pizza
Super Sketch music launch
`సూప‌ర్ స్కెచ్` ఆడియో వేడుక‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 June 2018
Hyderabad


శ్ర శుక్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న చిత్రం `సూప‌ర్ స్కెచ్‌`. న‌ర్సింగ్ మ‌క్క‌ల, ఇంద్ర‌, స‌మీర్ ద‌త్త‌, కార్తీక్ రెడ్డి, చ‌క్రి మాగంటి, సోఫియా సింగ్‌, గ్యారీ ట్యాన్ టోనీ, అనికా రావు, సుభాంగి కీల‌క పాత్ర‌ధారులు. ర‌వి చావ‌లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ‌ల‌రామ్ మ‌క్క‌ల‌, ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మాత‌లు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌లైంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ఆడియో విడుద‌ల చేశారు. ర‌విచావ‌లి తొలి కాపీని అందుకున్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``డ్ర‌గ్స్ కి బానిస‌లు అయిన న‌లుగురు తెలివైన క్రిమిన‌ల్స్ అంద‌రి ద‌గ్గ‌ర మంచిగా న‌టిస్తూ పోలీసుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటారు. ఇంకా ఆ న‌లుగురికి రాజ‌కీయంగా స‌పోర్ట్ ఉండ‌టంతో పోలీసులు కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. కానీ నిజాయ‌తీ గ‌ల పోలీస్ ఆఫీస‌ర్ నాయ‌క్ ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారి ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ వారిని ఎలా అరెస్ట్ చేశాడ‌నేది ఆస‌క్తిక‌రం. మా సంగీత ద‌ర్శ‌కుడు కార్తీక్ మంచి బాణీలిచ్చారు. ఆయ‌న అమెరికాలో ఉండ‌టం వ‌ల్ల ఈ వేడుక‌కు రాలేక‌పోయారు. మా సినిమాకు స‌క్సెస్ మొద‌లైంద‌ని ధైర్యంగా చెబుతున్నాను. మా సినిమా డ‌బ్బింగ్‌కి అడిగిన వాళ్లు ఇప్పుడు రీమేక్ చేయ‌డానికి ముందుకొస్తున్నారు. పాజిటివిటీ అక్క‌డే క‌నిపిస్తోంది. జూన్ 29న సినిమాను విడుద‌ల చేస్తాం`` అని చెప్పారు.

సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ ```ది ఎండ్‌`, `సామాన్యుడు` సినిమాల‌తో ర‌వి చావ‌లి త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆ రెండు సినిమాలు నాకు ఇష్టం. ఈ సినిమా కూడా అంత‌కు మించి పెద్ద హిట్ కావాలి. కొత్త న‌టీన‌టులు అంద‌రికీ ఆల్ ది బెస్ట్. ఆడియో మంచి స‌క్సెస్ కావాలి`` అని చెప్పారు.

ఇంద్ర మాట్లాడుతూ ``మంచి పాత్ర చేశాను. త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది`` అని అన్నారు.

న‌ర్సింగ్ మ‌క్క‌ల మాట్లాడుతూ ``మామూలుగా తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ‌, బోనాలు రెండు పెద్ద పండుగ‌లు. ఈ నెల 29న తెలంగాణ డైలాగుల పండుగ ఈ సినిమాతో రానుంది. తెలంగాణ యాస‌, భాష‌కున్న ప్ర‌త్యేక‌త అలాంటిది. `ఫిదా` సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆద‌రించారు. అలాగే మా చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ త‌ర‌హా చిత్ర‌మిది. అనూహ్యంగా సాగుతుంటుంది`` అని తెలిపారు.

నిర్మాత ప‌ద్మ‌నాభ‌రెడ్డి మాట్లాడుతూ ``త‌ప్ప‌కుండా సినిమా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. మంచి డైలాగులు కూడా కుదిరాయి`` అని చెప్పారు. ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌: యు అండ్ ఐ. స‌హ నిర్మాణం: ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడ‌మీ, స్టంట్స్: జాషువా, రామ‌కృష్ణ‌, నృత్యాలు: పోలాకి విజ‌య్‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికి, సంగీతం: కార్తీక్ కొడ‌కండ్ల‌, కెమెరా: సురేంద్ర రెడ్డి.టి., ద‌ర్శ‌కుడు: ర‌వి చావ‌లి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved