pizza
Telananga Peoples Association of Dallas(TPAD) Oath Cenremony
ఘనంగా ముగిసిన డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) 2020 నూతన కార్యవర్గబృందం ప్రమాణ స్వీకారాలు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

29 January 2020
USA

డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్), జనవరి 26, ఆదివారం,2020 న ఈ సంవత్సరానికి ఎన్నుకొనబడిన నూతన కార్యవర్గ బృందం ప్రమాణస్వీకారాల సభ శుభం బాన్క్వెట్ హాల్ , ఫ్రిస్కో నగరములో నిర్వహించారు. డాలస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక మరియు తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు. ముందుగా డాలస్ చిరంజీవి శ్రేయస్ కొర్లపాటి ప్రార్థన గీతం మరియు అమెరికా, భారత దేశం జాతీయ గీతాలు ఆలపించగా కార్యవర్గ బృందం జ్యోతి ప్రజ్వలన చేసాక కార్యక్రమాన్ని రఘువీర్ బండారు ఫౌండేషన్ కమిటి మరియు శారద సింగిరెడ్డి బోర్డు అఫ్ ట్రస్టీ సంయుక్తంగా సభా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.

ముందుగా రఘువీర్ బండారు సభకి ఆహ్వానం తెలుపుతూ, 2014 లో సంస్థ స్థాపించినప్పటినుండి యిప్పటివరకు ఆరుసంవత్సరాల సంస్థవైభవాన్ని,సాధించిన ఘనతను అందరితో పంచుకున్నారు. విజయం వెనక పనిచేస్తున్న నాయకత్వాన్ని కార్యవర్గ బృందాన్ని, పోషక దాతలను మనస్పూర్తిగా అభినందిస్తూ వారి సేవలను అంకిత భావాన్ని కొనియాడారు. శారద సింగిరెడ్డి ప్రతీ ఏటా చేసిన సాంస్కృతిక, మరియు సామజిక సేవ రక్త దాన శిబిరాలు, నిరాశ్రయులకి ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు , వనభోజనాలు,మాతృ దేశం నుండి వొచ్చిన నిపుణలతో ‘మీట్ అండ్ గ్రీట్’ మరియు సాంఘిక కార్యక్రమాలతో దూసుకుపోతున్న శైలిని వివరించారు.

పూర్వ ఫౌండేషన్ కమిటీ చైర్ జానకి మందాడి 2020 లో నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ బృందాన్ని అభినందిచారు. జానకి మందాడి ఈ సంవత్సరానికి ఫౌండేషన్ కమిటీ చైర్ రావు కలవల గారితో ప్రమాణ స్వీకారం చేయించగా అజయ్ రెడ్డి , రఘువీర్ బండారు, పుష్ప గుచ్చం అందచేసి శాలువాతో సన్మానించారు. రావు కలవల గారు ఈ సంవత్సరం చేసే ,కార్యక్రమాల గురించి మాట్లాడుతూ, అతున్నతమైన సేవలందించడములో కమ్మూనిటీకి ముందు ఉంటామని తెలియ చేసారు. తరువాత అజయ్ రెడ్డి ‘టీపాడ్’ కార్యవర్గ బృందమంతా కలిసి నిస్వార్థంగా, ఆనందముతో కలిసి చేసే సేవ ఈ కమ్యూనిటీ కి ఒక ఆదర్శమని కొనియాడారు.

పూర్వ బోర్డు అఫ్ ట్రస్టీచైర్ పవన్ గంగాధర, పూర్వఅధ్యక్షుడు చంద్రా రెడ్డి పోలీస్ 2019 సంవత్సరములో జరిగిన కార్యక్రమాలకు సహకరించిన కమిటీ సభ్యులందరికి ధన్యవాదాలు తెలియ చేసారు. పవన్ గంగాధర నూతనంగా ఎన్నుకోబడిన బోర్డు అఫ్ ట్రస్టీస్ రామ్ అన్నాడి, అశోక్ కొండల, పాండురంగారెడ్డి పాల్వే మరియు ఇంద్రాణి పంచార్పులచే ప్రమాణ స్వీకారాలను చేయించగా, చంద్రా రెడ్డి పోలీస్ నూతనంగా ఎన్నుకోబడిన , ఎగ్జిక్యూటివ్ కమిటీ రవికాంత్ రెడ్డి మామిడి, మంజుల పంజాల , శ్రీధర్ వేముల , బాల గనవరపు, శ్రీనివాస్ అన్నమనేనితో ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం రఘువీర్ బండారు శారద సింగిరెడ్డి కలిసి ఈ సంవత్సరానికి బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ గా మాధవి సుంకిరెడ్డి , బోర్డు అఫ్ ట్రస్టీ వైస్ చైర్ గా ఇంద్రాణి పంచార్పుల , ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్ గా బుచ్చిరెడ్డి గోలి, ప్రెసిడెంట్ గా, రవికాంత్ రెడ్డి మామిడి, వైస్ ప్రెసిడెంట్ గా రూప కన్నెయ్యగారి, జనరల్ సెక్రటరీ గా అనురాధ మేకల, జాయింట్ సెక్రటరీ గా లింగా రెడ్డి అల్వా , ట్రెసరర్ గా శంకర్ పరిమళ్, జాయింట్ ట్రేసరర్ గా మధుమతి వ్యాసరాజు చే ప్రమాణ స్వీకారాలను చేయించారు. ప్రమాణ స్వీకారల అనంతరం మాధవి సుంకిరెడ్డి మరియు రవికాంత్ రెడ్డి మామిడి ఈ సంవత్సరం మరి కొన్ని సేవ కార్యక్రమాలకు రూప కల్పనలు చేస్తామని చెబుతూ వారికి పదవి భాద్యతలను యిచ్చిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలియచేసారు.

నూతనంగా పదవి భాద్యతలు స్వీకరించిన కొత్త బోర్డు అఫ్ ట్రస్టీస్ తో పాటు సుధాకర్ కలసాని, శారద సింగిరెడ్డి, వారితో పదవి భాద్యతలు కొనసాగించగా రఘువీర్ బండారు, అజయ్ రెడ్డి , జానకి మందాడి కూడా బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యులుగా ఈ సంవత్సరం సహకరించి ఆర్ధిక పరంగా మరియు కార్యనిర్వహణ సలహాల పటిష్ఠతకోసం ఈకార్యవర్గ బృందంతో కలవడం సంస్థకి గర్వకారణం. కొత్తగా పదవి భాద్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీతో మాధవి లోకిరెడ్డి, లక్ష్మి పోరెడ్డి, రత్న ఉప్పల, రోజా అడెపు వారి పదవి భాద్యతలు కొనసాగిస్తున్నారు. అడ్వైసరి కమిటీగా అరవింద్ రెడ్డి ముప్పిడి, ,విక్రమ్ రెడ్డి జంగం, వేణు భాగ్యనగర్,కరణ్ పోరెడ్డి,నరేష్ సుంకిరెడ్డి,రమణ లష్కర్, గంగా దేవర,జయ తెలకల పల్లి, సతీష్ నాగిళ్ల , కళ్యాణి తాడిమేటి వారి పదవి భాద్యతలు కొనసాగిస్తున్నారు.

ప్రెసిడెంట్ రవికాంత్ రెడ్డి మామిడి కార్యక్రమానికి వొచ్చిన అతిథులందరికి, ప్రసార మాధ్యమాలు మీడియా టీవీ5, టీవీ 9, వీ6 వారికి మరియు శుభం బాన్క్వెట్ హాల్, ఆనంద్ అడియార్ భవన్ ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియ చేసారు

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved