రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్ లు గా, రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పై, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతగా బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన కథను అందించి, రాజన్న చిత్రంతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `శ్రీవల్లీ`. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కెన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, కొరటాల శివ, డైరెక్టర్ విజయేంద్రప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, శివశక్తి దత్తా, శ్రీవల్లీ, రమా రాజమౌళి, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రాజీవ్ కనకాల, నిర్మాత శిబు తమీన్స్, బి.వి.ఎస్.రవి, వక్కంతం వంశీ, రాజగోపాల్, రజత్, నేహ , కెప్టెన్ చౌదరి, శ్రీ చరణ్, ఆదిత్య నిరంజన్, మాధవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బిగ్ సీడీని ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. ఆడియో సీడీలను ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేయగా తొలి సీడీని ఎం.ఎం.కీరవాణి అందుకున్నారు.
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - ``మా సినిమాలో స్టార్ట్స్ లేరు. డ్యాన్సులు, ఫైట్స్ లేవు. కానీ మంచి కథ ఉంది. గ్రాఫిక్స్ ఉన్నాయి. కథ లేనిదే సినిమా లేదు. మన పూర్వీకులు కథలపైనే సినిమాలను నడిపించారు. ఎన్నో అద్భుతమైన కథలు రాసిన ఎందరో గొప్పవారు ఉన్నారు. ఈ సినిమాకు కూడా అంత గొప్ప కథ కుదిరింది. ఈ విషయాన్ని గర్వంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో చెబతున్నాను. మనం విశ్వాంతరాలను, అణువులు, పరమాణువులను కూడా చూడగలుగుతున్నాం. ఇవన్నీ మనసుతో చూస్తున్నాం కానీ, మన మనసులను మనమెవ్వరూ చూడలేదు. ఏ వ్యక్తి పుట్టుకతో చెడ్డవాడుగా ఉండడు. పరిసరాల ప్రభావంతో అలా మారుతాడు. దానికి కారణం మనసే. అలాంటి మనసును మనం చూడగలిగితే మనలోని ఎన్నో సిండ్రోమ్స్‌ను, ఫోబియోలను దూరం చేయవచ్చు. మానవాళిని గొప్పగా మార్చవచ్చు. దీనిపై ఓ మిషన్‌తో ప్రయోగం చేసే ఓ శాస్త్రవేత్త, అతనికి ప్రయోగంలో సపోర్ట్ చేసే అమ్మాయే శ్రీవల్లీ. మన సినిమా టైటిల్ పాత్రధారి. ఈమెను చిన్నప్పట్నుంచి ఆరాధించే యువకుడు గౌతమ్. ప్రయోగంలో చిన్న సమస్య రావడంతో శ్రీవల్లీ సమస్యలను ఎదుర్కొవడం ప్రారంభించింది. శ్రీవల్లీకి గత జన్మ జ్
ఞాపకాలు గుర్తుకు రావడం మొదలయ్యాయి. ఆ అమ్మాయిని ప్రేమించే మర యువకుడు ఈ జన్మలో ఉంటాడు.వీరు కాకుండా మరో అమ్మాయి కూడా శ్రీవల్లీ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని వెంటపడుతుంది. అప్పుడు శ్రీవల్లీ ఏం చేసింది. సమస్య నుండి ఎలా భయపడిందనేదే కథ. ఇప్పటి వరకు రాని కథ. నిర్మాతలు నమ్మి సినిమా చేశారు. రేపు సినిమా చూసే ఆడియెన్స్ కూడా మంచి సినిమా చూశామని తృప్తిగా వెళతారు. ఈ సినిమాకు అడుగడుగునా నాకు అండగా నిలబడ్డ నటీనటులకు, టెక్నిషియన్స్‌కు, నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ``మానవ మసస్తత్వంపై సినిమా తీసి ప్రేక్షకులను చూడమని చెప్పి విజయేంద్రప్రసాద్ రిస్క్ చేస్తున్నారు. దర్శకుడుగా విజయేంద్రప్రసాద్, తన కొడుకు రాజమౌళితో పోటీ పడుతున్నాడు. మానవ మనస్తత్వ కోణాన్ని ఎంచుకుని చేసిన ఈ సినిమా బాగా ఆడి, విజయేంద్రప్రసాద్ దర్శకుడుగా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ``విజయేంద్రప్రసాద్‌గారి ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. ఇప్పటికీ ఎలా పని చేయాలనే దానిపై ఆయన నాకు చాలా ఇన్‌స్పిరేషన్. సినిమా పెద్ద హిట్ కావాలి`` అన్నారు.
శిబు తమీన్స్ మాట్లాడుతూ - ``సాంగ్స్ బావున్నాయి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఇతర భాషల్లో కూడా అనువదించబడి అక్కడ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
వక్కంతం వంశీ మాట్లాడుతూ - ``విజయేంద్ర ప్రసాద్‌గారు తెలుగు సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన రచయిత. తెలుగులో సినిమాల్లో ఏదో చెప్పాలని చెప్పే ప్రయత్నాన్నీ ఈ సినిమాతో చేస్తున్నారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ - ``నా ఆడియో వేడుకకు రాజమౌళి అన్న, కీరవాణి అన్న అతిథులుగా రావడం ఎంతో ఆనందంగా ఉంది. మ్యూజిక్ పరంగా నాకు ఓకే ఆలోచనే ఉండేది. కానీ ధర్మచక్రం, తాజమహల్ టైంలో రాజమౌలి అన్న నా ఆలోచనను మార్చేశారు. అప్పటి నుండి కొత్తగా ఆలోచించడం ప్రారంభించాను. శ్రీకృష్ణ 2016 తర్వాత విజయేంద్రప్రసాద్‌గారితో చేస్తున్న సినిమా శ్రీవల్లీ. ఈ పాటలన్నీ ఒక్కొక్క ట్యూన్ పది నుండి పదిహేను నిమిషాల టైంలోనే చేశాను. నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చినందుకు విజయేంద్రప్రసాద్‌గారికి థాంక్స్`` అన్నారు.
ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ - ``కథకు, కథనానికి బలాన్ని చేకూర్చేలా సంగీతం, సాహిత్యం ఉంది. శ్రీలేఖ, శ్రీచరణ్‌కు అభినందనలు. నేను సంగీతం నేర్చుకున్న కొత్తలో రాజామణి అనే సంగీత దర్శకుడి వద్దకు పనిలో చేరడానికి వెళ్లాను. నన్ను పరీక్షించిన ఆయన రేపు మా సంగీతం ట్రూప్ బెంగుళూరు వెళుతున్నాం. ఖాళీగా ఉన్న టికెట్‌పై నువ్వు బెంగుళూరు వచ్చెయ్ అన్నారు. నేను బయలుదేరుతుంటే టికెట్స్ క్యాన్సిల్ అయిపోయిందని అన్నారు. నేను నిరుత్సాహపడ్డాను. అప్పుడు విజయేంద్రప్రసాద్ చిన్నాన్న నాకు ధైర్యం చెప్పి, ట్రెయిన్‌లో ఎక్కి అందరి కంటే ముందు రికార్డింగ్ థియేటర్‌కు వెళ్లమని అన్నారు. నేను కూడా ఆయన మాటను విని ఆయన చెప్పినట్టే చేయడంతో నా సిన్సియారిటీ వారికి నచ్చింది. అలా నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. సాధారణంగా వాడు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటుంటారు. కానీ నేను ఎక్కాల్సిన రైలు జీవితకాలం ముందర అయ్యేటట్లు చేసిన చిన్నాన్నకు థాంక్స్. ఎప్పుడు చూడని సీన్స్, కథాంశం ఈ సినిమా ఉంటుదని భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు టీం`` అన్నారు.
కొరటాల శివ మాట్లాడుతూ - ``విజయేంద్రప్రసాద్, రాజమౌళిగారి ఫ్యామిలీని చూసినప్పుడు సినిమా అంటే అంత ఫ్యాషన్ ఉన్న కుటుంబం ఉండదేమోననిపిస్తుంది. నేను రైటర్, డైరెక్టర్‌గా రాజమౌళిగారిలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలనే గోల్‌లో ఉంటాను. అలాగే రైటర్‌గా విజయేంద్రప్రసాద్‌గారిలా గొప్ప కథలు రాయాలనుకుంటాను. విజయేంద్రప్రసాద్‌గారు రాసిన బొబ్బిలిసింహం, సమరసింహారెడ్డి సినిమాలు చూశాం. అప్పటికీ, ఇప్పటికీ ఆయనేమైనా తగ్గుతారా అంటే అది కూడా లేకుండా పెరుగుతూ వస్తున్నారు. ఏ సినిమా వస్తున్నా, ఈ కథ ఏ జోనరో, ఎన్ని ఎమోషన్స్ ఉంటాయోనని ఎదురుచూస్తుంటాను. శ్రీవల్లీ కథ వింటే విజయేంద్రప్రసాద్‌గారిలో ఇంత అడ్వాన్స్ ఆలోచనలున్నాయా అనిపిస్తుంది. శ్రీలేఖగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత సునీత మాట్లాడుతూ - ``నా బ్యానర్‌పై తొలి సినిమాగా విజయేంద్రప్రసాద్‌గారి దర్శకత్వంలో చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఏ పాటకు ఎలాంటి మ్యూజిక్ కావాలి, ఎవరు రాస్తే బావుంటుందనే ప్రతి విషయాన్ని దగ్గరుండి విజయేంద్రప్రసాద్‌గారు చూసుకున్నారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఓ శాస్తవేత్త చేయాలనుకున్న, చెప్పాలనుకున్న మంచి విషయాన్ని ఎలా పక్కదారి పట్టించారు. దాని వల్ల ఏం జరిగిందనేదే కథ. మా సినిమా ప్రయాణంలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
నేహా హింగే మాట్లాడుతూ - ``ఈ సినిమాలో యాక్ట్ చేయడం ఆనందంగా ఎంజాయ్ చేశాను. వ్యక్తిగా పరిణితి కనపడింది. వ్యక్తిగతంగా, మానసికంగా బలంగా తయారైయ్యాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
రజత్ మాట్లాడుతూ - ``మంచి నటీనటులు, టెక్నిషియన్స్ కారణంగానే సినిమా బాగా వచ్చింది. నేహ మంచి పెర్‌ఫార్మర్. ఒక మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది`` అన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ - ``మా నాన్నగారిని చూసి గర్వపడ్డ క్షణాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చెబుతాను.. తాతగారు సంపాదించిన ఆస్థులన్నీ హరించుకుని పోయిన తర్వాత పెద్దనాన్నగారు, నాన్నగారు ఘోస్ట్ రైటర్స్‌గా డబ్బులు సంపాదించుకుని వచ్చేవారు. వారు పేర్లు రైటర్స్‌గా ఎప్పుడు పడతాయనే కోరిక ఉండేది. అలా చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత జానకిరాముడు సినిమాకు తొలిసారి మాళ్ల పేర్లు తెరపై పడింది. అప్పుడు ఆ పేర్లు చూసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. నాన్నగారి దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పనిచేస్తున్నప్పుడు పాతికేళ్ల క్రితం సునామీ గురించి చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం సునామీ వల్ల ఇండియాలో కలిగిన ఎఫెక్ట్ చూసి అర్థమైంది. అంటే సునామీ గురించి నాన్నగారు ఎప్పుడో చెప్పారు కదా అని గర్వంగా అనిపించింది. అలాగే రెండు వారాల గ్యాప్‌లో బాహుబలి, భజరంగీ బాయ్‌జాన్ అనే రెండు బ్లాక్ బస్టర్ కథలను రాసిన రచయితగా నాన్నగారికి పేరు వచ్చినప్పుడు కూడా నాకు గర్వంగా అనిపించింది. ఇలా నాన్నను చూసి నేను గర్వపడ్డ క్షణాలు చాలా ఉన్నాయి. ఈ శ్రీవల్లీ కథ వినప్పుడు ఐడి
యా బావుంది కానీ, డెవలప్ మెంట్ బాలేదని చెప్పాను. ఆయన చేసిన మార్పులతో ఈరోజు కథను చెప్పారు. స్టోరీ వినగానే స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్ గా ఉంది. తీయాలంటే చాలా డైరెక్షనల్ స్కిల్స్ కావాలని చెప్పాను. ఇప్పుడు సాంగ్స్, థియేట్రికల్ చూశాను. రైటర్‌గా నాన్నెంత గొప్పవారు నాకు తెలుసు. డైరెక్టర్ గా సినిమాను అంత గొప్పగా తీసినప్పుడు నాకు కొడుకుగా గర్వంగా అనిపిస్తుంది. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. కొడుకుగా గర్వపడ్డా, డైరెక్టర్‌గా దెబ్బలాడుతాను. ఎందుకంటే ఆయన నా సినిమాల్లో తప్పలెతుకుతుంటారు. అలాగే ఈ సినిమా విషయంలో కొడుకుగా గర్వపడ్డా, డైరెక్టర్‌గా దెబ్బలాడే క్షణం కోసం ఎదురుచూస్తుంటాను. శ్రీవల్లీ పెద్ద సక్సెస్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలను, టీంకు మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను`` అన్నారు.
రాజీవ్‌కనకాల, అరహన్‌ఖాన్, సుఫీ సయ్యద్, హేమ, సత్యకృష్ణ, కెప్టెన్ చౌదరి, ఝాన్సీ, రేఖ, మాస్టర్ సాత్విక్, మాస్టర్ సమీర్, బేబి సమ్రీన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, నేపథ్య సంగీతం: శ్రీ చరణ్, పాటలు: శివశక్తి దత్త, అనంత్ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: విజయేంద్రప్రసాద్.