pizza
Lovers Day music launch
`ల‌వ‌ర్స్ డే` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


23 January 2019
Hyderabad

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ న‌టించిన మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆధార్ ల‌వ్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో `ల‌వ‌ర్స్ డే` పేరుతో సుఖీభ‌వ సినిమాస్ సంస్థ విడుద‌ల చేస్తోంది. ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి నిర్మాత‌లు. ఒమ‌ర్ లులు ద‌ర్శ‌కుడు. షాన్ రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆడియో సీడీల‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా..

న‌టుడు అలీ మాట్లాడుతూ - ``ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌. ప్రియా వారియ‌ర్ మంచి ఎక్స్‌ప్రెష‌న్స్ ఉన్న హీరోయిన్‌. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంది`` అన్నారు.

అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ - ``ఆర్‌.ఎక్స్ 100 సినిమాను రిలీజ్ చేయాల‌నుకుంటున్న త‌రుణంలో సురేష్‌గారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. వినోద్ రెడ్డిగారు వెలంటెన్స్ డే రోజున ఆయ‌న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

భాస్క‌ర్ మాట్లాడుతూ - ``యూత్‌కు న‌చ్చే కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న ఈ సినిమా గ్రాండ్ స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

చైత‌న్య ప్ర‌సాద్‌ మాట్లాడుతూ - ``ఇది కుర్ర‌కారు సినిమా. పిల్లా రా.. పాట‌తో నేను యూత్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాను. ఇప్పుడు ల‌వ‌ర్స్ డే సినిమాలో మంచి పాట రాసే అవ‌కాశం వ‌చ్చింది. గ్యారంటీగా ఈ పాట పెద్ద హిట్ అవుతుంది. అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు గురురాజ్‌, వినోద్‌గారికి థాంక్స్‌. నిర్మాత‌లు ఈ సినిమా మంచి లాభాల‌ను తెచ్చి పెట్టాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

చంటి అడ్డాల మాట్లాడుతూ - ``ల‌వ‌ర్స్ డే రోజు విడుద‌ల‌వుతున్న ఈ సినిమా నిర్మాత‌ల‌కు మంచి లాభాల‌ను తెచ్చిపెట్టాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ఒమ‌ర్ లులు మాట్లాడుతూ - ``మా సినిమాను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన స్టైలిష్ స్టార్‌గారికి థాంక్స్‌. మ‌ల‌యాళంలో ఎంత మంది స్టార్స్ ఉన్నా.. మా వీడియో ఎవ‌రూ షేర్ చేయ‌లేదు. అల్లు అర్జున్‌గారు మాత్ర‌మే షేర్ చేశారు. చాలా మంది కొత్త వాళ్ల‌ను ఈ సినిమాతో ప‌రిచ‌యం చేస్తున్నాం. ప్రేక్ష‌కుల ఆశీర్వాదం సినిమా రిలీజ్ త‌ర్వాత ఇలాంటి అభిమానాన్ని క‌న‌ప‌ర‌చాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ప్రియా ప్ర‌కాష్ మాట్లాడుతూ - ``అల్లు అర్జున్‌గారంటే నాకు చాలా ఇష్టం. ఆయ‌న‌తో క‌లిసి స్టేజ్‌పై నిల‌బ‌డే అవ‌కాశం వ‌స్తుంద‌ని అనుకోలేదు. ఆయ‌న్ను క‌లుసుకున్నందుకు థాంక్స్‌. ఈ అవ‌కాశం ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. సినిమా రిలీజ్ కంటే ముందే మ‌మ్మ‌ల్ని స‌పోర్ట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఒరు ఆడార్ ల‌వ్ టీం నుండి అడ్వాన్స్‌డ్ హ్య‌పీ వెలంటెన్స్ డే`` అన్నారు.

రోష‌న్ మాట్లాడుతూ - ``మా సినిమాకు స‌పోర్ట్ చేయ‌డానికి వ‌చ్చిన అల్లు అర్జున్‌గారికి థాంక్స్‌. ఆయ‌న‌కు కేర‌ళ‌లో కూడా చాలా మంది అభిమానులున్నారు. ఒమ‌ర్ గారికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఆడిష‌న్ ద్వారా నేను చేసిన తొలి చిత్ర‌మిది. నాకు ద‌క్కిన గొప్ప అవ‌కాశంగా భావిస్తున్నాను`` అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు వినోద్ రెడ్డి మాట్లాడుతూ - ``మా యూనిట్‌కు స‌పోర్ట్ చేయ‌డానికి వ‌చ్చిన అల్లు అర్జున్ గారికి. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశాను. బ‌న్నివాసుగారి స‌హాయంతో అల్లు అర్జున్‌గారిని క‌ల‌వ‌గానే ఆయ‌న న‌న్ను గుర్తు ప‌ట్టి.. అడ‌గ్గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ఈ ఫంక్ష‌న్‌కి వ‌స్తాన‌ని అన్నారు. భ‌విష్య‌త్‌లో కూడా నీకు నా స‌పోర్ట్ ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న స‌పోర్ట్‌ను జీవితంలో మ‌ర‌చిపోలేను`` అన్నారు.

నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ - ``నేను బ‌న్నిగారికి పెద్ద అభిమానిని. ఆయ‌న‌కు థాంక్స్‌. అలాగే చాలా మంది న‌న్నుస‌పోర్ట్‌ చేయ‌డానికి వ‌చ్చారు. తెలుగులో అవ‌కాశం ఇచ్చిన ఔసాప‌చ్చ‌న్ సార్‌గారికి థాంక్స్‌. నేను కూడా సినిమా మీద కోరిక‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. న‌టుడు కావాల‌నుకున్న నేను అప్ప‌ట్లో అవ‌కాశం, అదృష్టం లేక న‌టుడ్ని కాలేక‌పోయాను. త‌ర్వాత రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి వ‌చ్చి ఈ స్థాయికి ఎదిగాను. సినిమా అంటే చాలా ప్యాష‌న్‌. సీతారామ‌రాజుగారు, సురేష్‌గారి స‌పోర్ట్‌తో ఈ సినిమా అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాను. అలాంటి స‌మ‌యంలో నా మిత్రుడు వినోద్ రెడ్డి గారు స‌పోర్ట్ చేశారు`` అన్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ - ``సౌతిండియ‌న్ సినిమాల్లో నేష‌న‌ల్ వైడ్‌గా, ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్‌గా వైర‌ల్ అయిన వీడియోస్‌లో కొల‌వెరి డీ.. , బాహుబ‌లిలో హు కిల్డ్ క‌ట్ట‌ప్ప‌.., ఈ మ‌ధ్య కాలంలో ఆ రేంజ్‌లో వైర‌ల్ అయిన వీడియోస్‌లో ఒరు ఆడార్ ల‌వ్‌. నాకు సౌతిండియా అంటే పిచ్చి. నా ప్రొఫెష‌న్‌లో సౌతిండియ‌న్ యాక్ట‌ర్ అని రాసుకుంటాను. నేను ద‌క్షిణాదికి చెందిన వాడిన‌ని చెప్పుకోవ‌డానికి గ‌ర్వ‌ప‌డ‌తాను. నేను పుట్టింది చెన్నైలో. పెరిగింది హైద‌రాబాద్‌లో.. అలాగే మ‌ల‌యాళం వాళ్లు , క‌ర్ణాట‌క‌వాళ్లు కూడా న‌న్ను ఆద‌రిస్తున్నారు. కాబ‌ట్టి నేనుసౌతిండియ‌న్‌నే. ఈ సినిమా ఫంక్ష‌న్‌కు నేను రావ‌డానికి రెండు కార‌ణాలున్నాయి. ఒక‌టి .. నా సినిమాల‌ను కేర‌ళ‌వాళ్లు వాళ్ల సొంత సినిమాల్లాగా ఆద‌రిస్తున్నారు. ఓ ల్యాండ్ మార్క్ ఉన్న మ‌ల‌యాళ సినిమా తెలుగులోకి వ‌స్తున్న‌ప్పుడు నేను స‌పోర్ట్ చేసిన‌ట్టుగా ఉండాలి క‌దా అని వ‌చ్చాను.ఈ సినిమా ద్వారా మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీని వెల్‌కం చేస్తున్నాను. మ‌న సినిమాల‌ను కూడా వేరే భాష‌ల్లో చూస్తున్నారు క‌దా. ఈ సినిమాకు సోష‌ల్ మీడియా ద్వారా బ‌జ్ క్రియేట్ చేసిన రోష‌న్‌, ప్రియావారియ‌ర్‌ల‌కు అభినింద‌న‌లు. ఈ క్రెడిట్ డైరెక్ట‌ర్ ఒమ‌ర్ లులుగారిది. ఇక రెండోది.. నా పేరు సూర్య సినిమా స‌మ‌యంలో వినోద్ రెడ్డి గారిని క‌లిశాను. త‌న‌ని నా అభిమానిగా బ‌న్ని వాసు ప‌రిచ‌యం చేశాడు. సినిమా రిలీజై కొన్ని గొడ‌వ‌లు వ‌చ్చాయి. . అయితే అప్పుడు కూడా వినోద్ రెడ్డి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడ‌ని వాసు ద్వారా తెలుసుకున్నాను. నిజంగా మ‌న‌కు వీలైన‌ప్పుడు మ‌న‌మేదైనా చేయ్యాలి వాసు అని అన్నాను. ఆయ‌న వ‌చ్చి న‌న్ను అడ‌గ్గానే నేను వ‌చ్చి నిల‌బ‌డ్డాను. నేను ఎంత కాలం నిల‌బ‌డ‌గ‌ల‌నో తెలియ‌దు కానీ.. అవ‌కాశం ఉన్న ప్ర‌తిసారి నా కోసం నిల‌బ‌డ్డ ప్ర‌తి ఒక్క‌రి కోసం నిల‌బ‌డ‌తాను. గురురాజ్‌గారికి అభినంద‌న‌లు. ఈ సినిమా కోసం ప‌నిచేసిన ప్ర‌తి ఒక‌రికీ అభినంద‌న‌లు. ఈ సినిమా ల‌వ‌ర్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల‌వుతుంది. నా బ‌ర్త్‌డేకి ఎంత ఎగ్జ‌యిటెడ్‌గా ఉంటానో .. ల‌వ‌ర్స్ డేకు కూడా అంతే కంటే 10 శాతం ఎగ్జ‌యిటెడ్‌గా ఉంటాను. ఇప్పుడు అయితే నా భార్య‌ను ఎలా స‌ర్‌ప్రైజ్ చేయాలో ఆలోచిస్తుంటాను`` అన్నారు.

 

 

Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved