pizza
HBD music launch
`హ్యాక్‌డ్‌ బై డెవిల్‌ (హెచ్‌బిడి)` ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 January 2017
Hyderaba
d

లాగిన్‌ మీడియా పతాకంపై మేఘన, సంతోషి, సల్మాన్‌ ప్రధాన పాత్రల్లో కృష్ణకార్తీక్‌ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్‌. వై నిర్మించిన హర్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీ 'హ్యాక్‌డ్‌ బై డెవిల్‌' (హెచ్‌బిడి). ఈ సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌, ల‌య‌న్ సాయివెంక‌ట్‌, సముద్ర‌, వీరేంద‌ర్‌, త‌మ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ స‌హా చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ బిగ్ సీడీని విడుద‌ల చేశారు. ప్ర‌తాని రామ‌కృష్ణా గౌడ్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు.

స‌ర్వే స‌త్యనారాయ‌ణ మాట్లాడుతూ - ``సినిమా ప్రొడ్యూస‌ర్ ఉద‌య్ తండ్రి, నేను మంచి స్నేహితులం. సినిమా ట్రైల‌ర్ ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. టైటిల్ ఇంగ్లీష్‌లో కొత్త‌గా ఉంది. నేను కూడా గ‌తంలో రెండు సినిమాల్లో న‌టించాను`` అన్నారు.

ప్ర‌తాని రామ‌కృష్ణాగౌడ్ మాట్లాడుతూ - ``ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. గ‌తేడాది త‌ర‌హాలోనే ఈ ఏడాది కూడా చిన్న సినిమాలు పెద్ద స‌క్సెస్‌ను సాదిస్తున్నాయి. యంగ్ టీం చేసిన మంచి ప్ర‌య‌త్నం స‌క్సెస్ కావాల‌ని, వారికి నా వంతు స‌హాయ స‌హ‌కాలు ఉంటాయని తెలియ‌జేస్తున్నాను`` అన్నారు.

సాయివెంక‌ట్ మాట్లాడుతూ - ``దర్శ‌క నిర్మాత‌లు ఇద్ద‌రూ ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌. ఇద్ద‌రూ క‌లిసి సినిమాను బాగా ప్ర‌మోట్ చేస్తార‌ని ఆశిస్తున్నాను. ట్రైల‌ర్‌, ఆడియో బావుంది. ఈ సినిమా ఆర్.ఆర్‌. బావుంది. సినిమా పెద్ద స‌క్సెస్ సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

చిత్ర దర్శకుడు కృష్ణకార్తీక్‌ మాట్లాడుతూ - ``దేవుడు కూడా నిజ‌మైతే, దెయ్యం కూడా నిజ‌మేన‌ని క్యాప్ష‌న్ పెట్టాం. ఈ పాయింట్‌తో సినిమా ఉంటుంది. మ‌హి మ్యూజిక్ డైరెక్ట‌ర్ మంచి సాంగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాకు సంబంధించిన టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన నేను..ఫస్ట్‌టైమ్‌ డైరెక్షన్‌ చేశాను. ఈ చిత్రం యూత్‌ని డెఫనెట్‌గా ఆకట్టుకుంటుంది. ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో, చక్కటి సంగీతంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. నన్ను, నా కథని నమ్మి..నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. నా ఈ తొలి ప్రయత్నానికి సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను...అన్నారు.

చిత్ర నిర్మాత ఉదయ్‌భాస్కర్‌. వై మాట్లాడుతూ - ``మేము ఒక టీమ్‌లా ఏర్పడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అంద‌రీ టీం క‌ష్టం. కృష్ణ‌కార్తీక్ ప‌క్కా ప్లానింగ్ వ‌ల్ల సినిమా అవుట్ పుట్ బాగా వ‌చ్చింది. మంచి మ్యూజిక్, ఆర్‌.ఆర్ కుదిరింది. ఈ చిత్రం తర్వాత రెగ్యులర్‌గా సినిమాలు నిర్మిస్తాం. ప్రస్తుతం మా ఈ హ్యాక్‌డ్‌ బై డెవిల్‌ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మా ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని, అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌హి మ‌ద‌న్ మాట్లాడుతూ - ``ద‌ర్శ‌క నిర్మాత‌ల స‌పోర్ట్‌తోనే మంచి మ్యూజిక్ అందించ‌గ‌లిగాను. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌`` అన్నారు.

మేఘన, సంతోషి, సల్మాన్‌, హిమజ, మానస, సురేష్‌, అజయ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్‌ యం.యం, డిఓపి: కన్నా కోటి, ఎడిటర్‌: కె.ఆర్‌. స్వామి, డైలాగ్స్‌: అభయ్‌ శ్రీజయ్‌, కో-డైరెక్టర్‌: రమేష్‌ పోలే, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: మల్లిక్‌. కె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వినయ్‌ గౌడ్‌. వై, నిర్మాత: ఉదయ్‌భాస్కర్‌. వై, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కృష్ణకార్తీక్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved