30 November 2017
Hyderabad
కె వరల్డ్ మూవీస్ బ్యానర్ పై రుద్రారపు సంపత్ డైరెక్షన్ లో బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ హీరోహీరోయిన్లుగా నిర్మాత హరికృష్ణ నిర్మించిన చిత్రం 'ఏక్'. బీయింగ్ హ్యూమన్ అనేది ఉపశీర్షిక. మంత్ర ఆనంద్ సంగీత సారధ్యంలో రూపుదిద్దుకున్న ఆడియోని కింగ్ నాగార్జున ఆవిష్కరించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి పాటలు విడుదలయ్యాయి.
ఆడియో సీడీ ని ఆవిష్కరించిన అనంతరం కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ''అందరికీ నమస్కారం. ఈ సినిమా హీరో భిష్ణుని చూస్తే నాకు 15 ఏళ్ల వయసులో బ్రూస్‌లీని చూసినట్లుంది. చూడగానే ఎంటర్ ద డ్రాగన్ గుర్తుకొచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సినిమా అంటే ఎంతో ఫ్యాషన్ ఉన్న టీమ్ అంతా కలిసి సినిమా చేసినందుకు. ఈ మధ్య అమితాబ్ బచ్చన్ గారితో కళ్యాణ్ జ్యూయలర్స్ వారిది యాడ్ చేస్తున్నప్పుడు జరిగిన సంభాషణ కూడా గుర్తుకొచ్చింది. మనం ఎలా నటులయ్యామో తెలియడం లేదు. ఇప్పుడొస్తున్న కుర్ర వాళ్లు చాలా టాలెంట్‌తో వస్తున్నారు అని ఆయన అన్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నాకు అదే అనిపించింది. అందుకే చిత్ర టీమ్‌ని విష్ చేస్తున్నాను. అందరికీ ఏక్ అనే నెంబర్ ఎంత ఇష్టమో.. ఈ సినిమా కూడా అదే స్థానంలో నిలబడాలని కోరుకుంటున్నాను. హీరో భిష్ణు అది అందుకోవాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మొదటి సినిమాని డైరెక్ట్ చేసిన సంపత్‌కి, నిర్మాత కృష్ణగారి ఆల్ ద బెస్ట్. నేనిక్కడికి రావడానికి కారణం హీరో భిష్ణు సోదరి సీత. మా అందరికీ ఎప్పటి నుంచో సపోర్టివ్‌గా ఉంది. చాలా మంచి హార్డ్ వర్కర్. ఆమె బ్రదర్ భిష్ణు కూడా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని'' అన్నారు.
హీరో బిష్ణు మాట్లాడుతూ.. ఇది ఫాస్ట్ ఫెసుడ్ యాక్షన్ థ్రిల్లర్ విత్ లవ్ స్టోరీ. టీం అంతా కష్టపడి, ఇష్టపడి చేశాం. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మై సూపర్ స్టార్ కింగ్ నాగార్జున గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.. అని అన్నారు.
దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. మానవీయ విలువలతో, మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది. అందరికీ నచ్చుతుంది. మంత్ర ఆనంద్ మంచి పాటలు ఇచ్చారు. ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు.. అని అన్నారు.
బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ, సుమన్, బెనర్జీ, పృథ్విరాజ్, శ్రవణ్, సర్దార్, అమన్ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మంత్రం ఆనంద్, ఆర్ట్: విజయ్ కృష్ణ, కెమెరా: చక్రవర్తి ఘనపాటి, ఎడిటింగ్: నందమూరి హరి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-నిర్మాత: హరికృష్ణ కొక్కొండ, దర్శకత్వం: సంపత్ రుద్రారపు.