమార్ ప్రసాద్

గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్

డాక్టర్ గంటి సూర్య ప్రకాశ్

అనెస్తీషియాలజీస్ట్

డాక్టర్ గుడిపాటి సుహాసిని

ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్

డాక్టర్ సతీష్ దాసరి

పెయిన్ మెడిసన్

డాక్టర్ మధు కొర్రపాటి

నెఫ్రాలజీ, అండ్ హైపర్ టెన్షన్

డాక్టర్ అడ్డగట్ల సుజాత

నెఫ్రాలజీ, అండ్ హైపర్ టెన్షన్

డాక్టర్ కొమ్మినేని రమేష్ బాబు

ఇంటర్నల్ మెడిసన్

డాక్టర్ ఆలపాటి రవీంద్ర

గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్

డాక్టర్ వెలగపూడి మోహన్ రామకృష్ణ

పీడియాట్రిక్స్

 

నాట్స్ కమిటీ నుంచి తెనాలి మెడికల్ క్యాంప్ కు వచ్చే వారి జాబితా
రవి అచంట
మాదాల రవీంద్ర
మోహన కృష్ణ మన్నవ
రాజ్ అల్లాడ
గంటి అరుణ
ములపురు విజయ
శ్యామ్ మద్దాలి
దేసు గంగాధర్
శ్రీధర్ అప్పసాని

మధుమేహ పరీక్షల యంత్రాల కోసం సన్ షైన్ హాస్పిటల్ రూ.2,25,000 విరాళంగా ప్రకటించింది. దాదాపు రూ.30 లక్షల రూపాయల మందులను డిస్కౌంట్ ధరలకు బాల శ్రీనివాస్, శ్యామ్ మద్దాలి, గంగాధర్ దేసులు అందిస్తున్నారు. నాట్కో ఫార్మాకు చెందిన నన్నపనేని చౌదరి రూ. 5,50,000ల మందులను ఉచితంగా నాట్స్ వైద్య శిబిరానికి ఇస్తున్నారు. డాక్టర్ ముక్కామల అప్పారావు  తమ ఎన్.ఆర్. ఐ కాలేజీ టీంను ఈ ఉచిత వైద్య శిబిరంలో సేవలందించేందుకు పంపిస్తున్నారు. అటు చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కూడా చాలా మంది వాలంటీర్లు ఈ ఉచిత వైద్య శిబిరంలో తమ సేవలు అందించనున్నారు.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved