pizza
Kutumba Katha Chitram first look launch
విడుదలైన కుటుంబ కథా చిత్రం టీజర్
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 November 2017
Hyderabad

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా సమర్పణలో నందు, శ్రీముఖి, కమల్ కామరాజు ప్రధాన పాత్ర దారులుగా వి ఎస్ వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కుటుంబ కథా చిత్రం' ఈ చిత్రానికి నిర్మాత దాసరి భాస్కర్ యాదవ్. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను హీరో నందు, కమల్ కమరాజు, కత్తి మహేష్ విడుదల చేయగా టీజర్ ను నిర్మాత మల్కాపురం శివ కుమార్ గురువారం ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు.. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ టీజర్, మోషన్ పోస్టర్లు ఏవిధంగా అలరించాయో అదేవిధంగా ట్రైలర్ మరియు సినిమా కూడా ఉంటాయి, నిజంగా కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది ఈ చిత్ర కాన్సెప్ట్.. డైరెక్టర్ వాసు కథ చెప్పినప్పుడే ఈ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాను.. అనుకున్న బడ్జెట్ లొనే సినిమాను పూర్తి చేసాము, సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అన్నారు. దర్శకుడు వాసు మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒకరికి మనం రుణపడి ఉంటాము నేను కూడా నా జీవితంలో నిర్మాత భాస్కర్ గారికి ఋణపడి ఉంటాను, నన్ను నమ్మి సినిమా చేస్తున్నందుకు... 1980 లో కుటుంబం అంటే అందరూ కలసి ఉండేవారు కానీ 2017 లో కుటుంబం అంటే ముగ్గురు లేక నలుగురు మాత్రమే ఉంటున్నారు.. ఈ చిత్రం కూడా 2017 సంవత్సరం లో ఉన్న జెనెరేషన్ కు తగ్గట్టు కాన్సెప్ట్ ఉంటుంది.. ప్రేమతో గొడవ పడే ఒక ఫ్యామిలీ లోకి ఆ ఇంటి సెక్యూరిటీనే రాబంధువులా మారితే ఆ పరిణామం ఎలా ఉంటుందో తెలిపేదే ఈ మా కుటుంబ కథాచిత్రం.. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా అన్నారు. ఏ చిత్రానికైనా కావాల్సింది ఆర్ ఆర్.. అదే ఈ చిత్రంలో ఉందని టీజర్ చూస్తే అర్థమవుతుందని అన్నారు కత్తి మహేష్.. మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ, "తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఫ్రైడే దాదాపు 10 నుంచి 15కోట్లు హుసేన్ సాగర్లో పోసినట్టు ఉంటోంది.. ప్రమోషన్స్ కు ఒక కోటి రూపాయలు ఖర్చుపెడుతా అని చెప్పిన నిర్మాత భాస్కర్ గట్స్ ను అభినందించాల్సిన అవసరం ఉంది.. ప్రతి ప్రేక్షకునికి రీచ్ అయ్యే టైటిల్ పెట్టడం లొనే సగం సక్సెస్ అయ్యారని అనుకుంటున్నా... టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా టీజర్ మాత్రం పెద్ద సినిమా డైరెక్షన్ లా కనిపిస్తుంది అందుకే ఈ టీజర్ చూసినప్పుడే నిర్ణయించుకున్నా చిత్రానికి అండగా ఉండాలని, ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్" అని చెప్పారు.

"డిఫరెంట్ కాన్సెప్ట్, ఫ్రెష్ స్క్రీన్ ప్లే ఉండడం తోనే ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించాను, కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది ఈ సినిమా" అని హీరో నందు తెలిపారు, అనంతరం కమల్ కామరాజు మాట్లాడుతూ, "ఇంతకుముందు నేను చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో చేసిన రోల్ కు మంచి పేరొస్తుందని భావిస్తున్నా... డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండడం వలనే ఈ సినిమా చేయడానికి అంగీకరించడం జరిగింది, ఇందులో నా పాత్ర నెగటివ్ షేడో పోసిటివ్ షెడో సినిమా ఎండింగ్ లో తెలుస్తుంది.. ఒక కట్ కూడా లేకుండా నటించడం జరిగింది గ్రేట్ స్క్రిప్ట్ ఉండడమే దీనికి కారణం ఈ స్టోరీ ని ఏ భాషలో చేసినా ఆడే దమ్ముందని ఘంటాపదంగా చెప్పగలను" అని చెప్పారు. "డిఫరెంట్ కాన్సెప్ట్.. కొత్త స్క్రీన్ ప్లే ఉండటంతోనే ఈ సినిమా కు పని చేయడానికి అంగీకరించాను " అని డీఓపీ జోషి అన్నారు...

నందు, శ్రీముఖి, కమల్ కామరాజు, సూర్య నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, డీఓపీ: మల్హర్ భట్ జోషి, నిర్మాత: దాసరి భాస్కర్ యాదవ్, డైరెక్టర్: వి. ఎస్ వాసు, పిఆర్వో: వంశి శేఖర్..

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved