pizza
Varma Vs Sharma music launch
అలరిస్తున్న 'వర్మ vs శర్మ' పాటలు ​
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 November 2016
Hyderaba
d

మాస్టర్ నార్ని చంద్రాంషువు సమర్పణలో పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై బి.భువన విజయ్ దర్శకత్వంలో కామెడీ సెటైర్ గా రూపొందిన చిత్రం 'వర్మ vs శర్మ'. బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటించగా గిరిబాబు, జూ.రేలంగి టైటిల్ రోల్స్ పోషించారు. ఇటీవలె పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో జరిగిన ఆడియో రిలీజ్ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖా మాత్యులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు ఆడియో విడుదల చేశారు. లహరి మ్యూజిక్ ద్వారా పాటలు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి.

ఈ సందర్భంగా..
మంత్రి శ్రీ పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ.. "వర్మ మరియు శర్మల పాత్రలు చూస్తుంటే.. నమ్మకం-మూఢ నమ్మకాల పై కామెడీ ప్రధానంగా రూపొందించిన చిత్రం గా తాను భావిస్తున్నానని అన్నారు. ఎక్కువ శాతం ప్రాంతీయ కళాకారులతో రూపొందించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన క్లాస్ మేట్ అని" ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ..
"మన జిల్లా కళాకారులతో రూపొందిన చిత్రం మన మధ్యే ఆడియో విడుదల జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని'' అన్నారు.

గూడెం మున్సిపల్ చైర్మన్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "నూతన నటీనటులతో రూపొందిన ఈ చిత్రం అందరినీ తప్పక అలరిస్తుందని అన్నారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న బాబ్ రతన్ తాడేపల్లిగూడెంలో నూతనంగా నిర్మించబోయే బ్లడ్ బ్యాంక్ కు 10 లక్షల రూపాయల విరాళంగా ఇచ్చారని" ఈ సందర్భంగా గుర్తుచేశారు.

హీరో బాబ్ రతన్ మాట్లాడుతూ.. "సోషల్ కాజ్ ఉన్న కథ కారణంగానే తానీ చిత్రం చేయాల్సి వచ్చిందని, డాక్టర్ గా తనను ఆదరించిన ప్రజలు ఇకపై ఏక్టర్ గా కూడా గుర్తిస్తారని భావిస్తున్నానని" అన్నారు.

దర్శకుడు బి.భువన విజయ్ మాట్లాడుతూ... ''వర్మ,శర్మ పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ టైటిల్ కు తగ్గట్లే సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వారిద్దరి మధ్య టివి లో వచ్చే డిబేట్స్ అందరినీ నవ్విస్తాయి. మాటలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ" అని అన్నారు.

నిర్మాత ఫణి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ..."గతంలో బి.భువన్ విజయ్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి తనకు ఈ అవకాశం ఇచ్చానని, దర్శకుడు ఫీల్ గుడ్ మరియు హ్యూమర్ తో కూడిన చక్కని కథను రూపొందించాడని" అన్నారు. డిసెంబర్ మూడోవారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పట్టపగలు వెంకట్రావు, నార్ని నరసింహారావు, గట్టిం మాణిక్యాలరావు,బుద్దాల రామారావు,బొలిశెట్టి శ్రీనివాస్, కిలాడి ప్రసాద్,తిరుమల పాండురంగారావు, డా.సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

గిరిబాబు, జూ.రేలంగి, బాబ్ రతన్, బిందు బార్బీ, దీక్షితులు, రమణ సూరంపూడి, అడ్డకర్ల, బాబులు, గాంధీ, ఉదయబాబు,నరసింహమూర్తి, తిరుపతి రావు, అజయ్, శ్రీరామ్, వాసు, బుల్లబ్బాయి, భారతి, లలిత,మౌనిక,లక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రమణ్ రాథోడ్, కెమెరా: జి.రంగ, ఎడిటింగ్: ప్రభు, పాటలు: రమణ్ లోక్, కొరియోగ్రఫీ: బ్రో.ఆనంద్, ఆర్ట్: హరి, నిర్మాత: నార్ని ఫణి దుర్గా ప్రసాద్(చినబాబు), రచన-దర్శకత్వం: బి.భువన విజయ్.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved