pizza
West Detroit Maatlaata 2015
You are at idlebrain.com > NRI community >
Follow Us


మే 2, 2015 న పశ్చిమ డెట్రాయిట్ లో జరిగిన సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట పోటీలలో విజేతలు వీరే

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

05 May 2015
Hyderabad

డెట్రాయిట్ మే 2, 2015. “కవిత రోడ్డు మీద జారి పడింది – ఈ వాక్యం ఏ కాలంలో ఉంది?” అనే ప్రశ్నకు క్విజ్ మాస్టర్ "భూతకాలం" అని అనుకుంటుంటే "వర్షాకాలం" అని చెప్పిన పిల్లలు వారి వారి ఉత్సాహంతో, ఊహలతో, తెలుగు పై ఉన్న పాటవాలు ప్రదర్శించి అందరిని ఆకట్టు కున్నారు. సిలికానాంధ్ర మనబడి ప్రవాస కుటుంబాలకు, పిల్లలకు తెలుగు పై మక్కువ పెరగాలనే ఉద్దేశ్యంతో మే 2, శనివారం, Farmington లో జరిగిన తెలుగు మాట్లాట పోటీలలో జరిగిన ఒక గమ్మత్తైన సన్నివేశమది. సుమారు 45 మంది బాలబాలికలు మాట్లాట పోటీలలో ఆడి తమ ప్రతిభాపాటవాలతో కనులవిందు గావించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పలుచోట్ల జరుగుతున్న ఈ మాట్లాట ఆటలు – తిరకాటం (Jeopardy-like games), పదరంగం (Telugu spelling bee), ఒక్క నిమిషం మాత్రమే (Telugu Just-a-minute) జరుగుతున్నాయి.

మిషిగన్ లో సిలికానాంధ్ర మనబడి దిన దిన ప్రవర్థమానంగా చిన్నారులను ఆకట్టుకుని తెలుగుని ఇక్కడి ప్రవాసాంధ్రుల పిల్లలుకు నేర్పుతోంది. ప్రస్తుతం సుమారు ౩౦౦కు పైగా పిల్లలు మిషిగన్ లో Grand Rapids, Lansing, Ann Arbor, Novi, Canton, Livonian, Troy (2 centers) and Shelby-Township సెంటర్లలో తెలుగు నేర్చుకుంటున్నారు.

“పలుకే బంగారం.. పదమే సింగారం” అనే పిలుపుతో ఈ మాట్లాట పోటీలు భాషాభిమానులను ఆకట్టుకుంటూ, తల్లిదండ్రులకు తెలుగు పై మక్కువ పెంచుతూ, రేపటి తరమైన పిల్లలలో తెలుగు తారలను వెలికి తీస్తోందనండంలో సందేహం లేదు. ఈ ఆటలలో విజేతలైన చిన్నారులు:

బుడతలు వయోవిభాగం (5 నుండి 9 ఏళ్ళు):
తిరకాటం: 1) పంత్రా యశ్వంత్ 2) వల్లభనేని అభినవ్
పదరంగం: 1) వల్లభనేని అభినవ్ 2) పంత్రా యశ్వంత్
ఒక్క నిమిషం మాత్రమే (ఓనిమా): సరళ ఓనిమా 1) పంత్రా యశ్వంత్ 2) గొండి హంస
కొత్త ఓనిమా 1) అద్దూరి రిషి
సిసింద్రీలు వయోవిభాగం (10 నుండి 13 ఏళ్ళు):
తిరకాటం: 1) సరిత రెడ్డి 2) ఘంటసాల చేతన
పదరంగం: 1) సరిత రెడ్డి 2) ఘంటసాల చేతన
ఒక్క నిమిషం మాత్రమే: సరళ ఓనిమా 1) కలత్తూరు జ్యోతిక 2) తురిమెళ్ళ ప్రభవ్
కొత్త ఓనిమా 1) జొన్నలగడ్డ కార్తీక్

ఈ మాట్లాట సఫలీకృతం కావడానికి ఎందరో తెలుగు భాషాభిమానులు చేతులు కలిపి పనిచేసారు. సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో ఈ ఆటలు ఇంకా ఎంతో పైకి ఎదగాలని, ఈ ఆటలు పిల్లలకు తెలుగు నేర్చుకోవడంపై మమకారం పెంపొందించాలని, వారి ప్రతిభా పాటవాలు మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుందాము. ఈ ఆటల గురించి, మనబడి కార్యక్రమాల గురించి ఆసక్తి ఉన్నవారు +1 248-602-0909 నంబరుకు TELUGU అని text చెయ్యండి.


5-9 ఏళ్ళ వయోపరిమితిలో జరిగిన పదరంగం లో మొదటి, తిరకాటం లో రెండవ బహుమతులు గెలుచుకున్న వల్లభనేని అభినవ్.


10-13 ఏళ్ళ వయోపరిమితి పదరంగం మరియు తిరకాటం రెండింటిలో మొదటి బహుమతులు గెలుచుకున్న సరిత రెడ్డి.


తిరకాటం (Jeopardy-like games) ఆట finals లో “కవిత జారి పడింది” భూతకాలం కాదు, వర్షాకాలం అని quiz master ని ఇరకాటంలో పెట్టిన సిసింద్రీలు.


“పదరంగం” తెలుగు Spelling Bee Finals ఆడుతుండగా ఎంతో ఉత్కంఠతో చూస్తున్న పెద్దలు, పిల్లలు. కంప్యూటర్ నుండి వినిపించే పదాన్ని వ్రాసి చూపించాలి.


5-9 ఏళ్ళ వయోపరిమితిలో జరిగిన పదరంగంలో రెండవ, తిరకాటంలో మొదటి బహుమతులు గెలుచుకున్న పంత్రా యశ్వంత్.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved