pizza
Geetha Govindam anti piracy meet
'గీత గోవిందం' ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


13 August 2018
Hyderabad

విజయ్‌ దేవరకొండ, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్‌ సమర్పణలో జి.ఎ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై పరుశురాం దర్శకత్వంలో బన్నివాసు నిర్మించిన చిత్రం 'గీత గోవిందం'. ఆగస్ట్‌ 15న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే గుంటూరు ప్రాంతంలో పైరసీకి గురైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

దిల్‌రాజు మాట్లాడుతూ - ''వైజాగ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో అరవింద్‌గారుఎమోషనల్‌గా మాట్లాడారు. అది చూసి బాధేసింది. ఆయనకు పర్సనల్‌గా కాల్‌ చేశాను. 'ఇండస్ట్రీని వదిలేద్దామనుకుంటున్నాను..రాజు' అని ఆయన అన్నారు. చాలా బాధగా అనిపించింది. చిరంజీవిగారు, అరవింద్‌గారి ఫ్యామిలీ 45 ఏళ్లుగా ఇండస్ట్రీతో మమేకమైంది. రిలీజ్‌కు ముందు సినిమా పైరసీ అయితే తట్టుకోవడం కష్టం. అత్తారింటికి దారేది సినిమాకు కూడా ఇలాగే జరిగింది. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ రాత్రికి రాత్రే చాలా మందిని అరెస్ట్‌ చేశారు. టెక్నాలజీ ఎంతో పెరిగింది. ఎక్కడ అప్‌లోడ్‌ చేసినా..తెలిసిపోతుంది. పైరసీ చేసేవాళ్లు ఆలోచించుకుంటే మంచిది'' అన్నారు.

జెమిని కిరణ్‌ మాట్లాడుతూ - ''రిలీజ్‌ తర్వాత పైరసీ చేయవద్దని రిక్వెస్ట్‌ చేసేవాళ్లం. ఇప్పుడు రిలీజ్‌కు ముందే సినిమా బయటకు వచ్చేసింది. ఇప్పుడు సినిమా తీయడం చాలా కష్టమైంది. కొంత మంది ఉద్యోగాల కంపెనీల్లో చేరుతారు. అలా చేరినవాళ్లే ఇప్పుడు లీక్‌ చేశారు. ఎవరైతే లీకేజ్‌ను అప్‌లోడ్‌ చేశారో..వారి ఫోటోలను పేపర్స్‌లో వేస్తే.. వారి బ్రతుకులు ఏమవుతాయి. ఆ పరిస్థితికి మమ్మల్ని తీసుకొస్తారా? పైరసీ చేసేవాళ్లు.. పనిచేసే ముందు ఆలోచించుకుంటే మంచిది'' అన్నారు.

కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''పైరసీ చేయడం పెద్ద క్రైమ్‌. ఇండస్ట్రీలో ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే..చర్యలు తీవ్రంగా ఉంటాయి. వారి కెరీర్‌ అంతమైనట్లే. చాంబర్‌లో యాంటీ పైరసీ సెల్‌ ఉంది. రిలీజ్‌ తర్వాత పైరసీ కాకుండా చేయడమే చాలా కష్టమవుతుంది. మరి రిలీజ్‌కు ముందే ఇలాగైతే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అన్నారు.

బన్నివాసు మాట్లాడుతూ ''డైరెక్టర్‌ బుజ్జి, నేను ఏడాదిన్నరగా ఎన్నో నిద్రలేని రాత్రలు కష్టపడి చేసిన సినిమా ఇది. నాకు ఆరేళ్ల బాబు, మూడేళ్ల పాప ఉన్నారు. వాళ్లను చూసి పన్నెండు రోజులు అవుతుంది. రీరికార్డింగ్‌ చేసే సమయంలో సినిమా లీక్‌ అయ్యిందని తెలిసింది. ఎక్కడ తప్పు జరిగిందని చూస్తే.. గుంటూరులో లీక్‌ అయ్యిందని తెలిసింది. పోలీసులు 18 మంది స్టూడెంట్స్‌ను అరెస్ట్‌ చేశారు. టెక్నాలజీ పెరగడం వల్ల ఎక్కడ అప్‌లోడ్‌ అయ్యిందో తెలిసిపోతుంది. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసినవాళ్లం. మరో కోటి పోతే పోయిందనుకుని పైరసీపై పోరాడాలి. పైరసీపై ఇజ్రాయిల్‌ టీమ్‌ కూడా వర్క్‌ చేస్తుంది. ఇలా నెల రోజుల పాటు నెట్‌లో అప్‌లోడ్‌ చేసేవారిని అరెస్ట్‌ చేస్తాం'' అన్నారు.

పరుశురాం మాట్లాడుతూ ''నలబై రోజుల నుండి నిద్రలు లేకుండా పని చేసుకుంటూ వస్తున్నాం. ఓ డైరెక్టర్‌ సినిమా చేయాలంటే వందసార్లు కథ చెప్పాల్సి ఉంటుంది. కొత్త డైరెక్టర్స్‌ వస్తుంటారు.వారితో పోటీ పడుతూ అప్‌డేట్‌ అవుతుండాలి. ఇన్ని టెన్షన్స్‌ మధ్య సినిమా చేస్తే పైరసీకి గురి కావడం బాధగా ఉంది. ఇలాంటి చర్యలు జరగకుండా పెద్దలు చర్యలు చేపట్టాలి'' అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ - ''మంచి సినిమాను విడుదలచేయబోతున్నామనే సంతోషంలో ఇలా జరిగిందనే బాధ కలవర పెడుతుంది. ఓ సర్వీస్‌ ప్రొవైడర్‌ సంస్థలో పనిచేసే ఓ నీచుడు..గుంటూరులో ఓ ఫ్రెండ్‌కి ఫుటేజ్‌ పంపితే..అక్కడ నుండి అటు ఇటు లీక్‌ అవుతూ వచ్చింది. స్టూడెంట్స్‌పై కేసులు పెట్టడం బాధగానే ఉంది. వాళ్లు కావాలని చేశారని అనుకోవడం లేదు. సరదాగా.. చేసినా తప్పే. జైలుకు వెళ్లేంత తప్పు ఇది. విద్యార్థులు అయినా వృత్తి రీత్యా అరెస్టులు చేయక తప్పడం లేదు'' అన్నారు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ''బాధేసింది.. భయమేసింది. సినిమా తీసేది అందరికీ చూపించాలనే. సినిమా రిలీజ్‌ తర్వాత అందరి రియాక్షన్‌ ఎలా ఉందోనని ఆసక్తిగా ఎదురుచూస్తాం. అక్కడి వరకు వెళ్లకుండానే సినిమా రిలీజ్‌ అయిపోతేషాకింగ్‌గా ఉంటుంది. గీతాఆర్ట్స్‌ వంటి పెద్ద సంస్థల్లోనే ఇలా జరిగితే చిన్న సినిమాల పరిస్థితేంటి?.. పెళ్ళిచూపులు సినిమాను దాదాపు మేమే ప్రొడ్యూస్‌ చేశాం. అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని డైరెక్టర్‌ సందీప్‌ వాళ్ల అన్నయ్య ప్రొడ్యూస్‌ చేశాడు. పెళ్ళిచూపులు సినిమాకు ఇలా జరిగితే నాకు అర్జున్‌ రెడ్డి వచ్చేది కాదు. సినిమాను చాలా ఖర్చు పెట్టి తీస్తారు. సినిమా చుట్టూ చాలా ఎకానమికల్‌ యాక్టివిటీ ఉంటుంది. మరదలకు సినిమా చూపించడానికి సినిమాను లీక్‌ చేయడమేంటి? అంత సరదాగా ఉంటే థియేటర్‌కి తీసుకెళ్లాలి. స్టూడెంట్స్‌ ఇలా చేశారంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకోసారి ఇలా జరగకుండా ఉంటే బావుంటుంది'' అన్నారు. పైరసీని ఆరికట్టడంలో సహకరించిన అందరికీ నిర్మాత అల్లు అరవింద్‌ థాంక్స్‌ చెప్పారు.

 

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved