pizza
Annapurna International School of Film & Media to Premiere 8 Student Films at AISFM Grad Film Festival 2018
"వినూత్న ఆలోచనల్ని ప్రోత్సహిస్తూ విభిన్నమైన అంశాలతో చిత్రాలని నిర్మించగల ప్రతిభ ని తయారు చేయడమే లక్ష్యం" - AISFM చైర్మన్ అక్కినేని నాగార్జున
You are at idlebrain.com > News > Functions
Follow Us

7 May 2018
Hyderabad

The Grad Film Festival at Annapurna Studios opened with a curated show of films by Graduating Students of Annapurna International School of Film and Media today.

The 2-day Festival opened today with the premiere of films made by graduating final year students of BFA, MA & MMBA degrees dealing with 8 different entertaining and thought provoking subjects.

The list of film includes “Atma Rama Ananda Ramana” By Mahesh Gaddam , “The Fall into Spring” By Athul Prabhakaran, “Feathers of Green” By Tulsi Agarwal , “Apraapta” By Kshema B.K , “Plucked “ By Tejus Yakhob , “Manasutho Marosari” By Lolla Aditya , “Laxmi Griha Udyog By Chaitanya Khairkar , “Whispers” By Archi Saxena

The premiere and the AISFM Grad Festival 2018 were attended by industry luminaries Ms. Jayasudha , Mr. Sekhar Kammula, Ms. Lakshmi Manchu , Mr. Venky Atluri , Mr. Akhil Akkineni and Mr. Aneil Deepak .

Superstar, Chairman of AISFM, Akkineni Nagarjuna remarked “Media and entertainment never had such a wide platform before. I believe we are on the brink of a huge breakthrough, where language is not a barrier; the world is now your audience.”

At AISFM, we are working towards supporting this growing industry with skilled filmmakers and technicians. We ensure students get the experience of working in a world-class studio using state-of- the- art-equipment while making their grad films. We encourage fresh talent to work on diversified topics to bring new perspectives.

“Cinema” as a media has a strong impact on the society. Young filmmakers must develop sensibilities so their stories will make a difference.

Congratulating the students and wishing them a great future, Director of AISFM Amala Akkineni said “We all are excited and eager to watch the wonderful films that premier today by our talented graduating students. The purpose of this festival is to create an environment for the students to showcase their talent and celebrate their achievements in filmmaking. This festival not only recognises exceptional student work but also allow insightful feedback from industry stalwarts and variety of film professionals “.

Veteran actress Jayasudha said, “I am very happy to be associated with AISFM’s Grad Film festival. As an actress, I know the value of working with filmmakers who know their craft well. The film school inside Annapurna Studios provides students world class learning experience alongside exposure to film and media culture internationally. The studio has been associated with legends and I am confident that the graduating batch will make their mark in the Industry”.

For the students it was jubilation times as they celebrate the culmination of their 6 months of unified effort of filmmaking on celluloid. Cinema is a very strong medium and our students are encouraged to work on diversified topics in various languages, and the grad film festival is the celebration time.

Followed by Grad Festival opening on Saturday, May 5th there will be screening of Grad Films followed by another show on Sunday, May 6th which is open for friends, families of students & well wishers.

"వినూత్న ఆలోచనల్ని ప్రోత్సహిస్తూ విభిన్నమైన అంశాలతో చిత్రాలని నిర్మించగల ప్రతిభ ని తయారు చేయడమే లక్ష్యం" - AISFM చైర్మన్ అక్కినేని నాగార్జున

'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8 చిత్రాల ప్రదర్శన

అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిలిం అండ్ మీడియా (AISFM) లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు నిర్మించిన చిత్రాల ప్రదర్శనతో అన్నపూర్ణ స్టూడియోస్ లో మే 5 న 'గ్రాడ్ ఫిలిం ఫెస్టివల్' ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఫిలిం ఫెస్టివల్ లో AISFM లో BFA , MA , MMBA కోర్సులలో చివరి సంవత్సరం గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు నిర్మించిన 8 విభిన్నమైన, ఆలోచన రేకెత్తించే కధాంశాలతో ఉన్న చిత్రాలని ప్రదర్శించారు.

ప్రదర్శింపబడిన చిత్రాలు :
'ఆత్మ రామ ఆనంద రమణ' - మహేష్ గడ్డం
'ది ఫాల్ ఇంతో స్ప్రింగ్' - అతుల్ ప్రభాకరన్
'ఫెదర్స్ అఫ్ గ్రీన్' - తులసి అగర్వాల్
'అప్రాప్త' - క్షేమ బి.కే
'ప్లకెడ్' - తేజస్ యాకోబ్
'మనసుతో మరోసారి' - లొల్ల ఆదిత్య
'లక్ష్మి గృహ ఉద్యోగ్' - చైతన్య ఖరికార్
'విస్పర్స్' - ఆర్చి సక్సేనా

ఈ చిత్రాల ప్రీమియర్స్ ప్రదర్శనకి, AISFM గ్రాడ్ ఫిలిం ఫెస్టివల్ 2018 కి ఇండస్ట్రీ కి చెందిన పలు ప్రముఖులు జయసుధ, శేఖర్ కమ్ముల, లక్ష్మి మంచు, వెంకీ అట్లూరి, అఖిల్ అక్కినేని, అనిల్ దీపక్ హాజరయ్యి విద్యార్థులతో తమ అభిప్రాయాలని, ఆలోచనలని పంచుకున్నారు.

AISFM చైర్మన్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, " మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కి ప్రస్తుతం ఇంతకముందెన్నడు లేనన్ని అవకాశాలున్నాయి. ఈ రంగంలో రాబోయే రోజుల్లో ఒక కొత్త శకం మొదలవబోతోంది. ఈ రంగానికి భాషలకి అతీతంగా ప్రేక్షకులు ఉన్నారు. AISFM లో మేము ఈ ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడే టాలెంటెడ్ ఫిలిం మేకర్స్, టెక్నీషియన్స్ అందించే దిశగా కృషి చేస్తున్నాం. గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు వరల్డ్ క్లాస్ స్టూడియో లో చిత్రాలని నిర్మించే అనుభవాన్ని కల్పిస్తున్నాం. ఇందు కోసం ఆ స్థాయి ఎక్విప్ మెంట్ ని వారికి అందిస్తున్నాం. వినూత్న ఆలోచనల్ని ప్రోత్సహిస్తూ విభిన్నమైన అంశాలతో చిత్రాలని నిర్మించగల ప్రతిభ ని తయారు చేయడమే లక్ష్యం. సొసైటీ మీద 'సినిమా' ప్రభావం చాలా ఉంది. యువ దర్శకులు వాస్తవానుగుణంగా తమ కథల్ని రూపొందించినప్పుడు ఎంతో మార్పు వస్తుంది."

AISFM డైరెక్టర్ అమల అక్కినేని మాట్లాడుతూ , " ఈ రోజు ప్రతిభావంతులైన విద్యార్థులు నిర్మించిన వినూత్న ఆలోచనలతో రూపొందబడిన ఈ చిత్రాలని చూడడానికి ఎంతో ఆసక్తి తో ఎదురు చూస్తున్నాం. విద్యార్థులు తమ ప్రతిభ ని ప్రదర్శించే వాతావరణం కల్పించడం, వారు సాధించిన విజయాన్ని అందరితో కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం, ఈ ఫిలిం ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశం. ఈ ఫిలిం ఫెస్టివల్ విద్యార్థులు నిర్మించిన అద్భుత చిత్రాల ప్రదర్శన తో పాటు వాటి గురించి చిత్ర పరిశ్రమ ప్రముఖులు, నిపుణుల అభిప్రాయాలూ, సూచనలు విద్యార్థులకి మరింత ఉపయోగపడతాయి."

సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ, " ఈ AISFM గ్రాడ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక నటిగా, తమ పని గురించి బాగా తెలిసిన దర్శకులతో పని చేయడం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలో నే ఉన్న ఈ ఫిలిం స్కూల్ విద్యార్థులకి వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అందించడంతో పాటు, సినిమా, మీడియా కల్చర్ ని కూడా చాలా దగ్గిరగా గమనించే అవకాశం కలిపిస్తుంది. ఎంతో మంది లెజెండ్స్ భాగంగా ఉన్న ఈ స్టూడియో నుండి గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు పరిశ్రమ లో తమ ప్రతిభ చాటుతారని నమ్మకంగా చెప్పగలను."

 Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved