pizza
Neevevaro music launch
నీవెవ‌రో ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us


12 August 2018
Hyderabad

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటిస్తోన్న చిత్రం 'నీవెవరోస . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ని నాని ఆవిష్క‌రించారు. బిగ్ సీడీని బాప‌ట్ల ఎమ్మెల్యే కోనా ర‌ఘుప‌తి ఆవిష్క‌రించారు. `నిన్ను కోరి` టీమ్ స‌క్సెస్ ఫ్లేమ్ ని `నీవెవ‌రో` టీమ్‌కి అందించారు. ఈ సంద‌ర్భంగా...

కోన ర‌ఘుప‌తి మాట్లాడుతూ ``ఓ మంచి కార్య‌క్ర‌మంలో నేను పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది. `గీతాంజ‌లి` ఆడియో వేడుక‌కు వ‌చ్చావు బాబాయ్‌.. ఈ సినిమాకు కూడా రావాలి` అని మా అబ్బాయి న‌న్ను ఆహ్వానించారు. పాట‌లు బావున్నాయి. నాని, నివేదితా, ఆది `నిన్ను కోరి`లో చాలా బాగా న‌టించారు. ఒక‌ళ్ల‌ను మించి ఒక‌ళ్లు అందులో అద్భుతంగా న‌టించారు. ఆది కో స్టార్ మాత్ర‌మే కాదు, హీరో స్ట‌ఫ్ అని నేను మా నీర‌జ‌తో అన్నాను. ఆదికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఆదికి మంచి బ్రేక్ కావాలి. నానిని మించి అన‌లేను కానీ, నానితో పోటాపోటీగా మ‌రో స్టార్ వ‌చ్చాడ‌ని మాత్రం నేను అన‌గ‌ల‌ను`` అని చెప్పారు.

నాని మాట్లాడుతూ ``స‌క్సెస్ ఫ్లేమ్‌ని అంద‌రికీ ఇచ్చినా నాకు హ్యాపీయే. ఎందుకంటే `నిన్ను కోరి` నుంచి నాకు ఆది మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించి నాకు ప్ర‌తిదీ ముందే చెప్పేవాడు. నేను, నివే, ద‌ర్శ‌కుడు త‌ప్ప `నిన్ను కోరి` నుంచి మిగిలిన టీమ్లో చాలా మంది ఈ సినిమాకు ప‌నిచేశారు. ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఆది మంచి పెర్ఫార్మ‌ర్‌. `రంగ‌స్థ‌లం` చిత్రానికి త‌న‌కు అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు త‌ను న‌న్ను అడిగితే `నీలాంటి మంచి పెర్ఫార్మ‌ర్ మంచి రోల్స్ వ‌చ్చిన‌ప్పుడు చేయ‌క‌పోతే, మంచి రోల్స్ చేయ‌డానికి ఇంకెవ‌రూ ఉండ‌రు. చేసేయ‌మ‌ని చెప్పాను. ఆ మాట‌లు నాకు ఇంకా గుర్తున్నాయి. త‌ను ఏ రోల్ చేసినా, ఆ రోల్‌కి అంతగా సూట‌వుతున్నాడు. వ‌ర్స‌టైల్ ఆర్టిస్ట్ ఆది. ఫ్యూచ‌ర్‌లో ఇంకా ఎత్తుకు ఎదుగుతాడ‌ని న‌మ్మ‌కం ఉంది. కోన‌గారు షూటింగ్ విష‌యాలు చాలా చెప్తుంటారు. ఆయ‌న ఆన్ లొకేష‌న్ ఉండ‌టం చాలా ఎనర్జీగా ఉండేవారు. `నీవెవ‌రో` టీమ్ ని అనుకుంటే నాకు ఈ విష‌యంలో ఈర్ష్య‌గా ఉండేది. అచ్చు చాలా మంచి సంగీత ద‌ర్శ‌కుడు. అచ్చుకు ఒక్క సినిమా `నీవెవ‌రో` అనుకుంటున్నా. ఈ సినిమా త‌ర్వాత అత‌ను వేరే స్థాయికి వెళ్లాడు. ఈ ఆల్బ‌మ్‌లో సిద్ శ్రీరామ్ పాడిన వెనె్న‌ల అనే పాట నాకు చాలా ఇష్టం. 24 నా ల‌క్కీ నెంబ‌ర్‌. ఆగ‌స్ట్ 24న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

కోన వెంకట్‌ మాట్లాడుతూ - ''ప్రతి సినిమాకు ఏదో ఎలిమెంట్‌ సినిమాకు సోల్‌ అవుతుంది. మా బ్యానర్‌లో వచ్చిన 'అడిగా అడిగా..' సాంగ్‌ సోల్‌ అయింది. అలాగే ఈ సినిమాకు 'వెన్నెల..' పాట సోల్‌ అయింది. రైటర్‌గా 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఓ సెర్చింగ్‌ స్టార్ట్‌ అయింది. సినిమాల్లో ఏదో మిస్‌ అయ్యాననే ఫీలింగ్‌ ఉండిపోయింది. దాని వల్ల బ్యానర్‌ పెట్టి గీతాంజలి సినిమా చేశాను. 3.5 కోట్లతో చేసిన ఆ సినిమా 12కోట్లను రాబట్టింది. నిన్నుకోరితో శివ నిర్వాణ వంటి సెన్సిబుల్‌ డైరెక్టర్‌ని పరిచయం చేశాను. తను భవిష్యత్‌లో గొప్ప దర్శకుడు అవుతాడు. కొత్త టాటెంట్‌, జెన్యూన్‌ కంటెంట్‌కి ఓ ఫ్లాట్‌ఫామ్‌ ఇవ్వడానికే కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి. సినిమా బ్యానర్స్‌ స్టార్ట్‌ చేశాం. ఈ ఫీల్డ్‌లో వచ్చినా..పోయినా ఓ శాటిస్పాక్షన్‌ ఉండిపోతుంది. ఎవరినైనా చూడగానే హీరో అని పిలవాలనిపించే వాళ్లు కొంత మందే ఉంటారు. అలాంటివాళ్లలో ఆది ఒకరు. తాప్సీ సినిమా సెలక్షన్స్‌ సెలక్టివ్‌గా ఉంటుంది. తనకు సినిమా నచ్చితే.. అందరికీ నచ్చేసినట్టే. అలాగే రితికా మా సినిమాలో చేస్తే బావుంటుందని అనుకునే కథ చెబితే తను సినిమా మొత్తం కథ విని సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఆది పెయిన్‌ఫుల్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. తనలో యాక్టరే కాదు.. మంచి వ్యక్తి. సినిమా కోసం చాలా కష్టపడతాడు. సినిమానే తన స్వార్థం. డైరెక్టర్‌ హరి ఏడాది క్రితం ఓ కథతో వచ్చాడు. ఆ కథ నాకు బాగా నచ్చింది. ఈలోపు ఈ కథ వచ్చింది. హరి అయితే బాగా చేస్తాడనిపించి.. తనను సినిమా చేయమని అన్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన హరి జాబ్‌ వదిలేసుకుని సినిమాల్లోకి వచ్చాడు. మంచి కంటెంట్‌ ఉండే సినిమా. మా బ్యానర్‌లో వచ్చిన నిన్నుకోరి తర్వాత మాకు గౌరవం, మర్యాద ఏదైతే వచ్చిందో దాన్ని ఒక మెట్టు పెంచే చిత్రమవుతుంది. ఆగస్ట్‌ 24న రాబోయే ఈ సినిమాతో కళ్లు మూసుకుని సక్సెస్‌ను కొట్టబోతున్నాం. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌'' అన్నారు.

ర‌విరాజా పినిశెట్టి మాట్లాడుతూ ``నా బిడ్డ‌ను ఆశీర్వ‌దించడానికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాకు ప్ర‌తి ఒక్క‌రూ ప‌డాల్సిన‌దానిక‌న్నా ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డారు. దాని రిజ‌ల్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇది ఎక్స్ పెరిమెంట‌ల్ సినిమా కాదు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా. డిఫ‌రెంట్ మౌల్డ్ లో ఉంటుంది. ఈసినిమా సూత్ర‌దారులు, పాత్ర‌ధారుల‌కు పెద్ద సినిమా అవుతుంది. తండ్రిగా నేను కోరుకునేది ఒక్క‌టే. ఈ సినిమాను విజ‌య‌వంతం చేసి నా బిడ్డ‌ను ఆశీర్వ‌దించండి`` అని చెప్పారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ - ''నువ్వు ఓ పనిని నమ్ముకుని నిజాయతీగా పనిచేస్తే అదే నీకు తిండి పెడుతుంది' అనే విషయాన్ని నేను నాన్నగారి నుండి నేర్చుకున్నాను. అదే నేను ఇప్పుడు చేస్తున్నాను. అందుకే పెయిన్‌ఫుల్‌ పర్‌ఫెక్ష్‌నిస్ట్‌గా మారాను. సినిమా విషయానికి వస్తే.. కోనగారు లేకుంటే ఈ సినిమా లేదు. చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఈ కథను తీసుకొచ్చారు. ఆయన ఎగ్జయిట్‌మెంట్‌ను చూసి సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఆయన బెస్ట్‌ టీమ్‌ను ఇచ్చారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. రితిక, తాప్సీ ఇద్దరూ సినిమాల ఎంపికలో సెలక్టివ్‌గానే ఉంటున్నారు. ఇక అచ్చు, ప్రసన్న, సాయిశ్రీరామ్‌ వంటి బెస్ట్‌ టెక్నీషియన్స్‌తో ప్రేక్షకుల ముందుకు ఆగస్ట్‌ 24న వస్తున్నాం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు.

శివాజీరాజా మాట్లాడుతూ ``తోక‌లేని పిట్ట నుంచి నాకు కోన వెంక‌ట్ తెలుసు. ర‌విరాజాగారి ఫ్యామిలీలో నేను ఫ్యామిలీ మెంబ‌ర్‌ని. ర‌విరాజాగారు లేక‌పోతే నేను లేను. కెరీర్ మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న నాకు ఇచ్చిన సినిమాలు నా 30 ఏళ్ల కెరీర్‌కి చాలా హెల్ప్ అయ్యాయి. ఆది నాకు చిన్న‌ప్ప‌టి నుంచి తెలుసు. నా తొలి సినిమా `క‌ళ్లు` కూడా ఇలాంటి సినిమానే. అలాంటి సినిమాలో న‌టించ‌డం ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు. ఈ సినిమాలో ఆది చాలా బాగా న‌టించాడు. త‌న పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. చిన్న‌ప్ప‌టి నుంచి న‌న్ను అంకుల్ అని పిలిచే కుర్రాడు ఈ సినిమాతో డాడీ అని పిల‌వ‌డం మొద‌లుపెట్టాడు`` అని అన్నారు.

అనీల్ సుంక‌ర మాట్లాడుతూ ``కోన‌గారు పీపుల్‌ని చాలా ఎంక‌రేజ్ చేస్తారు. న‌న్ను కూడా బిగినింగ్ డేస్‌లో చ ఆలా బాగా ఎంక‌రేజ్ చేశారు. మా దూకుడు రైట‌ర్ ఆయ‌నే. ప్ర‌తి సినిమా సాధ్యాసాధ్యాల గురించి నాతో మాట్లాడుతుండేవారు. ఆది తెలుగువాడు కావ‌డం మా గ‌ర్వ‌కార‌ణం. త‌న‌తో ఒక సినిమా త్వ‌ర‌లోనే చేస్తాం. త‌ను మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ స్టార్స్ ఇన్ తెలుగు అండ్ త‌మిళ్‌. ఆది ఆల్రెడీ ఎ స్టార్‌. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది`` అని చెప్పారు.

ప్ర‌స‌న్న‌ మాట్లాడుతూ ``మా నిర్మాత‌కు థాంక్స్. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. అచ్చు తో పాటు నేను కూడా ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. పాట‌లు బావున్నాయి. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమాలో నేనూ ఉండ‌టం ఆనందంగా ఉంది`` అని అన్నారు.

తుల‌సి మాట్లాడుతూ ``ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రూ మంచి మ‌నుషులే. ఇంత మంచి మ‌నుషులు క‌లిసి న‌టిస్తే త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. ఇలాంటి జోన‌ర్ అటెంప్ట్ చేయ‌డానికి గ‌ట్స్ కావాలి. మా ద‌ర్శ‌కుడు హ‌రిగారు చాలా బాగా అటెంప్ట్ చేశారు. కోన‌గారు, స‌త్య‌నారాయ‌ణ‌గారు బెస్ట్ ఫ్రెండ్స్. ఆది బంగారుకొండ‌. ఈ సినిమా 100 రోజుల వేడుక కోసం వెయిట్ చేస్తున్నా`` అని అన్నారు.

ఆద‌ర్శ్ మాట్లాడుతూ ``ఈ సినిమా హీరో ప్ర‌స‌న్‌, అచ్చు. చాలా బాగా మ్యూజిక్ చేశారు. పాట‌లు బావున్నాయి. వెన్నెల పాట నాకు చాలా బాగా న‌చ్చింది. ఈ సినిమాలో భాగ‌మైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో బ్లైండ్ స్క‌ల్ప్ట‌ర్ గా న‌టించా. ఆదితో ఇంకా ప‌నిచేయాల‌ని ఉంది. కోన‌గారికి అవ‌కాశానికి థాంక్స్. హ‌రినాథ్‌గారికి ధ‌న్య‌వాదాలు. ప‌వ‌ర్ ప్యాక్డ్ సినిమా ఇది`` అని చెప్పారు.

అచ్చు మాట్లాడుతూ ``అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాకు ప‌నిచేయ‌డం వండ‌ర్‌ఫుల్ ఎక్స్ పీరియ‌న్స్. ప్ర‌తి ఒక్క‌రి న‌ట‌న‌కు నేను మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాన‌నే అనుకుంటున్నాను. ప్ర‌స‌న్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు`` అని అన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved