pizza
Vijaya Nirmala Birthday celebrations 2018
అభిమానుల సమక్షంలో ఘనంగా విజయనిర్మల 73వ జన్మదిన వేడుకలు !!
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

20 February 2018
Hyderabad

సినిమా అనే రంగుల ప్రపంచంలోదర్శకత్వ శాఖకు ఉన్న ప్రత్యేకతే వేరు. సినిమాకు సంబంధించిన 24 శాఖలను సమర్ధవంతంగా హ్యండిల్‌ చేస్తూ సినిమా పూర్తి చేయడమంటే సాధారణ విషయం కాదు. ముఖ్యంగా దర్శకత్వం ప్రతిభలో తానెవరికీ తీసిపోననే మహిళా దర్శకురాల్లో ఎన్నదగ్గ మహిళా దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల. ఒకటి.. రెండు కాదు.. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచంలో నెంబర్‌వన్‌ దర్శకురాలిగా చోటుని దక్కించుకున్నారు. అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో నటిగా తెలుగు చిత్రసీమలో తనదైన గుర్తింపును సాధించిన విజ‌య‌నిర్మ‌ల పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని విజ‌య నిర్మ‌ల స్వ‌గృహంలో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ...

కృష్ణ మాట్లాడుతూ - ``విజ‌య నిర్మ‌ల‌గారు డైరెక్ట్ చేసిన చిత్రాల్లో 50 శాతం సినిమాలు నేనే న‌టించాను. అలాగే మిగిలిన సినిమాలను మిగిలిన హీరోల‌తో డైరెక్ట్ చేశాను. ఏఎన్నార్‌గారు, శివాజీ గ‌ణేష‌న్‌గారితో, ర‌జనీకాంత్‌గారి వంటి స్టార్ హీరోల‌తోనే కాకుండా చంద్ర‌మోహ‌న్‌, ముర‌ళీమోహ‌న్‌, రంగ‌నాథ్, న‌రేష్ వంటి వారితో కూడా హిట్ సినిమాలు చేశారు. ఇన్ని హిట్ సినిమాలు చేసిన మ‌హిళా ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మ‌ల‌ను మ‌న‌మంద‌ర‌మూ అభినందించాలి. గిన్నిస్ రికార్డులో స్థానం ద‌క్కించుకున్న విజ‌య‌నిర్మ‌ల మ‌రో ఐదారు సినిమాలు చేస్తే యాభై సినిమాలు చేసిన ద‌ర్శ‌కురాల‌వుతుంది. ఆ సినిమాల‌ను కూడా చేయాల‌ని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్‌గారు విజ‌య‌నిర్మ‌ల‌గారికి ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి రెక‌మండ్ చేశారు. భ‌విష్య‌త్‌లో అయినా విజ‌య‌నిర్మ‌ల‌గారికి ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు వ‌స్తుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

విజ‌య నిర్మ‌ల మాట్లాడుతూ - ``మా అభిమానులను నా చుట్టాలుగా భావిస్తుంటాం. ఓ పుట్టిన‌రోజున దాస‌రిగారు మా ఇంటికి వ‌చ్చారు. నా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చూసి ఏ హీరోయిన్‌కి ద‌క్క‌ని అభిమాన గ‌ణం, పేరు నీకు ద‌క్కింది అని ఆనందంతో ప్ర‌శంసించారు. అదే నాకు ద‌క్కిన ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుగా ప‌రిగ‌ణిస్తాను`` అన్నారు.

న‌రేష్ మాట్లాడుతూ - ``మా అభిమానులను ఇంట్లోని స‌భ్యులుగానే భావిస్తుంటాం. విజ‌య‌నిర్మ‌ల‌గారు నాకే... కాదు. ఇండ‌స్ట్రీకే అమ్మ. ఆవిడ ఇలాంటి పుట్టిన‌రోజుల‌ను మరెన్నింటినో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

బి.ఎ.రాజు మాట్లాడుతూ - ``విజ‌య‌నిర్మల‌గారు న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా సాధించిన ఘ‌న‌త‌ను మ‌రెవ్వ‌రూ సాధించ‌లేరు. ఆవిడ ఇండ‌స్ట్రీకి చేసిన సేవ‌ల‌కుగానూ కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వ‌లేదని భావిస్తున్నాం. కేంద్ర ప్ర‌భుత్వం విజ‌య‌నిర్మ‌ల‌గారికి ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్ వంటి అవార్డుల‌ను ప్ర‌దానం చేయాల‌ని అభిమానులంద‌రి త‌రపున కోరుకుంటున్నాను`` అన్నారు.

న‌వీన్ విజ‌య్ కృష్ణ మాట్లాడుతూ - ``న‌టిగా గొప్ప‌గా రాణించిన నాన్న‌మ్మ ద‌ర్శ‌కురాలిగా ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. ఆమెలా మ‌రో ద‌ర్శ‌కురాలు ప్ర‌పంచంలో లేదు. ఇక‌పై కూడా ఉండ‌రు. ఇంత మంది హీరోల‌తో 48 చిత్రాలు చేయ‌డం గొప్ప విష‌యం. ఆమె 50 సినిమాల‌ను పూర్తి చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు

ఈ కార్య‌క్ర‌మంలో సంతోషం సురేష్‌, ఖాద‌ర్ గోరి త‌దిత‌ర అభిమానులు పాల్గొన్నారు.


 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved