pizza
Chalo 2nd song launch
'ఛలో' సెకండ్‌ సాంగ్‌ రిలీజ్‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

01 January 2018
Hyderabad


శంకర్‌ ప్రసాద్‌ మాల్పూరి స'ఛలో' సెకండ్‌ సాంగ్‌ రిలీజ్‌ మర్పణలో ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై నాగశౌర్య, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఛలో'. వెంకీ కుడుముల దర్శకుడు. ఉషా మాల్పూరి నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతుంది. కొత్త సంవత్సరం సందర్భంగా యూనిట్‌ సినిమాలోని సెకండ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. సీనియర్‌ పాత్రికేయులు పసుపులేటి రామారావు, బి.ఎ.రాజు సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ...

పసుపులేటి రామారావు మాట్లాడుతూ - ''సాంగ్‌ చాలా బావుంది. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''ఈ కొత్త సంత్సరం 2018కి 'ఛలో' సినిమా స్వాగతం పలుకుతుంది. ఆల్‌రెడీ విడుదలైన ఫస్ట్‌ సాంగ్‌ పెద్ద హిట్‌ సాధించింది. రెండో సాంగ్‌ కూడా ఎంతో బావుంది. కాసర్లశ్యామ్‌ పాటను ఎంతో చక్కగా రాశారు. నాగశౌర్య, వెంకీ కుడుములకు ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ సాదించి మంచి పేరు తెóస్తుంది'' అన్నారు.

సీనియర్‌ నరేష్‌ మాట్లాడుతూ - ''టాలీవుడ్‌లో గోల్డెన్‌ ఎరా స్టార్ట్‌ అయ్యింది. అందరూ టాలీవుడ్‌ వైపు ఆసక్తిగా గమనిస్తున్నారు. స్క్రిప్ట్‌ విన్నప్పుడే సినిమా పెద్ద హిట్‌ అవుతుందని చెప్పాను. ఫస్ట్‌ సాంగ్‌ వైరల్‌ అయ్యింది. ఇప్పుడు సెకండ్‌ సాంగ్‌ మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటుంది. సినిమా విడుదలకు ముందే థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు, శాటిలైట్‌ రేట్స్‌ కూడా అమ్ముడైపోవడం ఆనందదాయకం'' అన్నారు.

చిత్ర సమర్పకుడు శంకర్‌ ప్రసాద్‌ మాల్పూరి మాట్లాడుతూ - ''ఈ కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలి. మా సినిమా 'ఛలో'ను ఫిబ్రవరి 2న గ్రాండ్‌ లెవల్లో విడుదల చేస్తున్నాం'' అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ - ''ఫస్ట్‌ సాంగ్‌కు మేం ఊహించిన దాని కంటే చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 2017లో ఆసోసియేట్‌ డైరెక్టర్‌ని అయిన నేను డైరెక్టర్‌గా మారాను. ఈ 2018లో మంచి పేరున్న డైరెక్టర్‌ అవుతానని అనుకుంటున్నాను. సినిమా సూపర్‌హిట్‌ అవుతుంది'' అన్నారు.

హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ''సినిమా చాలా బాగా వచ్చింది. డెఫనెట్‌గా సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. నిర్మాతలు మా తల్లిదండ్రులు వారి గురించి పెద్దగా మాట్లాడలేను. అయితే నిర్మాతలుగా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. సాగర్‌ మహతి చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అలాగే సాయిశ్రీరాంగాచ్చిన ధైర్యంతోనే మేం ప్రొడక్షన్‌ హౌస్‌ను స్టార్ట్‌ చేశాను. వెంకీ సినిమాను చక్కగా డైరెక్ట్‌ చేశాడు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది'' అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న, నరేష్‌, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, మైమ్‌ గోపి, తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్‌: రాము అరసవిల్లి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు, సంగీతం: మహతి స్వరసాగర్‌, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌, నిర్మాత: ఉషా మాల్పూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ కుడుముల.

 



 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved