pizza
ANR National award 2017  to  Rajamouli
ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం.వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా ఏఎన్నార్ జాతీయ అవార్డును అందుకున్న ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 September 2017
Hyderaba
d

 

Vice President Honours SS Rajamouli with ANR National Award

The Vice President, Shri. Venkaiah Naidu, in presence of chief Ministers K. Chandrashekar Rao honoured acclaimed film-maker, storyteller SS Rajamouli, with the prestigious ANR National Award for his contribution to the Telugu Film Industry and inspiring new generation film makers at a function here today.

SS Rajamouli became the 10th recipient of the award which carries a memento, a citation and a cash prize.

ANR’s son Nagarjuna Akkineni along with entire Akkineni Family, numerous illustrious film industry well known personalities and students of AISFM and their parents were in full attendance at award function.

Speaking about legendary actor Dr. ANR, Telangana Chief Minister shri. K Chandrashekar Rao said “The doyen of Telugu film industry Dr. Akkineni Nageswara Rao left lasting impression for many generations as he immortalised many films across social, romantic and mythological generis.” He also recited lyrics from old songs from Dr.ANR films. He also praised Director Rajamouli and said he enjoyed watching Bahubali first in Hindi and in Telugu the second time.

Telangana CM also added Dr. ANR symbolised Telugu cinema in its entirety, laid the foundation for the development of Telugu Film Industry, in the state and dedicated his life not only to films but also building the film industry eco-system by creating one of the finest institutes AISFM in this country.

In his acceptance address, Mr. Rajamouli, said "Though I do not feel deserving for this exemplary award, I feel it gives you power and wings to fly. It is a huge burden, it certainly inspire me to work harder. I will certainly continue to work harder and try to worthy of this award started by great ANR Garu.

Vice President Venkaiah Naidu described Mr. Rajamouli as "One of the most creative, innovative and inspiring film-maker".

"You deserved the award because you are Baahubali”. he wished him many more accolades. You film all elements that makes you feel happy and proud of Indian cinema

He also added "Felicitation is to provide inspiration and to inspire people. It is a memorable moment for me to present evergreen ANR award today.

In his address Nagarjuna said Rajamouli’s contribution to expanding the Telugu Film Industry global reach with universally appealing content and inspiring new film makers to break new creative boundaries would also have made Dr. Akkineni Nageswara Rao proud of "our" choice of today's awardee.

At Dr.ANR National award function 95 students of Annapurna International School of Film + Media ( AISFM ) was honoured with their degrees in the presence of Director Rajamouli and other dignitaries.

About ANR National Award : This award was instituted in 2005 by the Akkineni International Foundation with an intent to recognise the contribution of stalwarts to the Indian film industry. Earlier recipients of the prestigious ANR National Award include Dev Anand, Shabana Azmi, Anjali Devi, Vyjayantimala Bali, Lata Mangeshkar, K. Balachander, Hemamalini, Shyam Benegal and Amitabh Bachchan.

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం.వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా ఏఎన్నార్ జాతీయ అవార్డును అందుకున్న ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

నటసామ్రాట్‌ డా|| అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతి సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును సినీరంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఇస్తున్న విషయం తెలిసిందే. 2017 సంవత్సరానికిగాను 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకొని తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిని ఎంపిక చేశారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ అవార్డు ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకు భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేయగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి అందించారు. అలాగే సన్మానపత్రం, చెక్కును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా....

కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ - ''మనం గర్వంగా చెప్పుకునే నటులు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరావుగారు. ఆయన పేరుపై స్థాపించిన ఈ అవార్డును గతంలో ఎంత గొప్పవాళ్లకు ఇచ్చారో మనమందరం చూశాం. అటువంటి గొప్ప అవార్డును మన తెలుగు బిడ్డకి ఇవ్వడం ఆనందంగా ఉంది. ఏ సందర్భంలో ఆయనకు అవార్డుని ఇస్తున్నామో నాగార్జునగారు నాకు చెప్పారు. తెలుగు మహానటుడిపై ఉన్నటువంటి అవార్డు, తెలుగు బిడ్డగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన సినీ దర్శకులు రాజమౌళిగారికి అందించడం సార్ధకంగా ఉందని నేను భావిస్తున్నాను. రాజమౌళిగారు ఈ అవార్డుకి సంపూర్ణ అర్హతను కలిగి ఉన్నారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సాహసాలు చాలా మంది చేస్తారు. అన్నీ సక్సెస్‌ కావు. నేను చూడలేదు కానీ విన్నవరకు రాజమౌళిగారి అన్నీ సాహసాలు సక్సెస్‌ అయ్యాయి. ఆయన వందల కొద్ది సినిమాలు తీయరు. తక్కువ సినిమాలే డైరెక్ట్‌ చేశారని విన్నాను. బాహుబలి సినిమా విడుదైన తర్వాత చాలా మంది స్నేహితులు సినిమా చాలా బావుందని చెప్పారు. నేను ముందు ఆ సినిమాను హిందీలో చూశాను. తర్వాత తెలుగులో కూడా చూశాను. అదొక అద్భుతమైన కళాఖండం అని చెప్పవచ్చు. ఒక రకంగా తెలుగులో ఇన్‌వెస్ట్‌ చేసి సినిమాలు చేయవచ్చునని నిరూపించి ఒక కొత్త ట్రెండ్‌ను సెట్‌ చేసిన దర్శకుడు రాజమౌళిగారు. నాగేశ్వరావుగారి గురించి నేను చెబితే బాగోదు. ఈ స్టేజ్‌పైనే నాగేశ్వరరావుగారి పాటలు విన్నాను. ఎంతో బావున్నాయి. ఈ సందర్భంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యగారు 'ఆరోజుల్లో పాటలు ఎంత లాలిత్యంగా శ్రావ్యంగా ,గొప్పగా ఉన్నాయో' అన్నారు. 'చిటపట చినుకులు పడుతూ ఉంటే..' 'మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనపడుతుంటే' ఈ సాహిత్యం చూస్తే రాసిన కవి ఎంతో అద్భుతంగా రాశారు. ఆ పాటలు అంత గొప్పగా ఉండేవి. చాలా మందికి ఇప్పుడు ఆ అర్థాలు కూడా తెలియవు. 'పడమటి సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపమరాగం ఒడిలో చెలి మోహనరాగం, జీవితమే మధురానురాగం..' ఈరోజుల్లో ఇలాంటి పాటలను ఊహించగలమా. ట్రెండ్‌ మారుతోంది. ట్రెండ్‌ మారుతుందనుకుంటున్న సమయంలో విడుదలైన గొప్ప చిత్రం 'శంకరాభరణం'. విడుదలైన కొత్తల్లో ఆ సినిమా గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ సినిమా రెండు వందలు, మూడు వందల రోజులు ఆడింది. దానిలో అంత బలముంది. ప్రేక్షకులు మంచిని ఎప్పుడూ ఆదరిస్తారు. తెలుగుభాష చాలా మధురమైనది, మనం కాపాడవలిసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి సినిమాలో సాహిత్య విలువలు, సామాజిక విలువలు ఉన్న పాట ఒకటైనా ఉండేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. గత తరం నుండి నేర్చుకున్న సంప్రదాయాన్ని వర్తమాన తరానికి, తద్వారా భవిష్యత్‌ తరానికి అందించే సత్‌ సంప్రదాయానికి శ్రీకారం చుట్టాల్సిందిగా నేను రాఘవేంద్రరావుగారిని కోరుతున్నాను. రాఘవేంద్రరావుగారు కూడా మన తెలుగులో గొప్ప దర్శకుల్లో ఒకరు. ఆయన్ను అనుసరించే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా నేను కూడా రాఘవేంద్రరావుగారిని కోరాను. రాజమౌళిగారికి ఈ అవార్డుని వచ్చిన సందర్భంలో ఒక విషయం చెబుతున్నాను. నాగేశ్వరరావుగారు పెద్దగా చదువుకోలేదు. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఉండేది కాదు. ఆయన సినిమా రంగాన్ని సంస్కరిస్తూ, ఆయన పెరుగుతూ సినిమాను ఎన్టీఆర్‌, నాగేశ్వరరావుగారు సినిమా రంగాన్ని పెంచారు. క్రమశిక్షణ అంటే ఏమిటి? ఎలా ఉండాలి? అని వారు కూడా పాటిస్తూ తెలుగు సినిమాను పెంచారు. హైదరాబాద్‌కు వచ్చిన తొలి హీరో నాగేశ్వరరావుగారు. బేగంపేటలో ఇల్లు నిర్మించుకుని, తెలుగు సినిమాలు ఇక్కడ కూడా నిర్మించాలనే సంకల్పంతో అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు. చాలా డేడికేటివ్‌గా పనిచేశారు. అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోకు రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. మట్టిరోడ్డు ఉండేది. ఆ కొండలు, బండలు, అడవిలాంటి ప్రదేశంలో స్థలం తీసుకుని చక్కటి స్టూడియో నిర్మించారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచి, తెలుగు సినిమా ఇక్కడకు రావడానికి శ్రీకారం చుట్టిన ఆద్యులు అక్కినేని నాగేశ్వరరావుగారు. మిగతావారంతా ఆయన్ను ఫాలో అవుతూ వచ్చారు. తర్వాత రామారావుగారు, రామానాయుడుగారు, కృష్ణగారు ఇలా అందరూ స్టూడియోలు కట్టారు. రామోజీరావుగారు అద్భుతంగా హాలీవుడ్‌ రేంజ్‌ స్టూడియో కట్టారు. గత సంవత్సరం అక్కినేని అవార్డును అందుకోవడానికి అమితాబ్‌గారు వచ్చినప్పుడు నాకొక మాట చెప్పారు. అత్యధిక చిత్రాలు హైదరాబాద్‌లోనే నిర్మితమవుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌ను ఆ సత్తా ఉంది. ఇంకా అభివృద్ధి చేయండి. సినిమా అంటే సిల్వర్‌ స్క్రీనే కాదు, బుల్లి తెర వచ్చినప్పుడు చాలా మార్పులు వచ్చాయని అన్నారు. తెలుగు సినిమా రంగానికి అన్ని విధాలైన తోడ్పాటు సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, అక్కినేనిగారి స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి ప్రతి ప్రతిష్టను నిలబెడుతూ వారి సంతానం అక్కినేని వెంకట్‌, నాగార్జునలు ఈ అవార్డు వేడుకను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు, వారి పేరుని కాపాడుతున్నందుకు అనేక వందల సినిమాలు చూసిన అక్కినేని అభిమానిగా వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రాజమౌళిగారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, చాలా విజయాలను సొంతం చేసుకోవాలని
హృదయపూర్వక ఆశీర్వచనాలు అందిస్తున్నాను'' అన్నారు.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ - ''1974లో అక్కినేని నాగేశ్వరరావుగారికి హార్ట్‌ ఏటాక్‌ వచ్చింది. పెద్ద పెద్ద డాక్టర్స్‌ వచ్చి ఆయనకు చికిత్స అందించి పద్నాలుగేళ్లు వరకు ఏ సమస్య లేదని అన్నారు. పద్నాలుగేళ్లు గడిచిన తర్వాత 1988లో మరోసారి ఆయనకు హార్ట్‌ ఏటాక్‌ వచ్చింది. మళ్లీ డాక్టర్స్‌ ఆయనకు ఆపరేషన్‌ చేయాలని గుండెను ఓపెన్‌ చేసి హార్ట్‌ వీక్‌గా ఉందని, రక్తాన్ని సరఫరా చేయలేకపోతుందని ఆపరేషన్‌ చేయడం మానేశారట. ఆ విషయాన్ని ఆయనకు చెప్పి కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మాత్రమే బ్రతుకుతారు అని అని కూడా నాగేశ్వరరావుగారికి చెప్పారు. డాక్టర్స్‌, మందుల సహాయంతో పద్నాలుగేళ్లు బ్రతికాను. నా విల్‌ పవర్‌తో మరో పద్నాలుగేళ్లు బ్రతుకుతాను అని అప్పుడు నాగేశ్వరరావుగారు అనుకున్నారట. అప్పట్నుంచి ఆయన కారు నెంబర్స్‌ను 2002గా మార్చుకుని ఆప్పటి వరకు నువ్వు నా దగ్గరకు రాలేవంటూ చావుకు వార్నింగ్‌ ఇచ్చి ఆయన బ్రతికారు. 2002 వచ్చింది. నేను పద్నాలుగేళ్లు బ్రతుకుతాను అని అనుకున్నాను కదా, ఇంకా ఏం కాలేదేంటి అని అనుకున్నారట. ఆ రోజు బయటకు వెళుతూ కారు దగ్గరో, పుస్తకంలోనో 9 అనే నెంబర్‌ చూశారట. సరే నీకు మరో తొమ్మిదేళ్లు సమయం ఇస్తున్నాను అని అనుకున్నారట. ఆయన పక్కనున్న నిర్మాతతోనో, దర్శకుడితోనో మాట్లాడ లేదు. ఆయన చావుతోనే మాట్లాడారు. ఆయన క్రమశిక్షణతోనే బ్రతికారు. చివరకు ఆయనకు ఈ ఆట ఆడి విసుగు రావడంతో సరే నువ్వు ఎప్పుడొస్తావో అప్పుడే రా..అని అనుకున్నారు. చివరకు మనల్ని వదలిపెట్టి వెళ్లిపోయారు. కానీ ఆయన కుటుంబం ఆయన్ను అమరుడిని చేసింది. చావును ఎప్పుడు కావాలంటే అప్పుడు రమ్మని పిలిచిన వ్యక్తులు నాకు తెలిసి ఇద్దరే ఉన్నారు. మహాభారతంలో భీష్ముడు అయితే కలియుగంలో అక్కినేని నాగేశ్వరరావుగారు. అంతటి మహానుభావుడి పేరు మీదున్న అవార్డును నాకు ఇవ్వడం చూసి నేను ఈ అవార్డుకు అర్హుడినా అనిపిస్తుంది. నాకు తెలిసి నేను అందుకు అర్హుడిని కాను. 'నాగార్జునగారు ఇలాంటి గొప్ప అవార్డుని తీసుకున్నప్పుడు మనం ఎగురుతున్నట్లు గొప్ప భావన కలగాలి కానీ నాకు ఈ అవార్డుని స్వీకరించడం భారంలా ఫీలవుతున్నాను. ఇంకా కష్టపడాలి అనే గుర్తు చేయడానికే ఈ అవార్డుని నాకు ఇస్తున్నారనిపిస్తుంది. నేను నా శాయశక్తులా ప్రయతిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను' '' అన్నారు.

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ - ''రాజమౌళి ఏఎన్నార్‌ అవార్డు తీసుకోవడం పెద్ద భారం' అని అంటున్నాడు. 'నేను ఆ అబ్బాయికి ముందే చెబుతున్నాను. ఈ అవార్డు తీసుకోవడం పెద్ద బాధ్యత అని, అది నువ్వు భరించగలవని..ఎందుకంటే నీ దగ్గర బాహుబలి ఉన్నాడు. శారీరకమైన బలం కాదు, మానసికమైన బలం నీకు ఉంది కాబట్టే నీకు ఈ బాధ్యతలను అప్పగించారు'. సన్మానాలు, పురస్కారాలు వల్ల ఇతరులకు ఇన్‌స్పిరేషన్‌ కలుగుతుంది. అలాంటి ఇన్‌స్పిరేషన్‌ను కలిగించడానికే నాగేశ్వరరావుగారు ఈ అవార్డును పెట్టారు. మిగతా వారికి ఓ స్ఫూర్తి వస్తుంది. అందుకనే నాగేశ్వరరావుగారు ఈ అవార్డు బాధ్యతను ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ అవార్డు ఫంక్షన్‌కి వస్తున్నప్పుడు నా మనవరాలు ఓ మెసేజ్‌ను చూపించింది. అందులో ఏముందంటే 'ఓ స్కూల్‌లో టీజర్‌ క్లాసు విద్యార్ధులందరితో ప్రపంచంలో ఏడు వింతలు గురించి చెప్పమని అడిగింది. సరేనని అందరూ ఏడు వింతలు చెప్పారు. కానీ ఒక అమ్మాయి మాత్రం కామ్‌గా ఉండటం చూసి టీచర్‌ ఎందుకు సమాధానం చెప్పలేదని అంటే నా ఆన్సర్‌ వీటికి భిన్నంగా ఉందని అంది. చూడగలటం, వినగలగడం, స్పర్శ, ఆస్వాదించడం, అనుభూతికి లోవనవడం, నవ్వగలగడం, ప్రేమించడం ప్రపంచంలోని అద్భుతాలన్నీ చిన్నారి చెప్పిందట'. అయితే నాకు అనిపిస్తున్నదేంటంటే మీ ఏడు అద్భుతాలను మహా అద్భుతంగా చూపించగలిగేది సినిమా. అలాంటి సినిమాను ఇంకా మహా అద్భుతంగా చూపించిన మరో వండర్‌ రాజమౌళి అని నేను భావిస్తున్నాను. అందుకే ఈ అవార్డుని రాజమౌళికి ఇవ్వడం సముచితంగా నేను భావిస్తున్నాను. తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచ పటంలో మొదటిసారి తలెత్తుకుని గర్వంగా నిలబడేలా చేసిన ప్రతి పాటవాలను పిన్న వయసులోనే కలిగియున్న వ్యక్తి రాజమౌళి. అందుకే ఒక మహానటుడు చనిపోయిన తర్వాత కూడా మన మధ్యలో జీవిస్తున్నారు. ఆయన పేరుపై ఉన్న అవార్డుని రాజమౌళికి ఇవ్వడం సముచితంగా భావిస్తున్నాను. ఇది మరచిపోలేని ఘట్టంగా భావిస్తున్నాను. రాజా హరిశ్చంద్ర నుండి రాజమౌళి బాహుబలి వరకు తెలుగు సినిమాను చూస్తే సినిమాలో ఎంత గుణాత్మక మార్పులు వచ్చాయో మనకు బోధపడుతుంది. భారతదేశంలో ఏటా 1600 సినిమాలు నిర్మితమవుతుంటే, ఈ పరిశ్రమ ద్వారా రెండు లక్షల మంది ఉపాది పొందుతున్నారు. మన సినిమాలకు విదేశాల్లో కూడా అపారమైన ఆదరణ కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఆదరణ ఇంకా ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నాను. సృజన్మాతక సినిమాలు ఎన్నో విజయాలను అందుకున్నాయి. సాంకేతిక విలువలతో కూడిన సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించినట్లే, రామాయణం, భారతం పైన వచ్చిన సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి దోహదపడే సాధనాల్లో సినిమా ఒకటి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగును కంపల్సరీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుగారిని అభినందిస్తున్నాను. మాతృభాషను మరచిపోకూడదు. ఇంగ్లీష్‌ నేర్చుకుంటేనే ఉద్యోగం వస్తుందని ఇంగ్లీస్‌వాడు నిబంధన పెట్టిపోయాడు. దాంతో మాతృభాషను అందరూ మరచిపోతున్నారు. ఇంగ్లీష్‌ మనకు అవసరమే కానీ మాతృభాష కంటే గొప్పది కాదు. మనం తప్ప వేరే దేశస్థులందరూ వారి మాతృభాషలోనే మాట్లాడుతారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వారి మాతృభాషను పెంపొందించుకునేలా కృషి చేయాలి. మాతృభాష కళ్లు అయితే, పరాయి భాష కళ్ళద్దాలు లాంటివి. తెలుగు వస్తేనే ఉద్యోగం అని నిబంధన పెట్టాలి. ఏం చెబుతున్నావ్‌ అనడం కంటే ఎలా చెబుతున్నావ్‌ అనే దానిపట్ల ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. భారతీయ సినిమా గ్లోబల్‌ సినిమాగా విస్తరిస్తుంది. భారతీయ సినిమాల్లో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఒకప్పుటితో పోల్చితే ఇప్పుడు సినిమా తక్కువ రోజులు ఆడితే సరిపోతుంది. సినిమా మార్కెట్‌ అలా తయారైంది. సినిమాలు ప్రేక్షకుడికి స్వాంతనతో పాటు సందేశాన్ని కూడా అందిస్తుంది. సినిమాకు భాషా బేదం లేదు. కొన్ని సినిమాలు కుటుంబంతో కలిసి చూసేలా లేవు. సినిమాల్లో హింస, వల్గారిటీ ఎక్కువ అవుతున్నాయి. దీని వల్ల నెగటివ్‌ ధోరణులు ఎక్కువ అవుతాయి. సినిమాలో మంచి ప్రమాణాలుండాలి. సమాజంలో పరిస్థితులపై సినిమాల ప్రభావం కూడా కాస్తా ఉంటుందని నేను భావిస్తున్నాను. రాజమౌళి ఇంకా మరిన్ని విజయాలు సాధించి ఇంకా పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడని భావిస్తున్నాను. ఆయనకు మంచి భవిష్యత్‌ ఉండాలి. మరిన్ని అర్థవంతమైన. కళాత్మకమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ''ఏఎన్నార్‌ అవార్డు సినిమా రంగంలో ఏదైనా సాధించిన వారికి, అందులో భాగమైన వారికి ఇవ్వడం జరుగుతుంది. వెంకయ్యనాయుడుగారు కాలేజీ రోజుల నుండే దేశం కోసం పాటు పడుతున్న వ్యక్తి. రూరల్‌ డెవలప్‌మెంట్‌ కోసం స్వర్ణ భారతి ట్రస్ట్‌ను పెట్టి పాటుపడుతున్న వ్యక్తి. మేం పిలవగానే వచ్చినందుకు ఆయనకు మా కృతజ్ఞతలు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌గారు కూడా ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. ఆయన కూడా ఈ అవార్డు కోసం ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అవార్డు స్వీకరణకు ఆయన అంగీకరించినందుకు ఆయనకు థాంక్స్‌'' అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అక్కినేని వెంకట్‌, అమల, నాగచైతన్య, అఖిల్‌, సుమంత్‌, నాగసుశీల, కె.రాఘవేంద్రరావు, ఆదిశేషగిరిరావు, కె.ఎల్‌.నారాయణ, పి.వి.పి, జగపతిబాబు, శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, రమా రాజమౌళి, వల్లీ తదితరులు పాల్గొన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved