pizza
Endaro Mahanubhavulu music launch
`ఎంద‌రో మ‌హానుభావులు` పాట‌లు విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

08 December 2016
Hyderaba
d

శ్రీ అన్న‌పూర్ణ క్రియేష‌న్స్‌పై బ్యాన‌ర్ ప‌ల్లాడ శ్రీనివాస్, శ్రీల‌క్ష్మి నిర్మాత‌లుగా ప‌ల్లాడ సాయికృష్ణ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం `ఎందరో మ‌హానుభావులు`. సిద్ధార్థ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య్ర‌క‌మం గురువారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. రఘుకుంచె ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

ర‌ఘుకుంచె మాట్లాడుతూ - ``అత్మీయుల స‌మ‌క్షంలోజ‌రుగుతున్న ఆడియో వేడుక ఇది. సిద్దార్థ్ అందించిన పాట‌లు చాలా బావున్నాయి. న‌టీన‌టులు బాగా పెర్‌ఫార్మ్ చేశారు. సాయికృష్ణ తొలి సినిమాతోనే ద‌ర్శ‌కుడుగా, హీరోగా బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించ‌డం చాలా గొప్ప విష‌యం. సినిమాను ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించాలి`` అన్నారు.

నిర్మాత‌లు ప‌ల్లాడ శ్రీనివాస్‌, శ్రీల‌క్ష్మి మాట్లాడుతూ - ``మాకు సినిమా రంగంతో ఎటువంటి ప‌రిచ‌యం లేదు. కానీ మా అబ్బాయికి సినిమాలంటే పిచ్చి ఏర్ప‌డింది. త‌న కోరిక నేర‌వేర్చ‌డం కోసం సినిమా తీశాం. నిర్మాత‌లు గా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టాం కానీ మా అబ్బాయి సాయికృష్ణ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం చేస్తూ క‌ష్ట‌ప‌డ్డాడు. త‌న‌కు షార్ట్‌ఫిలిం చేసిన అనుభ‌వం ఉంది. గ‌తంలో ఫ్రెండ్లీ పోలీస్ అనే షార్ట్ ఫిలిం చేసి సీఎం కె.సి.ఆర్‌గారితో అభినంద‌న‌లు అందుకున్నారు. నిజానికి ఈ టైటిల్ వేరే వాళ్ల ద‌గ్గ‌రుంటే వారి ద‌గ్గ‌ర నుండి ఈ టైటిల్‌ను తీసుకుని సినిమా చేశాం. అంద‌రికీ న‌చ్చేలా సినిమాను రూపొందించాం`` అన్నారు.

హీరో, ద‌ర్శ‌కుడు ప‌ల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో ఖ‌మ్మంకు చెందిన 200 మందిని ప‌రిచ‌యం చేస్తున్నాం. టైటిల్‌కు భిన్నంగా పూర్తి వినోదాత్మ‌కంగా ఉండే సినిమా. ఎనిమిది నెల‌లు క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా. ప్ర‌తి పాట డిఫ‌రెంట్‌గా వ‌చ్చింది. తొలి సినిమాకు హీరోగా, ద‌ర్శ‌కుడిగా చేయ‌డం ఆనందంగా ఉంది. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ మాట్లాడుతూ - ``నిర్మాత‌లు నాకు పూర్తి ఫ్రీడ‌మ్ ఇచ్చారు. మంచి మ్యూజిక్ కుదిరింది. అవ‌కాశం ఇచ్చిన సాయికృష్ణ‌గారికి, నిర్మాత‌లకు థాంక్స్‌`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత సాయికుమార్‌,ఘంట‌శాల విశ్వ‌నాథ్‌, అమీర్ పేట‌లో ద‌ర్శ‌కుడు శ్రీ, హీరోయిన్ అనూష‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైట‌ర్ కిర‌ణ్‌, పులిపాటి ప్ర‌సాద్ స‌హా చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.


 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved