pizza
Naresh Birthday celebrations 2017
సీనియ‌ర్ న‌రేష్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 January 2017
Hyderaba
d

'పండంటి కాపురం' చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేసి 'నాలుగు స్తంభాలాట', 'ప్రేమ సంకెళ్లు', 'రెండు జెళ్ల సీత' 'చిత్రం భళారే విచిత్రం', 'జంబలకిడి పంబ' వంటి వంటి 150కు పైగా చిత్రాల్లో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుటుగా న‌టించిన న‌టుడు సీనియ‌ర్ న‌రేష్‌. మా అసోసియేష‌న్ స‌భ్యుడిగా కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్‌గా సంక్రాంతి కానుకగా విడుదలైన 'శతమానం భవతి' చిత్రంలో బంగార్రాజు క్యారెక్టర్‌లో నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అనంతపురం జిల్లాను దత్తతు చేసుకుని అక్కడ 'కళాకారుల ఐక్య వేదిక' సంఘాన్ని ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. నటుడిగానే కాకుండా సేవాతత్పరుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంటున్న నరేష్‌ పుట్టినరోజు జనవరి 20. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో ఆయన స్వగృహంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ-శ్రీమతి విజయనిర్మల, సహజనటి జయసుధ, 'మా' అధ్యక్షులు, డా. రాజేంద్రప్రసాద్‌, కార్యదర్శి శివాజీ రాజా, సీనియర్‌ జర్నలిస్ట్‌లు బి.ఎ.రాజు, వినాయకరావు, సురేష్‌ కొండేటి, హీరోలు సుధీర్‌బాబు, నవీన్‌, నటుడు గౌతంరాజు, నటి హేమ తదితరులు పాల్గొన్నారు.

సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ - ''హీరోగా ఎన్నో సూపర్‌హిట్‌ ఫిలింస్‌, హండ్రెడ్‌ డేస్‌, సిల్వర్‌ జూబ్లీ చిత్రాల్లో నరేష్‌ యక్ట్‌ చేశాడు. కొంతకాలం గ్యాప్‌ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్స్‌ చేసి 'ఘటన' చిత్రంలో డిఫరెంట్‌ విలన్‌ క్యారెక్టర్ చేస్తున్నాడు. అ..ఆ, శ‌త‌మానం భ‌వ‌తి, దృశ్యం, 'గుంటూరు టాకీస్‌' చిత్రాల్లో డిఫ‌రెంట్ రోల్స్ ద్వారా అల‌రిస్తున్నాడు. న‌రేష్ మరిన్ని మంచి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకోవాలి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి'' అన్నారు.

శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ - '' రకరకాల వాయిద్యాలతో ఒళ్లు జలదరించేలా కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మా నరేష్‌ వంద సంవత్సరాలు నిండు నూరేళ్లు హాయిగా బ్రతకాలని, కళాకారులు ఆశీర్వదించడం సంతోషంగా వుంది. ఇక్కడకు వచ్చిన మా అభిమానులందరికీ నా ధన్యవాదాలు'' అన్నారు.

'మా' అధ్యక్షుడు, నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ - `` నేను, న‌రేష్ ఇద్దరం జంధ్యాలగారి చిత్రాల ద్వారా హీరోగా పరిచయం అయి ఎన్నో చిత్రాల్లో యాక్ట్‌ చేశాం. నేను సినిమాల్లోకి రాకముందు నుండి నరేష్‌తో మంచి రిలేష‌న్ ఉండేది. నరేష్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి సినిమాలు చేసి మరింత పేరు తెచ్చుకోవాలి'' అన్నారు.

నరేష్‌ మాట్లాడుతూ - `` తెలుగు రాష్ట్రాల నుండి అభిమానులు తరలి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు నా బర్త్‌డేకి ఒక ప్రత్యేకత వుంది. నేను దత్తత తీసుకున్న హిందూపూర్‌, అనంతపురం జిల్లాలోని ఎంతోమంది కళాకారులు తమ డప్పు వాయిద్యాలతో వచ్చి వారి కళను ప్రదర్శించడం మర్చిపోలేని అనుభూతిని కల్గించింది. కృష్ణగారు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సత్కరించుకోవడం చాలా ఆనందంగా వుంది. హిందుపురంలో 16 మందితో కళాకారుల ఐక్యవేదిక సంఘాన్ని స్థాపించాం. 11 వేల మందికి పక్కా గృహాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు ఇప్పించాం. 18,000 వేలమంది కళాకారులను ప్రోత్సాహించి ఉపాధిని కల్పిస్తున్నాం. వెయ్యిమందికి ఉచిత విద్యను అందిస్తున్నాం. రీసెంట్‌గా సంక్రాంతికి రిలీజ్‌ అయిన 'శతమానం భవతి' సూపర్‌హిట్‌ అయి 30 కోట్లు కలెక్ట్‌ చేసిందని విన్నాను. ఇంకా మరిన్ని డిఫరెంట్‌ క్యరెక్టర్స్‌ చేసి నా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అనంతపురం జిల్లాకి నన్ను దత్తత ఇచ్చిన నా తల్లికి, 8000 మంది కళాకారుల ప్రేమను పంచుతున్నారు. కళాకారుల ఐక్య వేదికకు గౌరవ అధ్యక్షులుగా అమ్మకు కిరీటంతో సత్కరించుకోవడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

అనంతపురం కళాకారుల ఐక్య వేదిక బ్రోచర్‌ను డా.రాజేంద్రప్రసాద్‌ రిలీజ్‌ చేసి తొలి ప్రతిని కృష్ణ-విజయనిర్మలకు అందించారు. ఇదే కార్యక్రమంలో 'మా' అసోసియేషన్‌ సభ్యులందర్నీ ఘనంగా సత్కరించి షీల్డ్‌లను అందజేశారు. అలాగే సీనియర్‌ అభిమానుల్ని ఘనంగా సత్కరించి షీల్డ్‌లను బహుకరించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌లు బి.ఎ.రాజు, వినాయకరావు, సురేష్‌ కొండేటి, మేకప్‌మేన్‌ మాధవరావు, యువ కళావాహిని వై.కె.నాగేశ్వరరావు, శృతిలయ అకాడమీ ఆమనిలను నరేష్‌ ఘనంగా శాలువా బొకేలతో సత్కరించి షీల్డ్‌లను బహుకరించారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved