pizza

Agent musical blast soon
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’ త్వరలో మ్యూజికల్ బ్లాస్ట్

You are at idlebrain.com > news today >
Follow Us

18 February 2023
Hyderabad

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. ఇటీవల విడుదల చేసిన రిలీజ్ డేట్ వైల్డ్ యాక్షన్ గ్లింప్స్ కూడా క్యూరీయాసిటీని పెంచింది.

ఈ రోజు మహాశివరాత్రి శుభాక్షాంక్షలు తెలుపుతూ త్వరలోనే ఏజెంట్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. చార్ట్ బస్టర్ కంపోజర్స్ హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందించిన ఏజెంట్ ఎక్స్ టార్డినరీ సాంగ్స్ ని గ్రాండ్ విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఏజెంట్ బ్రాండ్ న్యూ పోస్టర్ లో అఖిల్ టెర్రిఫిక్ గా కనిపించారు.

ఈ సినిమా కోసం స్టైలిష్ మేక్ఓవర్ అయ్యారు అఖిల్. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని యూనిక్ స్పై థ్రిల్లర్‌ గా రూపొందించారు. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా నటిస్తోంది. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమరామెన్ గా పని చేస్తుండగా, హిప్ హాప్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతుంది.

తారాగణం: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి
దర్శకుడు: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీతం: హిప్ హాప్ తమిళ
డీవోపీ: రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved